AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranabaali: ‘రణబాలి 2’ పై క్రేజీ అప్డేట్.. స్టోరీ కూడా చెప్పేసిన డైరెక్టర్ రాహుల్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ సినిమా రణబాలి. దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజైన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమా చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Ranabaali: 'రణబాలి 2' పై క్రేజీ అప్డేట్.. స్టోరీ కూడా చెప్పేసిన డైరెక్టర్ రాహుల్
Ranabaali Movie
Basha Shek
|

Updated on: Oct 20, 2026 | 8:46 PM

Share

టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ సినిమా రణబాలి.దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగు తో పాటు ఇతర భాషల్లోనూ విజయ్- రష్మికల సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దసరా సెలవులు కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ రణబాలి సినిమాను చూసేందుకు క్యూ కడుతున్నారు. దీంతో ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. అటు ఓవర్సీస్ లోనూ విజయ్ సినిమాకు రికార్డు వసూళ్లు వస్తున్నాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక బుక్ మై షోలోనూ గంటకు కనీసం 10వేల టికెట్లు బుక్ అవుతున్నాయి. 1878 కాలంలో రాయలసీమలో సంభవించిన కరువు, ప్రజల కష్టాలు, బ్రిటిష్ పాలకుల ఆగడాలను నేపథ్యంగా తీసుకుని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. హాలీవుడ్ స్టార్ నటుడు అర్నాల్డ్ వాస్లూ ఈ మూవీలో మెయిన్ విలన్ గా నటించడం విశేషం. అలాగే సీనియర్ నటి ఈశ్వరి రావు మరో కీలక పాత్రలో కనిపించారు. అజయ్ అతుల్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇదిలా ఉంటే రణబాలి సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా? అంటూ ఎన్నో సందేహాలు వ్యక్తం అయ్యాయి ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఒక ఇంటర్వ్యూ సందర్బంగా రణబాలికి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘ రణబాలి సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కించాలని నాకు ఎంతో ఆసక్తి ఉంది. రణబాలి తండ్రి, జయమ్మ, గౌడప్పల గత జీవిత కథల ఆధారంగా రణబాలి ప్రీక్వెల్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. వారి జీవితాలను రణబాలి విధితో, అతని కొడుకు భవిష్యత్తుతో, పోర్టు నుంచి తప్పించుకున్న బ్రిటిష్ వ్యక్తితో ముడిపెడుతూ కథను రూపొందించాలని భావిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ రాహుల్. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. రణబాలి సినిమా ఫ్రీక్వెల్ వార్తలపై విజయ్- రష్మికల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రణబాలి 2 రావడానికి చాలా సమయం పట్టనుందని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం విజయ్- రష్మికలు పలు సినిమాలకు కమిట్ అయి ఉన్నారు. ఈ సినిమా పనులు పూర్తి అయిన తర్వాతనే రణబాలి ఫ్రీక్వెల్ ఉండవచ్చని తెలుస్తోంది.

రణబాలి సెట్ లో దసరా ఉత్సవాలు..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'రణబాలి 2' పై క్రేజీ అప్డేట్.. స్టోరీ కూడా చెప్పేసిన డైరెక్టర్
'రణబాలి 2' పై క్రేజీ అప్డేట్.. స్టోరీ కూడా చెప్పేసిన డైరెక్టర్
తక్కువ ధర, అదిరే ఫీచర్లు ఉన్న 85 ఇంచుల QLED టీవీ
తక్కువ ధర, అదిరే ఫీచర్లు ఉన్న 85 ఇంచుల QLED టీవీ
చిన్నప్పుడే కృష్ణతో నటిస్తానని ఛాలెంజ్.. కట్ చేస్తే..
చిన్నప్పుడే కృష్ణతో నటిస్తానని ఛాలెంజ్.. కట్ చేస్తే..
చిన్నారులకు అస్వస్థత.. చైనా నర్సరీ యజమానురాలికి జీవిత ఖైదు!
చిన్నారులకు అస్వస్థత.. చైనా నర్సరీ యజమానురాలికి జీవిత ఖైదు!
స్మార్ట్​ ఫీచర్లతో Xiaomi కొత్త డివైజ్‌.. స్పెషాలిటీస్​ ఇవే
స్మార్ట్​ ఫీచర్లతో Xiaomi కొత్త డివైజ్‌.. స్పెషాలిటీస్​ ఇవే
రెండో కూతురికి నామకరణం చేసిన దీపికా-రణ్‌వీర్..ఏం పేరు పెట్టారంటే?
రెండో కూతురికి నామకరణం చేసిన దీపికా-రణ్‌వీర్..ఏం పేరు పెట్టారంటే?
కేంద్రం నుంచి సూపర్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి డబ్బులు..
కేంద్రం నుంచి సూపర్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి డబ్బులు..
వీరికి ముచ్చటగా మూడు యోగాలు..అదృష్టం పట్టబోతోంది..!
వీరికి ముచ్చటగా మూడు యోగాలు..అదృష్టం పట్టబోతోంది..!
నిద్రపోయే దిశతో అదృష్టం మారుతుందా? అసలు నిజాలు ఇవే!
నిద్రపోయే దిశతో అదృష్టం మారుతుందా? అసలు నిజాలు ఇవే!
నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే బాదం హల్వా.. రుచి అదిరిపోద్ది
నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే బాదం హల్వా.. రుచి అదిరిపోద్ది