AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖరీదైన బాదం vs పేదోడి పల్లీలు.. చిట్టి గుండె గట్టిగా ఉండాలంటే ఏది తినాలి..?

గుండె జబ్బుల ముప్పు పెరుగుతున్న ఈ రోజుల్లో.. గుండెను కాపాడుకోవాలంటే ఏం తినాలనే డౌట్ అందరిలోనూ ఉంటుంది. ప్రతి ఇంట్లో దొరికే బాదం, వేరుశెనగలలో గుండె ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది..? కొలెస్ట్రాల్ తగ్గించడంలో వేటికి పవర్ ఎక్కువ..? అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. దీనికి సంబంధించి నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఏంటీ అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Nov 20, 2026 | 6:51 PM

Share
మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి, నిద్రలేమి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది. ఒకప్పుడు వృద్ధులకే పరిమితమైన సమస్యలు ఇప్పుడు యువతలోనూ కనిపిస్తున్నాయి. దీంతో గుండెను కాపాడుకోవడానికి ఏం తినాలనే సందేహం చాలామందిలో ఉంది. ఈ క్రమంలో ప్రతి ఇంట్లో సులభంగా దొరికే బాదం, వేరుశెనగలలో గుండె ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుందనే చర్చ జోరుగా నడుతస్తుంది.

1 / 5
బాదంలో గుండెకు మేలు చేసే అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఇ, ఫైబర్, మెగ్నీషియం, మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్ ఇందులో లభిస్తాయి. సుమారు 28 గ్రాముల బాదంలో దాదాపు 14 గ్రాముల కొవ్వు ఉన్నప్పటికీ, అందులో ఎక్కువ భాగం ఆరోగ్యకరమైనదే. సంతృప్త కొవ్వులకు బదులుగా వీటిని తీసుకుంటే మంచి HDL కొలెస్ట్రాల్ పెరిగి, చెడు LDL కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. అలాగే విటమిన్ ఇ రక్తనాళాలను రక్షిస్తుండగా, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

2 / 5
పల్లీలు ధర పరంగా తక్కువగా కనిపించినా, పోషక విలువల్లో ఏమాత్రం తీసిపోవు. వీటిలో అసంతృప్త కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, నియాసిన్ ఉంటాయి. వారానికి కనీసం రెండుసార్లు పల్లీలు తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. పల్లీలలోని నియాసిన్ చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో తోడ్పడుతుంది. అంతేకాదు పల్లీల పొట్టులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గించడంలోనూ, ఇందులోని పోషకాలు ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యానికి మేలు చేయడంలోనూ సహాయపడతాయి.

3 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బాదం లేదా పల్లీలలో ఏది గొప్పది అనే దానికి ఒక్కటే సమాధానం లేదు. రెండింటిలోనూ వేర్వేరు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. బాదంలో విటమిన్ ఇ, మెగ్నీషియం ఎక్కువగా ఉండగా, పల్లీలలో నియాసిన్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఏదో ఒకదానికే పరిమితం కాకుండా, సమతుల్య ఆహారంలో ఈ రెండింటినీ చేర్చుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

4 / 5
గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కేవలం డ్రై ఫ్రూట్స్ లేదా నట్స్ తినడమే సరిపోదు. క్రమం తప్పని వ్యాయామం, సరిపడా నిద్ర, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం, సమతుల్య ఆహారం వంటి జీవనశైలి మార్పులు కూడా అంతే ముఖ్యం. వీటితో పాటు రోజువారీ ఆహారంలో గుప్పెడు బాదం లేదా వేరుశెనగలు చేర్చుకోవడం గుండె ఆరోగ్యానికి అదనపు బలాన్ని ఇస్తుంది.

5 / 5
Follow Us