OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది.. రోజా కోసమైనా చూడాల్సిందే
సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈ తమిళం మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాకు కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. అయితే ఇప్పుడీ సినిమా నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు వచ్చాయి. కాగితం పడవలు వంటి తెలుగు సినిమాలతో పాటు ఎన్నవిలై, ఆశా, ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్, ఒరు అన్వేషణతింటే తుడక్కమ్’ తదితర డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. అయితే వీటితో పాటు ఒక సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా శుక్రవారం (అక్టోబర్ 16) అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదొక తమిళ సోషల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సెప్టెంబర్ 24న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కంటెంట్ పరంగా ప్రశంసలు అందుకోవడమే కాకుండా కలెక్షన్లు కూడా భారీగానే రాబట్టుకుంది. ముఖ్యంగా సీనియర్ నటి రోజా ఇందులో ఒక కీలక పాత్ర పోషించడం విశేషం. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు 10కి 9 రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. తమిళనాడులోని శివగంగై జిల్లా మానామదురై ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇదే సమయంలో అక్కడి పోలీస్ స్టేషన్కు ఒక కొత్తకానిస్టేబుల్ వస్తాడు. ఇసుకు అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే పై అధికారుల నుంచి అవమానాలు, రాజకీయ నాయకుల నుంచి బెదిరింపులు వస్తాయి. ఇదే క్రమంలో అక్కడే నివాసముంటోన్న ఓ వృద్ద దంపతులు కూడా ఈ ఇసుకు అక్రమ రవాణాపై పోరాటం సాగిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో కొత్త కానిస్టేబుల్, వృద్ధ దంపతులు కలిసి అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభిస్తారు.ఈ క్రమంలో వారికెలాంటి పరిస్థితులు ఎదరయ్యాయి? రాజకీయ పలుకుబడిని ఎదుర్కొని ఇసుక మాఫియాను అరికట్టారా? చివరకు ఏం జరిగిందన్నదే మిగతా కథ.
పోలీస్ వ్యవస్థలో జరిగే అణచివేత, అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసే అరాచకాలు, సామాన్యుల జీవితాలపై జరిగే దోపిడీని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు. అలాగే చట్టాన్ని రక్షించాల్సిన వ్యవస్థే కొందరి చేతుల్లో కీలుబొమ్మగా ఎలా మారుతుందనే అంశాన్ని ఈ సినిమాలో చాలా స్పష్టంగా చూపించారు. సామాజిక సమస్యను క్రైమ్ థ్రిల్లర్ కోణంలో చూపించిన ఈ చిత్రం పేరు లెనిన్ పాండియన్ (Lenin Pandiyan). డీడీ బాలచంద్రన్ తెరకెక్కించిన ఈ సోషియల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో సీనియర్ నటి రోజా కీలక పాత్ర పోషించారు. అలాగే గంగై అమరన్, జార్జ్ మరియన్, ఆడుకాలం నరేన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ పతాకంపై టీజీ త్యాగరాజన్, సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం లెనిన్ పాండియన్ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ తమిళ్ వెర్షన్ తో పాటు తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది.
రోజా నటించిన లెనిన్ పాండియన్ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




