AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేటి రాశిఫలాలు.. కొందరికి శుభవార్తలు, మరికొందరికి ఆర్థిక ఇబ్బందులు.. మీ రాశి ఎలా ఉందంటే!

Horoscope Today: నవంబర్ 23, సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి, ఆదాయ వృద్ధికి అవకాశాలున్నాయి. మరికొన్ని రాశుల వారికి పనిభారం, ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చు. ప్రేమ, కుటుంబం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి నేటి జాతక విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశిఫలాలు.. కొందరికి శుభవార్తలు, మరికొందరికి ఆర్థిక ఇబ్బందులు.. మీ రాశి ఎలా ఉందంటే!
Horoscope
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 23, 2026 | 7:06 AM

Share

దినఫలాలు నవంబర్ 23, 2026: మేషం రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం, సాన్నిహిత్యం పెరుగుతాయి. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. వృషభం రాశి వారికి ఉద్యోగంలో అధికారులు మీ సమర్థతను గుర్తించి ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అవకాశాలు పెరుగుతాయి. మిథునం రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ వల్ల అధికారులు లాభపడతారు. వృత్తి, వ్యాపారాల్లో బిజీ అయ్యే సూచనలున్నాయి. మేషం రాశి మొదలుకొని.. మీనం వరకు సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం, సాన్నిహిత్యం పెరుగుతాయి. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో కొందరు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసేస్థితిలో ఉంటారు. మీరిచ్చిన సలహాల వల్ల ఇతరులు ఆశించిన ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో అధికారులు మీ సమర్థతను గుర్తించి ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. పెండింగ్ పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులు చేయూతనందిస్తారు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. కొందరు మిత్రులవల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమలు ఊపందుకుంటాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ వల్ల అధికారులు లాభపడతారు. వృత్తి, వ్యాపారాల్లో బిజీ అయ్యే సూచనలున్నాయి. ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆరోగ్యానికి లోటుండదు. ఇప్పుడు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు తేలికగా ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు తిరుగుండదు. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆర్థిక విషయాల్లో కొన్ని చికాకులు ఎదురవుతాయి. వ్యక్తిగత సమస్యల మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. సమాజంలో మంచి పరిచయాలు కలు గుతాయి. ఆస్తి వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు కూడా బాగా బిజీగా సాగిపోతాయి. ఇంటా బయటా పనిభారం వల్ల మానసిక ఒత్తిడి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్ని చక్క దిద్దాల్సిన అవసరం ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని కొద్ది శ్రమతో చక్కబెట్టడం జరుగుతుంది. ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగానే ఉంటాయి. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా పురోగమిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ప్రతి చిన్న పనికీ ఎక్కువగా శ్రమపడాల్సి వస్తుంది. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేయడం జరుగుతుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను స్వయంగా చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. పిల్లల చదువులు పరవాలేదనిపిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రోజంతా సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందివస్తాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడడం, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందు తుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగు తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పురోగమిస్తాయి. వ్యక్తిగత, కుటుంబ సమ స్యల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. గట్టిగా ప్రయత్నిస్తే ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులు చదువుల్లో బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సుఖసంతోషాలతో సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, అధికారుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు ప్రోత్సాహ కరంగా పురోగమిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. చేపట్టిన ప్రతి ప్రయత్నమూ సఫలమవుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. కుటుం బంతో కలిసి దైవకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులు, తల్లితండ్రుల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా గడుస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఇంటా బయటా శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది కానీ, ఖర్చుల్ని అదుపు చేయాల్సి ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వ్యక్తిగత సమస్య ఒకటి పరి ష్కారం అవుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి, వేధింపులు తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఏలిన్నాటి శని కారణంగా ప్రతి పనీ ఆలస్యమవుతుంటుంది. కుటుంబపరంగా చికాకులు తప్పకపోవచ్చు. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని చక్కబెడతారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. పదోన్నతికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు తగ్గట్టుగా లాభాలు గడిస్తారు. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుతాయి. వ్యయ ప్రయాసలతో ముఖ్య మైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆదాయం పెరిగి నప్పటికీ, ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం చాలా మంచిది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.

Follow Us