AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Babu: ఆయనకు కల్మషం ఉండదు.. కోపం రాదు.. ఆ జబర్దస్త్ నటుడి గురించి గొప్పగా చెప్పిన డేగల బాబు

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డేగల బాబు ఇప్పుడు డైరెక్టర్ గా మారిపోయాడు. ఆయన మెగా ఫోన్ పట్టుకుని తెరకెక్కించిన లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ కు ఓటీటీలో మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ నటుడు కమ్ డైరెక్టర్ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Jabardasth Babu: ఆయనకు కల్మషం ఉండదు.. కోపం రాదు.. ఆ జబర్దస్త్ నటుడి గురించి గొప్పగా చెప్పిన డేగల బాబు
Jabardasth Actor Babu
Basha Shek
|

Updated on: Oct 14, 2026 | 6:00 PM

Share

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో డేగల బాబు ఒకరు. ఒక సాధారణ కంటెస్టెంట్ గా ఈ కామెడీ షోలోకి అడుగు పెట్టిన అతను ఇప్పుడు టాప్ కమెడియన్ గా మారిపోయాడు. తన కామెడీ పంచులు, ప్రాసలతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఒక్క జబర్దస్త్ లోనే కాదు శ్రీదేవీ డ్రామా కంపెనీ తదితర టీవీ షోల్లోనూ మెరుస్తున్నాడీ స్టార్ కమెడియన్. కేవలం నటనలోనే కాదు స్క్రిప్ట్ రైటింగ్ లోనూ బాబుకు మంచి ప్రావీణ్యం ఉంది. ఇప్పటికే జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షోలో కోసం వందలాది స్కిట్స్ రాశాడు. ఇలా మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ అయిన బాబు ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకున్నాడు. లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ తో ఆడియెన్స్ ను పలకరించాడు. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతోంది. హర్ష చెముడు, హైపర్ ఆది, ఐశ్వర్య హోలక్కల్, , శ్రీదేవి, జీవన్, రూప శ్రావ్య, ప్రేమ్ సాగర్ తదితరులు ఈ సిరీస్ లో ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉంటున్నాడు బాబు. వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలోనే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్ రామ్ ప్రసాద్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గామారాయి.

‘జబర్దస్త్ రామ్ ప్రసాద్ అన్న నిజంగా కల్మషం లేని మనిషి. వదిన (రామ్ ప్రసాద్) భార్య ప్రెగ్నెన్సీతో ఊరెళ్లినా, లేదా ఎండా కాలం సెలవుల్లో ఊరెళ్లినా అన్న వాళ్ల ఇంట్లో నేనే ఉంటాను. అక్కడ నాకు ప్రత్యేకంగా ఒక గది కూడా ఉంటుంది. వదిన కూడా నన్ను సొంత మనిషిలా చూసుకుంటుంది. నేను ఎప్పుడు వారి ఇంటికెళ్లినా.. వదినా అన్నం పెట్టు అనడం కంటే నేను డైరెక్టుగా ఏమున్నాయో వెతుక్కుని తినే వాడిని. ఈ విషయం వాళ్ల ఇంట్లో వాళ్లందరికి తెలుసు. అన్న ఇంట్లో మూడు బెడ్ రూమ్స్ ఉంటే అందులో ఒక గదిలో నేనే ఉంటాను. నా ఫోన్ కు ఎప్పుడు రామ్ ప్రసాద్ అన్న నెంబర్ వచ్చినా వెంటనే లిఫ్ట్ చేస్తాను. నిజంగా అన్న అంటే నాకు చాలా ఇష్టం. మొదట ఆయనను దూరం నుంచి చూసినప్పుడు.. ఏంటి.. ఈ మనిషి ఇలా ఉన్నాడు అనిపిస్తుంది. కానీ ఆయన నిజంగా చాలా మంచి మనిషి. కల్మషం ఉండదు.. కోపం రాదు’ అని చెప్పుకొచ్చారు డేగల బాబు. ప్రస్తుతం ఈ జబర్దస్త్ నటుడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us