OTT Movie: షాకింగ్ క్లైమాక్స్‌తో ఆడియెన్స్ బుర్రపాడు చేసిన తెలుగు సినిమా.. ఓటీటీలోకి రియల్ లవ్ స్టోరీ
కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి, శర్వానంద్, విశ్వక్ సేన్ తదితర స్టార్ హీరోలందరూ ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో బాగానే ఆడింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను బాగా చూశారు.

ఆ మధ్యన తెలుగులో రిలీజైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా గుర్తుందా? నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను చూసి ఆడియెన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ అందరినీ షాక్ కు గురి చేసింది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సేమ్ టు సేమ్ ఈ కోవకు చెందినదే. పరువు హత్యల నేపథ్యంలో నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు. కొద్ది రోజుల క్రితమే ఈ తెలుగు సినిమా థియేటర్లలో విడుదలైంది. మౌత్ టాక్ తో మంచి గానే కలెక్షన్లు రాబట్టింది. దీనికి తోడు మెగాస్టార్ శర్వానంద్, శర్వానంద్, విశ్వక్ సేన్ తదితర స్టార్ హీరోలందరూ ఈ సినిమా గురించి గొప్పగా చెప్పారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మోస్తరు కలెక్షన్లు వచ్చాయి. ముఖ్యంగా యూత్ ఈ రియల్ లవ్ స్టోరీని బాగా చూశారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హీరో రాము స్కూల్ లో ఉన్నప్పటి నుంచి పక్కూరికి చెందిన గోదావరి ప్రేమిస్తాడు. గోదావరి కూడా మొదట ప్రేమించినా ఓ సంఘటనతో అపార్థం చేసుకొని రాముని దూరంగా పెడుతుంది. అయినా రాము ఆమె వెనకే పడుతూ ఉంటాడు. ఓ సంఘటనతో మళ్లీ గోదావరి – రాము ప్రేమించుకుంటారు. రామ్ ఫ్రెండ్ రాజేష్, గోదావరి ఫ్రెండ్ స్వప్న కూడా ప్రేమించుకుంటారు. అయితే ఒక రోజు రాజేష్, స్వప్న ఏకాంతంగా ఉన్నప్పుడు ఊరి జనాల కంట పడతారు. వెంటనే రాజేష్‌ను పట్టుకుని చావగొడతారు. ఆ మరుసటి రోజు పంచాయితీలో ఊరి పెద్దలు వీరిద్దరినీ కఠినంగా శిక్షిస్తారు. వీరి తల్లిదండ్రులను కూడా బాగా అవమానిస్తారు. ఆ బాధ భరించలేక రాజేష్- స్వప్న ఆత్మహత్య చేసుకుని చనిపోతారు.ఈ దారుణాన్ని కళ్లారా చూసిన రామ్, గోదావరి భయపడిపోతారు. . తమ పరిస్థితి కూడా రాజేష్, స్వప్నల మాదిరి తయారవుతుందేమోనని ఆందోళన చెందుతారు. అంతలోనే పెద్దలకు వీరి ప్రేమ విషయం తెలిసిపోతుంది. మరి ఆ తర్వాత వీరి జీవితాలు ఏమయ్యాయి? అన్నదే మిగిలిన కథ.
పరువు హత్యల నేపథ్యంలో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన ఈ సినిమా పేరు ‘కాగితం పడవలు’. వర్ధన్ (రాము), కృష్ణప్రియ (గోదావరి) హీరో, హీరోయిన్లుగా నటించారు. సమ్మెట గాంధీ, ప్రేమ్ సాగర్ రాజులపాటి తదితరులు వివిధ పాత్రలు పోషించారు. ఎంజీఆర్ తుకారాం దర్శకత్వం వహించారు. స్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, T. R. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో దసరా కానుకగా అక్టోబర్ 16 నుంచి ఈ రియల్ లవ్ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది.
సన్ నెక్ట్స్ లో కాగితం పడవలు సినిమా..
Two hearts, one story, and a love worth watching! 💚✨
Watch Kagitham Padayalu (Telugu), streaming exclusively on Sun NXT from October 16!
#KagithamPadayalu #SunNXT #TeluguMovies #SunNXTExclusive https://t.co/ZyRIhWG380
— SUN NXT (@sunnxt) October 11, 2026
కాగితం పడవలు సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




