AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Ali Khan: నవరాత్రి పూజల్లో స్టార్ హీరోయిన్.. చీరకట్టులో తళుక్కుమన్న సారా అలీఖాన్.. ఫొటోస్ ఇదిగో

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సారా అలీఖాన్ కు దైవ భక్తి ఎక్కువ. ముస్లిం అమ్మాయి అయినా తరచూ హిందూ దేవలయాలకు వెళుతుంటుంది. ఇప్పటికే కాశీ, మానస సరోవరం, కేదరినాథ్, బద్రీనాథ్ తదితర దేవాలయాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకుంది సారా. తాజాగా ఈ అమ్మడు నవరాత్రి పూజల్లో పాల్గొంది.

Basha Shek
|

Updated on: Oct 16, 2026 | 4:19 PM

Share
 బాలీవుడ్ స్టార్ నటి సారా అలీఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందీ అందాల తార. తన  అందం, అభినయంతో అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ.

1 / 6
 2018లో కేదార్ నాథ్ సినిమాతో తెరంగేట్రం చేసింది సారా. మొదటి సినిమాలోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత సింబా, లవ్ ఆజ్ కల్, కూలీ నంబర్ వన్, అత్రంగిరే, గ్యాస్  లైట్ వంటి సినిమాల్లో కథానాయికగా చేసింది.

2 / 6
 జరా హట్కే జరా బచ్కే, రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ, మర్డర్ ముబారక్, స్కై ఫోర్స్, మెట్రో ఇన్ డినో, పతీ పత్నీ ఔవర్ వోదో వంటి సినిమాలు సారాకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి

3 / 6
 కాగా దేశమంతా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా సారా అలీఖాన్ కూడా ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగమైంది.

4 / 6
 ఎల్లో శారీలో సంప్రదాయంగా ముస్తాబైన సారా స్వామి, అమ్మవార్లకు పూజలు చేసింది. అనంతరం ఈ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దీంతో ఇవి కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.

5 / 6
  కాగా స్వతహాగా ముస్లిం అయినప్పటికీ హిందూ పండగలను కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది సారా. గతంలో వినాయక చవితి ఉత్సవాల్లోనూ పూజలు చేస్తూ కనిపించింది. అయితే కొన్ని సార్లు సారా ఫొటోలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తుంటాయి. అయినా అవేవీ పట్టించుకోకుండా తనకు నచ్చిన దారిలోనే వెళుతోంది సారా.

6 / 6
Follow Us