AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Praveen: తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్.. భార్యతో క్యూట్ ఫొటోస్ షేర్ చేసిన పటాస్ ప్రవీణ్

జబర్దస్త్ ఫేమ్ పటాస్ ప్రవీణ్ త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. ప్రస్తుతం అతని భార్య గర్భంతో ఉంది. కొన్ని రోజుల క్రితమే సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను అందరితో పంచుకున్నాడు ప్రవీణ్. ఇదిలా ఉంటే తాజాగా తన భార్యతో కలిసి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫొటోస్ షేర్ చేశాడు ప్రవీణ్.

Basha Shek
|

Updated on: Oct 11, 2026 | 5:03 PM

Share
 జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో పటాస్ ప్రవీణ్ కూడా ఒకరు. అంతకు ముందు పటాస్ షో తో కెరీర్ ప్రారంభించిన అతను స్టాండప్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కామెడీ పంచులు, ప్రాసలతో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు.

1 / 5
 బర్దస్త్ కామెడీ షోతో మరింత పాపులర్ అయ్యాడు ప్రవీణ్. ఈ షోలోకి అడుగు పెట్టాకే ప్రవీణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ తదితర టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నాడీ స్టార్ కమెడియన్. అలాగే అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ కనిపిస్తున్నాడు.

2 / 5
 టీవీ షోస్ సంగతి పక్కన పెడితే.. ఈ ఏడాది మేలో కడెం వంశిత అనే నటిని పెళ్లి చేసుకున్నాడు ప్రవీణ్. అంతకు ముందు చాలా రోజులుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇరు పెద్దల సమక్షంలో మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు తమ అన్యోన్యమైన ప్రేమ బంధానికి ప్రతీకగా ఓ పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారీ జబర్దస్త్ కపుల్.

3 / 5
 కొన్ని రోజుల క్రితమే తన భార్య గర్భంతో ఉందన్న శుభవార్తను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ప్రవీణ్.  దీంతో పలువురు జబర్దస్త్ ఆర్టిస్టులు, సినీ అభిమానులు, నెటిజన్లు ప్రవీణ్- వంశిత దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

4 / 5
 సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రవీణ్ తాజాగా తన భార్యతో కలిసి దిగిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోల్లో ట్రెడిషినల్ లుక్ లో ఇద్దరూ చాలా అందంగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

5 / 5
Follow Us