AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: ఆ సినిమాతోనే నా కెరీర్ మారిపోయింది.. ఆ టాలీవుడ్ హీరోకు ఎప్పుడూ రుణపడి ఉంటా: శ్రుతి హాసన్

నటిగానూ, సింగర్ గానూ దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రుతి హాసన్. ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

Shruti Haasan: ఆ సినిమాతోనే నా కెరీర్ మారిపోయింది.. ఆ టాలీవుడ్ హీరోకు ఎప్పుడూ రుణపడి ఉంటా: శ్రుతి హాసన్
Shruti Haasan
Basha Shek
|

Updated on: Oct 15, 2026 | 6:42 PM

Share

లోక నాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రుతి హాసన్. మొదట ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే కెరీర్ ప్రారంభంలో శ్రుతి నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. నటిగా శ్రుతి హాసన్ కు మంచి పేరొచ్చినా సినిమాలు మాత్రం కమర్షియల్ గా ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకు ఐరన్ లెగ్ అని ముద్రవేశారు. అయితే 2012లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా శ్రుతి హాసన్ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఈ మూవీ గ్రాండ్ కమ్ బ్యాక్ అయితే.. శ్రుతి హాసన్ కెరీర్ లో మొదటి హిట్. గబ్బర్ సింగ్ తర్వాత శ్రుతికి వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఎవడు, రేసు గుర్రం, పూజ, శ్రీమంతుడు, ప్రేమమ్, సింగమ్ 3, క్రాక్, వకీల్ సాబ్, వీరసింహా రెడ్డి, వాల్తేర్ వీరయ్య, సలార్, కూలీ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది శ్రుతి. ఇక సలార్, కూలీ సినిమాలతో పాన్ ఇండియా హీరోయిన్ గానూ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. కేవలం నటిగానే కాకుండా సింగర్ గానూ సత్తా చాటుతున్న శ్రుతి హాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. అందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో కెరీర్ బిగినింగ్ డేస్ లో తాను పడిన ఇబ్బందులను గుర్తు చేసుకుంది.

‘అందరూ నన్ను ఐరన్‌లెగ్ అని పిలుస్తున్న దశలో తెలుగు చిత్ర పరిశ్రమ నన్ను పిలిచి మరీ అవకాశం ఇచ్చింది. గబ్బర్ సింగ్ చిత్రం నా కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. రాత్రికి రాత్రి ఓవర్‌నైట్ స్టార్‌గా మార్చేసింది. ఈ సినిమా హిట్‌తో టాలీవుడ్‌లో పెద్ద సినిమాల్లో అవకాశం వచ్చింది. రేసుగుర్రం లాంటి కామెడీ సినిమాతో పాటు శ్రీమంతుడు లాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఉన్నయి. తనపై వచ్చిన నెగిటివిటీని పక్కనపెట్టి నాకు గబ్బర్ సింగ్‌లో అవకాశం కల్పించిన పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్‌లకు ధన్యవాదాలు. ఆ టైంలో నాకు తెలుగు తెలియదు.. కానీ తెలుగు ప్రజలు నన్ను తెలుగు అమ్మాయిలాగే చూసుకున్నారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను’ అని శృతిహాసన్ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us