AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చిన్నప్పుడే సూపర్ స్టార్ కృష్ణతో నటిస్తానని ఛాలెంజ్.. 8 ఏళ్లు తిరిగేసరికి..

1972లో వాహిని స్టూడియోలో కృష్ణ నటించిన మా ఇంటి వెలుగు షూటింగ్‌లో ఓ చిన్నారి తాను కృష్ణతో నటిస్తానని ధీమాగా చెప్పింది. ఎనిమిదేళ్ల తర్వాత ఆ పాప విజయశాంతిగా కృష్ణ సరసన కిలాడి కృష్ణుడు చిత్రంతో కథానాయికగా అరంగేట్రం చేసింది. దర్శకురాలు విజయనిర్మల దూరదృష్టితో ఆమెకు అవకాశం కల్పించి, ఆ చిన్నారి పెద్ద నటిగా ఎదిగేందుకు మార్గం సుగమం చేసింది.

Tollywood: చిన్నప్పుడే సూపర్ స్టార్ కృష్ణతో నటిస్తానని ఛాలెంజ్.. 8 ఏళ్లు తిరిగేసరికి..
Vijayashanti
Ram Naramaneni
|

Updated on: Oct 20, 2026 | 8:39 PM

Share

తెలుగు సినీ చరిత్రలో లేడీ అమితాబ్‌గా పేరుగాంచిన విజయశాంతి ప్రస్థానం ఓ చిన్నారి ఆశయంతో మొదలైంది. ఇది 1972లో జరిగిన సంఘటన. హైదరాబాద్‌లోని ప్రముఖ వాహిని స్టూడియోలో సూపర్‌స్టార్ కృష్ణ తన మా ఇంటి వెలుగు చిత్రం షూటింగ్‌లో నిమగ్నమై ఉన్నారు. కృష్ణ, చంద్రకళ వంటి అగ్రతారలు నటిస్తున్న ఆ షూటింగ్‌ను చూడటానికి తన తండ్రితో కలిసి ఓ చిన్నారి అక్కడకు వచ్చింది. స్టూడియోలోని సందడి వాతావరణం, సినిమా షూటింగ్ తీరు ఆ పాపను ఎంతో ఆకట్టుకున్నాయి. ఆ పాప సంబర పడటం చూసిన ఆమె తండ్రి, “చిట్టితల్లీ, నువ్వు కూడా నటిస్తావా?” అని ప్రేమగా అడిగారు. అందుకు ఆ చిన్నారి ఏమాత్రం తటపటాయించకుండా, ఆత్మవిశ్వాసంతో తల ఊపి, “నేను నటిస్తే అదిగో ఆ హీరోతోనే (కృష్ణను చూపిస్తూ) చేస్తాను” అని ధీమాగా చెప్పింది. పెద్దలు “తథాస్తు” దేవతలు ఉంటారని అంటుంటారు. బహుశా ఆ దేవతలు ఆ చిన్నారి కోరికను మన్నించి, “తథాస్తు” అని దీవించినట్లున్నారు. సరిగ్గా ఎనిమిదేళ్లు తిరిగేసరికి ఆ చిన్నారి హీరోయిన్‌గా మారింది. 1980వ సంవత్సరం వచ్చేసరికి, ఆ పాప విజయశాంతిగా తన సినీ ప్రవేశానికి సిద్ధమైంది. అదృష్టవశాత్తు, ఆమె చెప్పినట్లుగానే సూపర్‌స్టార్ కృష్ణ సరసన నటించే అవకాశం లభించింది.

ఆమె తొలిచిత్రం పేరు కిలాడి కృష్ణుడు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, ప్రఖ్యాత దర్శకురాలు విజయనిర్మల. అయితే, ఈ చిత్రానికి మొదట విజయశాంతిని కథానాయికగా అనుకోలేదు. మొదట స్వప్న అనే మరో నటిని ఎంపిక చేసుకున్నారు. కానీ ప్రముఖ నటుడు గిరిబాబు, దర్శకురాలు విజయనిర్మలతో “ఆ అమ్మాయి (స్వప్న) మీ పక్కన బాగోదండి” అని సలహా ఇచ్చారు. ఆయన సలహా మేరకు విజయనిర్మల విజయశాంతిని సంప్రదించారు. మొదట విజయశాంతిని చూసినప్పుడు, కృష్ణ “మరీ చిన్నపిల్లలా ఉంది” అని పెదవి విరిచారు. అయితే విజయనిర్మలకు మాత్రం విజయశాంతి భవిష్యత్తులో గొప్ప నటి అవుతుందని ఎందుకో బలంగా అనిపించింది. ఆమె దూరదృష్టితో “నాకు కొంచెం సమయం ఇవ్వండి. మీకు నచ్చేలా ఆమెను సిద్ధం చేస్తాను” అని కృష్ణను అడిగారు. విజయనిర్మల విజయశాంతిని తీర్చిదిద్దడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆమెకు పలు రకాల దుస్తులు వేసి, కొంచెం బొద్దుగా కనిపించేలా చేసి, వివిధ భంగిమల్లో స్టిల్స్ తీయించారు. ఆ స్టిల్స్ చూసిన కృష్ణ సంతృప్తి చెంది, విజయశాంతిని హీరోయిన్‌గా ఓకే చేశారు. కిలాడి కృష్ణుడు చిత్రం 1980 సెప్టెంబర్ 12న విడుదలయ్యింది. అయితే, దురదృష్టవశాత్తు, ఈ చిత్రం ఆశించినంత విజయం సాధించలేకపోయింది. అప్పట్లో విజయశాంతి “మరీ చిన్నపిల్లలా ఉంది” అనే కామెంట్స్ కూడా వచ్చాయి. దీంతో ఆమెకు కొంత కాలం గ్యాప్ వచ్చింది.

కానీ విజయనిర్మల జడ్జిమెంట్ ఒమ్ము కాలేదు. కిలాడి కృష్ణుడు తర్వాత కొంత గ్యాప్ వచ్చినా, విజయశాంతి తన ప్రతిభను నిరూపించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. కాలక్రమేణా ఆమె తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా, లేడీ అమితాబ్గా గొప్ప గుర్తింపును పొందారు. ఒక చిన్నారి ఆశయం, ఒక దర్శకురాలి దూరదృష్టి, ఒక నటి పట్టుదలకు విజయశాంతి ప్రస్థానం ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.

Follow Us
తక్కువ ధర, అదిరే ఫీచర్లు ఉన్న 85 ఇంచుల QLED టీవీ
తక్కువ ధర, అదిరే ఫీచర్లు ఉన్న 85 ఇంచుల QLED టీవీ
చిన్నప్పుడే కృష్ణతో నటిస్తానని ఛాలెంజ్.. కట్ చేస్తే..
చిన్నప్పుడే కృష్ణతో నటిస్తానని ఛాలెంజ్.. కట్ చేస్తే..
చిన్నారులకు అస్వస్థత.. చైనా నర్సరీ యజమానురాలికి జీవిత ఖైదు!
చిన్నారులకు అస్వస్థత.. చైనా నర్సరీ యజమానురాలికి జీవిత ఖైదు!
స్మార్ట్​ ఫీచర్లతో Xiaomi కొత్త డివైజ్‌.. స్పెషాలిటీస్​ ఇవే
స్మార్ట్​ ఫీచర్లతో Xiaomi కొత్త డివైజ్‌.. స్పెషాలిటీస్​ ఇవే
రెండో కూతురికి నామకరణం చేసిన దీపికా-రణ్‌వీర్..ఏం పేరు పెట్టారంటే?
రెండో కూతురికి నామకరణం చేసిన దీపికా-రణ్‌వీర్..ఏం పేరు పెట్టారంటే?
కేంద్రం నుంచి సూపర్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి డబ్బులు..
కేంద్రం నుంచి సూపర్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి డబ్బులు..
వీరికి ముచ్చటగా మూడు యోగాలు..అదృష్టం పట్టబోతోంది..!
వీరికి ముచ్చటగా మూడు యోగాలు..అదృష్టం పట్టబోతోంది..!
నిద్రపోయే దిశతో అదృష్టం మారుతుందా? అసలు నిజాలు ఇవే!
నిద్రపోయే దిశతో అదృష్టం మారుతుందా? అసలు నిజాలు ఇవే!
నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే బాదం హల్వా.. రుచి అదిరిపోద్ది
నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే బాదం హల్వా.. రుచి అదిరిపోద్ది
ధనుష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఊహగానాలు
ధనుష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఊహగానాలు