మీ ఫోన్ పోగొట్టుకున్నారా..? ఈ పనులు చేస్తే మీరు సేఫ్..
Venkatrao Lella
Images: Pinterest
20 OCT 2026
స్మార్ట్‌ఫోన్ అనేది ఇప్పుడు ప్రతీఒక్కరి చేతుల్లో ఉంటుంది. ఇది ఒక నిత్యావసర వస్తువుగా మారడంతో ప్రతీఒక్కరూ ఉపయోగిస్తున్నారు. ఫోన్ లేనివారంటూ ఎవరూ ప్రస్తుతం కనిపించడం లేదు.
ఫోన్ ఎక్కడైనా పెట్టి మర్చిపోవడం, చోరీకి గురి కావడం లేదా ఎక్కడైనా పొగోట్టుకున్నప్పుడు మీరు వెంటనే జాగ్రత్త పడాలి. లేకపోతే మీ ఫోన్‌లోని వ్యక్తి సమాచారాన్ని తెలుసుకోవడం, బ్యాంక్ ఖాతా వివరాలను తెలుసుకుని నగదు విత్ డ్రా చేయడం లాంటి ప్రమాదాలు ఉంటాయి.
ఫొన్ పొగోట్టుకున్నప్పుడు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, మీ వ్యక్తిగత వివరాలను కాపాడుకునేుందుకు కొన్ని చర్యలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చూద్దాం
మీ ఫోన్ లొకేషన్ తెలుసుకునేందుకు వేరే ఫోన్‌లో గూగుల్ ఫైండ్ హబ్ ఓపెన్ చేయండి. ఇక యాపిల్ వినియోగదారులు అయితే ఆఫిల్ ఫైండ్ మై సేవను వినియోగించండి. మీ మెయిల్ ఐడీకి లాగిన్ అయ్యి మీ ఫోన్ లొకేషన్ తెలుసుకోండి.
ఫోన్ స్విచ్చాప్ చేసినా లేదా డిస్‌కనెక్ట్ చేసినా మీ ఫోన్ లొకేషన్ ఫైండ్ హబ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ట్రాకింగ్ సర్వీస్ ద్వారా మీ ఫోన్‌ను అక్కడే లాక్ చేయండి. అలాగే లాక్ స్క్రీన్‌పై మీ నెంబర్లు డిస్‌ప్లే అయ్యేలా ప్రదర్శించండి.
ఇక సున్నితమైన మీ వ్యక్తిగత సమాచారం పంచుకోవడం మానేయండి. అలాగే మీ టెలికాం ఆపరేటర్‌ను సంప్రదించి మీ నెంబర్ బ్లాక్ అయ్యేలా చేసుకోండి. దీని వల్ల మీ నెంబర్‌కు ఓటీపీల, ఇతర వివరాలు అందవు.
వేరే ఫోన్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ పాస్ వర్డ్, ఇతర వివరాలను మార్చుకోండి. ఇక కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖకు చెందిన CEIR పోర్టల్ https://www.ceir.gov.in ద్వారా మీ ఫోన్ పనిచేయకుండా బ్లాక్ చేయండి. ఇందుకోసం IMEI నంబర్ నమోదు చేయాలి.
పోర్టల్‌లో IMEI నంబర్ అందించి బ్లాక్ చేయమని రిక్వెస్ట్ పెట్టుకోండి. మీరు ఫోన్ కొనుగోలు చేసిన బిల్లు, గుర్తింపు పత్రం. పోలీసు ఫిర్యాదు వివరాలను సమర్పించండి.
మీ మెయిల్, బ్యాకింగ్, సోషల్ మీడియా అకౌంట్లలో ఏవైనా కార్యకలాపాలు జరిగాయోమోనని చూడండి. మీకు అనుమానం ఉంటే మీ సోషల్ మీడియా ఖాతాలన లాగౌట్ చేయడం లేదా పాస్ వర్డ్ మార్చుకోవడం లాంటివి చేయండి.