Samantha Baby Boy: సమంతకు మగబిడ్డ.. 12 ఏళ్ల క్రితం ఆయన చెప్పిందే నిజమైంది.. వైరల్ వీడియో ఇదిగో
స్టార్ హీరోయిన్ సమంత తల్లిగా ప్రమోషన్ పొందింది. గతేడాది బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న ఇవాళ (నవంబర్ 20) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సమంత- రాజ్ దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.

స్టార్ హీరోయిన్ సమంత అమ్మగా ప్రమోషన్ పొందింది. గతేడాది డిసెంబరులో రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకున్న సామ్ శుక్రవారం (నవంబర్ 20) పండంటి మగబిడ్డను ప్రసవించింది. ఈ శుభవార్తను స్వయంగా సమంతనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తన కొడుకు పట్టుకుని ఉన్న ఫొటోని షేర్ చేసిన సమంత తనకు నవంబర్ 19న ప్రసవం జరిగినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సమంత- రాజ్ నిడిమోరు దంపతులకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే సుమారు సుమారు 12 ఏళ్ల క్రితమే సమంతకు మగబిడ్డే పుడతాడని ఓ జ్యోతిషుడు చెప్పాడు. ఇప్పుడు అదే నిజమైంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. 2010లో ‘ఏ మాయ చేశావె’ సినిమాతో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది సామ్. ఆ తర్వాత మహేష్ బాబు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాగ చైతన్య.. ఇలా తెలుగులో దాదాపు అందరి స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది సామ్. ఇదే క్రమంలో 2014లో యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా చేసిన ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా’ టాక్ షోకి అతిథిగా వెళ్లింది సామ్.
ఈ టాక్ షోలో భాగంగా ఓ సాముద్రికుడు (ముఖం చూసి జాతకం చెప్పే వ్యక్తి) సమంతను చూసి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. సమంతకు మొదటి సంతానం మగబిడ్డే పుడతాడని చెప్పాడు. అయితే అప్పుడు సామ్ మాత్రం తనకు ఆడపిల్లే కావాలని చెప్పింది. ‘నా ముఖాన్ని మరోసారి సరిగ్గా చూసి అమ్మాయి పుడుతుందని చెప్పండి*అంటూ జ్యోతిషుడిని సరదాగా కోరింది. అయితే ఇప్పుడు సదరు జ్యోతిషుడు చెప్పినట్లే సామ్‌కి తొలుత మగబిడ్డే పుట్టాడు. అతడికి దేవ్ అని పేరు కూడా పెట్టేశారు. ఈ నేపథ్యంలో సమంత క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో మాట్లాడిన ఈ త్రోబ్యాక్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
కాగా ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ కోసం సమంత-రాజ్ కలిసి పనిచేశారు. ఈ సిరీస్ షూటింగ్ లోనే వీరు ప్రేమలో పడ్డారు. గతేడాది పెళ్లి చేసుకున్న వీరు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అయిపోయారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ‘మా ఇంటి బంగారం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
వీడియో ఇదిగో..
An astrologer’s prediction came true! Samantha blessed with a baby boy! 👶💙✨ Congratulations 🎉
#KonchemTouchLoUnteCheptha #ZeeTeluguSpotlight #ZeeTelugu https://t.co/sHZ2USDSBd
— ZEE TELUGU (@ZeeTVTelugu) November 20, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




