AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranabaali: ‘రణబాలి’ సినిమా చూసిన రామ్‌గోపాల్ వర్మ.. విజయ్ దేవరకొండ-రష్మికల గురించి ఏమన్నారంటే?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ సినిమా రణబాలి. దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజైన బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. సామాన్య జనాలతో పాటు సెలబ్రిటీలు కూడా రణబాలి సినిమాను చూసి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

Ranabaali: 'రణబాలి' సినిమా చూసిన రామ్‌గోపాల్ వర్మ.. విజయ్ దేవరకొండ-రష్మికల గురించి ఏమన్నారంటే?
Ram Gopal Varma On Ranabaali Movie
Basha Shek
|

Updated on: Oct 19, 2026 | 4:13 PM

Share

టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ సినిమా రణబాలి. 1878 కాలంలో రాయలసీమలో సంభవించిన కరువు, ప్రజల కష్టాలు, బ్రిటిష్ పాలకుల ఆగడాలను నేపథ్యంగా తీసుకుని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. దసరా కానుకగా 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా విజయ్-రష్మికల కెమిస్ట్రీ సినిమాకు మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అటు టాక్ కు తగ్గట్టుగానే రణబాలి సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. అటు ఓవర్సీస్ లోనూ విజయ్ సినిమాకు మంచి రెస్పాన్సే వస్తోది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా రణబాలి సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు విజయ్ – రష్మికల సినిమాను చూసి తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలా తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రణబాలి సినిమాపై తన అభిప్రాయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు.’ విజయ్ చేసే ఫైట్స్‌లో ఒక రకమైన సహజమైన కోపం, ఆవేశం కనిపిస్తున్నాయి. అలాగే ఆయన చేసిన యాక్షన్‌ చాలా న్యాచురల్ గా ఉంది. పైగా అందులో ఒక ఇంటెన్సిటీ కూడా ఉంది. ఇండియన్ సినిమాలో ఒక గొప్ప యాక్షన్ హీరోగా విజయ్ దేవరకొండ నిలుస్తాడని నాకు గట్టి నమ్మకం ఉంది. మొత్తానికి విజయ్ కాంగ్రాచ్చులేషన్స్.. సింగనమల రణబాలి రా ‘ అంటూ ట్వీట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా.

కాగా సందీప్ రెడ్డి వంగా పోస్ట్‌కు ఆయన గురువు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు. ‘జస్ట్ ఇప్పుడే రణబాలి సినిమా చూశాను. సందీప్ చెప్పిన మాటలు హండ్రెస్ పర్సెంట్ కరెక్ట్. నేను కూడా ఆ మాటలను అంగీకరిస్తాను. విజయ్ దేవరకొండ కళ్లలో ఉన్న నిప్పు రాళ్లను కూడా కరిగించగలదంటూ’ అంటూ తనదైన స్టైల్‌లో కామెంట్ చేశారు ఆర్జీవీ. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆర్జీవీ కాంప్లిమెంట్స్ చూసి విజయ్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

రణబాలి సినిమా విషయానికి వస్తే.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. హాలీవుడ్ స్టార్ నటుడు అర్నాల్డ్ వాస్లూ ఈ మూవీలో మెయిన్ విలన్ గా నటించడం విశేషం. అలాగే సీనియర్ నటి ఈశ్వరి రావు మరో కీలక పాత్రలో కనిపించారు. అజయ్ అతుల్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

రామ్ గోపాల్ వర్మ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us