AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Prices: మళ్లీ పెరిగిన చికెన్, కోడి గ్రుడ్ల ధరలు.. వామ్మో.. ఒకేసారి ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు మళ్ళీ భారీగా పెరిగాయి. గత వారంతో పోలిస్తే కిలోపై 20 నుంచి 30 రూపాయల మేర పెరుగుదల నమోదైంది. పౌల్ట్రీ ఉత్పత్తి, సరఫరాలో వచ్చిన వ్యత్యాసాలే ధరల పెరుగుదలకు కారణమని అంటున్నారు. నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు మరింత భారంగా మారింది.

Chicken Prices: మళ్లీ పెరిగిన చికెన్, కోడి గ్రుడ్ల ధరలు.. వామ్మో.. ఒకేసారి ఎంతంటే..?
Chicken Prices
Venkatrao Lella
|

Updated on: Sep 26, 2026 | 10:43 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో చికెనె ధరలు భగ్గుమంటున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో చికెన్ ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. నాన్‌వెజ్ ప్రియులకు ఇది బ్యాడ్‌న్యూస్‌గా చెప్పవచ్చు. గత వారంతో పోలిస్తే ఈ వారం చికెన్ ధరలు కిలోపై రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగాయి. ఈ పెరుగుదలతో రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. గత వారంలో కిలో చికెన్ రూ.250 నుంచి రూ.260 వరకు ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.290 వరకు చేరుకున్నాయి. ప్రస్తుత పెరుగుదల చూస్తుంటే.. కొద్ది రోజుల్లో రూ.300 క్రాస్ చేయనుందని చెప్పవచ్చు. త్వరలో దసరా, దీపావళి పండుగ రానన్న చికెన్ ధరలకు రెక్కలొస్తున్నాయి. రోజురోజుకి ధరలు పెరిగిపోతున్నాయి.  గత నెలలో తగ్గగా.. ఇప్పుడు పండుగ సీజన్ వస్తున్న క్రమంలో ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో స్కిన్ లెస్ ధర రూ.287గా ఉండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.254, రిటైల్ లైవ్ బర్డ్ రూ.164, ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.137 వద్ద కొనసాగుతోంది. ఇక కరీంనగర్ జోన్‌లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అటు ఏపీలో కూడా చికెన్ ధరలు పెరిగాయి. విజయవాడ జోన్‌లో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.284 వద్ద కొనసాగుతుండగా.. డ్రస్స్‌డ్ చికెన్ ధర రూ.251గా ఉంది. ఇక రిటైల్ లైవ్ బర్డ్ రూ.162, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.135 వద్ద కొనసాగుతోంది.

కోడి గ్రుడ్ల ధరలు పెరిగాయ్..

ఇక చికెన్‌తో పాటు కోడి గ్రుడ్ల ధరలు కూడా పెరిగాయి. విజయవాడ జోన్‌లో 12 గ్రుడ్ల రిటైల్ ధర రూ.80గా ఉంది. ఇక హైదరాబాద్, కరీంనగర్ జోన్‌లో 12 గ్రుడ్ల రిటైల్ ధర రూ.74 వద్ద కొనసాగుతోంది.

ధరల పెరుగుదలకు కారణాలు

పౌల్ట్రీ ఉత్పత్తి, సరఫరాలో వచ్చిన వ్యత్యాసాలే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు.. చికెన్ ధరల పెరుగుదల మరింత భారం మోపుతోంది. పండుగ సీజన్ క్రమంలో సాధారణంగా పెరిగే డిమాండ్, సరఫరాలో జాప్యం వంటి కారణాలతో ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ధరల పెరుగుదల సామాన్యుల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Follow Us
భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ
మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌