Bigg Boss Telugu 10: సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లోకి.. ఈ ఫైర్ బ్రాండ్ ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 వైల్డ్ ఫైర్ లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 11) మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే వీరిలో ఒక లేడీ కంటెస్టెంట్ మాటల మరాఠి అని చెప్పవచ్చు. బుల్లితెరపై ఆమెకు ఫైర్ బ్రాండ్ అని పేరు కూడా ఉంది.

తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’సీజన్ 10 రసవత్తరంగానూ, ఆసక్తికరంగానూ సాగుతోంది. ఇప్పటికే అనేక ఉత్కంఠభరితమైన పరిణామాలు, నామినేషన్లు, గొడవల మధ్య ఈ రియాలిటి షో సక్సెస్ ఫుల్ గా ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఆరో వారంలోకి అడుగు పెట్టింది. కాగా ఆదివారం (అక్టోబర్ 11) జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో ఎన్నో ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు ఫేమస్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. అపూర్వ, చరణ్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఇదే క్రమంలో మరో ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ముందుగా ఊహించనట్లుగానే ప్రియాంక జైన్ ప్రియుడు, బుల్లితెర నటుడు శివ కుమార్, నీతూ నటరాజ్, దక్ష గుత్తికొండ, శ్వేతానాయుడు సెలబ్రిటీల కోటాలో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అలాగే అగ్ని పరీక్షలో సత్తా చాటిన నవరసాలు రామకృష్ణ కూడా గ్రాండ్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే వీరిలో ప్రముఖ డ్యాన్సర్ శ్వేతా నాయుడు అందరి దృష్టిని ఆకర్షించింది. హౌస్ లోకి రావడంతోనే తన పని మొదలు పెట్టింది. స్టేజ్ మీద నుంచే తన కామెంట్స్ తో బిగ్ బాస్ ఇంట్లో హీట్ పెంచేసింది.
కాగా శ్వేత నాయుడు బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. బాగా చదువుకుని సాఫ్ట్ వేర్ జాబ్ చేసిందీ అందాల తార. అయితే సినిమాలపై ఇంట్రెస్ట్ తో జాబ్ కు రిజైన్ చేసింది. ఆ తర్వాత డ్యాన్సర్ గా మారింది. పాటలు, మిమిక్రీలో కూడా ఆమెకు మంచి ట్యాలెంట్ ఉంది. ఇక ప్రముఖ డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ లో కంటెస్టెంట్‌గా, టీమ్ లీడర్‌గా వ్యవహరించి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది శ్వేత. ఈ క్రమంలోనే ఢీ17 సీజన్ లో రన్నరప్ గానూ నిలిచింది. కాగా కేవలం డ్యాన్స్, మిమిక్రీనే కాదు కామెడీ పంచులు వేయడంలోనూ శ్వేత నాయుడు ముందుంటుంది. ఢీ షోలో భాగంగా హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్ పై ఆమె వేసిన జోకులు, పంచులు బాగా పేలాయి. సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో డ్యాన్స్ రీల్స్, ఇంటర్నేషనల్ ట్రావెల్ వ్లాగ్స్ ద్వారా మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదిగింది.
బిగ్ బాస్ హౌస్ లో మోక్షద..
View this post on Instagram
అన్నట్లు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్‌సే, శ్వేతల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. వీరిద్దరూ కలిసి చేసిన కవర్ సాంగ్స్, డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇక గతంలోనే శ్వేతా నాయుడు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తుందనే ప్రచారం జరిగింది. అయితే అదేమీ జరగలేదు. ఎట్టకేలకు ఇప్పుడీ ముద్దుగుమ్మ బిగ్ బాస్ సీజన్ 10లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. మరి హౌస్ లో ఆమె గేమ్ ఎలా ఉంటుందో చూడాలి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
