AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Emmanuel: హీరోగా మారిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఓ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌ సినిమాతో ఆయన కథానాయకుడిగా వెండితెరకు పరిచయం కానున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో సెలబ్రిటీలు, సినీ అభిమానులు, నెటిజన్లు ఇమ్మూకు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు.

Jabardasth Emmanuel: హీరోగా మారిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
Jabardasth Emmanuel
Basha Shek
|

Updated on: Oct 18, 2026 | 5:17 PM

Share

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇమ్మాన్యుయేల్. తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్‌తో స్టార్ కమెడియన్ గా మారిపోయాడు. గతేడాదే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోనూ ఇమ్మూ కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేశాడు. తన దైన ఆట తీరు, మాట తీరుతో మరోసారి అందరి మనసులు గెల్చుకున్నాడు. జస్ట్ త్రుటిలో బిగ్ బాస్ టైటిల్ మిస్ అయిన ఇమ్మూ తన లైఫ్ లో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పటికే బుల్లితెరపై స్టార్ గా గుర్తింపు పొందిన అతను ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రజెంట్ ట్రెండ్ అయిన ఓ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ఆయన కథానాయకుడిగా వెండితెరకు పరిచయం కానున్నారు. దీనికి దీనికి సంబంధించి కొత్త సినిమా పోస్టర్ రిలీజైంది.డెస్టినీ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి విడుదల చేశారు. బ్యాక్ డ్రాప్‌లో ఫారెస్ట్‌తో పాటు సంకెళ్లు, పోలీస్ అధికారితో ఇమ్మాన్యుయేల్ లుక్ హైప్ క్రియేట్ చేస్తోంది. ‘ఓ రహస్యమయ ప్రపంచం. అనూహ్యమైన గమ్యం.’ అని ఈ మూవీకి క్యాప్షన్ ఇచ్చారు.

డెస్టినీ సినిమాకు చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఓ పిట్టకథ, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించారు చెందు ముద్దు. ఇప్పుడు ఇమ్మాన్యుయేల్ తో డెస్టినీ పేరుతో ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఇమ్మాన్యుయేల్‌తో పాటు శ్రీ సత్య, సీనియర్ నటి ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దినేష్ కుర్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మారుతీ రాజా సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఇమ్మాన్యుయేల్ డెస్టినీ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, బుల్లితెర సెలబ్రిటీలు, సినీ అభిమానులు ఇమ్మూకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

డెస్టినీ ఫస్ట్ లుక్ పోస్టర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హీరోగా మారిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
హీరోగా మారిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
వాటర్ వేస్ట్ చేస్తే.. మీకు కూడా ఇదే పరిస్థితి.. జలమండలి సీరియస్
వాటర్ వేస్ట్ చేస్తే.. మీకు కూడా ఇదే పరిస్థితి.. జలమండలి సీరియస్
మోకాళ్ల నొప్పులు, పొట్ట సమస్యలను తగ్గించే అద్భుత పువ్వు..
మోకాళ్ల నొప్పులు, పొట్ట సమస్యలను తగ్గించే అద్భుత పువ్వు..
JEE Advancedలో మార్పులు.. మూడో ప్రయత్నంకు అవకాశం ఉంటుందా?
JEE Advancedలో మార్పులు.. మూడో ప్రయత్నంకు అవకాశం ఉంటుందా?
మీ ఆధార్ ఇతరులు ఉయోగించకుండా ఉండాలంటే ఈ పని చేయండి
మీ ఆధార్ ఇతరులు ఉయోగించకుండా ఉండాలంటే ఈ పని చేయండి
తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ కొట్టిన జానకిరామ్
తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ కొట్టిన జానకిరామ్
నా ఫొటోలు, వీడియోలతో ఏఐ కంటెంట్ క్రియేట్ చేస్తే ఊరుకోను..
నా ఫొటోలు, వీడియోలతో ఏఐ కంటెంట్ క్రియేట్ చేస్తే ఊరుకోను..
కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే నిజంగానే పిల్లలు తెల్లగా పుడతారా?
కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే నిజంగానే పిల్లలు తెల్లగా పుడతారా?
రణబాలి సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
రణబాలి సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
మ్యాచ్ రద్దైనా, మాకో డేంజరస్ ఫినిషర్ దొరికాడు..
మ్యాచ్ రద్దైనా, మాకో డేంజరస్ ఫినిషర్ దొరికాడు..