AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోగనిరోధక శక్తిని పెంచుతూ, ఒత్తిడిని తగ్గించే అద్భుతమైన టీ

టీ, కాఫీల్లో ఉండే కెఫిన్ వంటి పదార్థాలు ఆరోగ్యానికి హానికరం అని, వీటిని మానేయమని చెబుతున్నారు. తలనొప్పులు, నరాల బలహీనత, నిద్రలేమి, ఆకలి మందగించడం, అధిక ఆమ్ల స్రావం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వంటి అనేక అనర్థాలకు టీ, కాఫీలు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Oct 20, 2026 | 9:04 PM

Share
 అల్లం టీ : అల్లం టీ జీర్ణక్రియను బాగా పెంచడానికి, ఆకలిని పుట్టించడానికి, జీర్ణకోశంలో ఆహారాలు పులిసి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండటానికి అద్భుతంగా పనిచేస్తుంది. చిన్న అల్లం ముక్కను చిదిమి నీళ్లల్లో వేసి మరిగించాలి. వడకట్టి, తేనె, నిమ్మరసం కలుపుకుని తాగాలి.

1 / 5
లెమన్‌గ్రాస్ టీ: లెమన్‌గ్రాస్ టీ మానసికంగా రిలాక్స్డ్‌గా అనిపించేలా చేస్తుంది. తలనొప్పులను తగ్గిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి ఇది చాలా మంచిది. మనసు బాగోనప్పుడు ఇది ఉపయోగపడుతుంది. కొన్ని లెమన్‌గ్రాస్ ఆకులను చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్లల్లో వేసి మరిగించాలి. వడకట్టి, ఆకులను తీసేసి, తేనె, నిమ్మరసం కలుపుకుని వేడివేడిగా తాగాలి.

2 / 5
పసుపు టీ : మంచి నాణ్యత గల పసుపు యాంటీ-క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటుంది. క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా నిరోధించడానికి, ప్రారంభ దశలోనే తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. కఫాలు, శ్లేష్మం పోవడానికి, అలాగే పొట్ట, ప్రేగులలోని వార్మ్స్ లేదా అమీబియాసిస్ వంటివి తగ్గించడానికి ఉపయోగపడుతుంది

3 / 5
పుదీనా టీ : పుదీనా ఆకులు కండరాలను రిలాక్స్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. జీర్ణకోశ సంబంధమైన సమస్యలను తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మెదడును ప్రశాంతంగా ఉంచడానికి, మూడ్ స్వింగ్‌లను తగ్గించడానికి కూడా ఇది తోడ్పడుతుంది.
15-20 తాజా పుదీనా ఆకులను లేదా ఎండబెట్టిన ఆకులను 150-200 మిల్లీలీటర్ల నీటిలో వేసి 100-90 మిల్లీలీటర్లు అయ్యేవరకు మరిగించాలి. వడకట్టి, ఆకులను తీసేసి, తేనె, నిమ్మరసం కలుపుకుని తాగాలి.

పుదీనా టీ : పుదీనా ఆకులు కండరాలను రిలాక్స్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. జీర్ణకోశ సంబంధమైన సమస్యలను తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మెదడును ప్రశాంతంగా ఉంచడానికి, మూడ్ స్వింగ్‌లను తగ్గించడానికి కూడా ఇది తోడ్పడుతుంది. 15-20 తాజా పుదీనా ఆకులను లేదా ఎండబెట్టిన ఆకులను 150-200 మిల్లీలీటర్ల నీటిలో వేసి 100-90 మిల్లీలీటర్లు అయ్యేవరకు మరిగించాలి. వడకట్టి, ఆకులను తీసేసి, తేనె, నిమ్మరసం కలుపుకుని తాగాలి.

4 / 5
 తులసి టీ: తులసి యాంటీవైరల్, యాంటీబాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన ఇమ్యూనిటీ బూస్టర్. 10-15 తులసి ఆకులను 150 మిల్లీలీటర్ల నీటిలో వేసి 75 మిల్లీలీటర్లు అయ్యేవరకు మరిగించాలి. వడకట్టి, తేనె, కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగాలి.

5 / 5
Follow Us