AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Dirty Picture 2: రజనీ, కమల్, మమ్ముట్టిలతో సినిమాలు.. ఆపై వేశ్యగా మారి.. చివరికి ఎయిడ్స్‌కు బలైపోయి..

దివంగత నటి సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ది డర్టీ పిక్చర్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. అయితే ఈ సినిమా కూడా సిల్క్ స్మితలాగే ఒక స్టార్ హీరోయిన్ విషాద గాథ ఆధారంగానే రూపొందిస్తున్నారని తెలుస్తోంది.

The Dirty Picture 2: రజనీ, కమల్, మమ్ముట్టిలతో సినిమాలు.. ఆపై వేశ్యగా మారి.. చివరికి ఎయిడ్స్‌కు బలైపోయి..
The Dirty Picture 2
Basha Shek
|

Updated on: Oct 13, 2026 | 4:05 PM

Share

సిల్క్‌ స్మిత జీవితంలోని కొన్ని అంశాల ఆధారంగా తెరకెక్కిన ‘ది డర్టీ పిక్చర్‌’లో విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. 2011లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ ను షేక్ చేసింది. రికార్డు కలెక్షన్లు సాధించింది. అంతేకాదు నటిగా విద్యాబాలన్ కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడీ బోల్డ్ సినిమాకు కొనసాగింపుగా ‘ది డర్టీ పిక్చర్‌ 2’ తెరకెక్కనుందని తెలుస్తోంది. సిల్క్ స్మితలాగే మరో స్టార్ హీరోయిన్ విషాద గాథ ఆధారంగా ఈ సీక్వెల్ ఉంటుందని నిర్మాత ఏక్తా కపూర్ ప్రకటించారు. అయితే ఆ నటి మరెవరో కాదు నిషా నూర్ అని తెలుస్తోంది. 1980వ దశకంలో తమిళ చిత్రాలతో తన కెరీర్‌ను ప్రారంభించింది నిషా. తనదైన అందం,అభినయంతో అతి తక్కువ కాలంలోనే చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి దిగ్గజ నటులతో కూడా కలిసి పనిచేశారీ అందాల తార. సినిమాల్లో ఆమెకు ఎక్కువగా సహాయ పాత్రలే లభించినప్పటికీ, ఆమె అందం, నటన ప్రేక్షకులలో ఆమెకు మంచి ఆదరణను తెచ్చిపెట్టాయి. 1980 నుండి 1995 మధ్యకాలంలో సుమారు 17 చిత్రాలలో నటించారు నిషా. కానీ కాలం మారింది. ఆమెకు క్రమంగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఒకానొక సమయంలో ఆమెకు పని లేకుండా పోయింది. ఆర్థిక సమస్యలు కూడా చుట్టు ముట్టాయి. అప్పటికే జల్సాలకు బాగా అలవాటు పడిపోయిన నిషా సినిమాల్లో వచ్చిన డబ్బునంతా నీళ్లలా ఖర్చు చేశారు. దీంతో కొందరు ఆమెను వ్యభిచారం చేయమని సలహా ఇచ్చారు. డబ్బు అవసరం కొద్దీ ఆమె ఆ మార్గాన్ని ఎంచుకుని, క్రమంగా ఆ ప్రపంచంలోనే చిక్కుకుపోయింది. ఈ కాలంలో, సినీ పరిశ్రమతో, తన కుటుంబంతో ఆమెకు సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. నిషా తండ్రి మాటల ప్రకారం.. సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత కూడా ఆమె తన కుటుంబానికి దూరంగానే ఉంది. ఆ తర్వాత వారి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.

2007లో నాగుర్ దర్గా బయట నిషా నూర్ చాలా దయనీయ స్థితిలో కనిపించినప్పుడు, ఒక వ్యక్తి ఆమెను గుర్తించాడు. ఆ తర్వాత ఆమెను ఒక సంస్థ వద్దకు తీసుకెళ్లగా, అక్కడ ఆమె తన పూర్తి కథను వివరించారు. సినిమాలకు దూరమైన తర్వాత తాను వ్యభిచారం చేయడం ప్రారంభించినట్లు ఆమె ఒప్పుకున్నారు. విచారణలో ఆమె ఎయిడ్స్ వంటి తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నట్లు కూడా వెల్లడించారు.. ఆమె పరిస్థితి ఎంతగా దిగజారిందంటే, ఆమె శరీరం కేవలం అస్థిపంజరంలా మారిపోయింది. ఆ సంస్థ ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స ప్రారంభించింది, కానీ అప్పటికే వ్యాధి చాలా ముదిరిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ, నిషా నూర్ పరిస్థితి మెరుగుపడలేదు. హాస్పిటల్లో చేరిన సుమారు వారం రోజుల తర్వాత ఆమె మరణించింది. అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, నిషా మరణానంతరం, ఆమె మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరికి నూర్ కు సహాయం చేసిన సామాజిక సంస్థే ఆమె అంత్యక్రియలను నిర్వహించింది. ఒకప్పుడు పెద్ద నటులతో కలిసి తెరపై కనిపించిన ఒక నటి జీవితం ఈ విధంగా ముగుస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us