Monalisa Bhosle: ఒక్క వీడియోతో వైరల్.. ప్రేమ, పెళ్లితో కెరీర్ పోగొట్టుకున్న మోనాలిసా.. ఇప్పుడేం చేస్తుందంటే..
మహాకుంభ మేళాలలో మాలలు అమ్ముతూ జీవనం గడిపే మోనాలిసా.. కానీ తన తేనేకళ్లతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది. దీంతో ఆమెకు సినీ అవకాశాలు క్యూ కట్టాయి. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఫర్మాన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పట్లో ఆమె పెళ్లి దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మోనాలిసా ఏం చేస్తుంది.. అసలు ఎక్కడుంది అని తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్.

మహాకుంభ మేళాలో దండలు అమ్ముకుంటూ, తన సహజమైన అందం , కళ్లతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పాపులర్ అయిన అమ్మాయి మోనాలిసా భోంస్లే . అప్పటివరకు సాధారణ జీవితం గడిపిన ఆమె, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినిమా అవకాశాల వైపు అడుగులు వేసింది. అయితే ఆ తర్వాత ఆమె జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు, వివాదాలు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మోనాలిసా ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఆమె సినీ కెరీర్ ఏమైంది అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. తేనే కళ్లతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. దీంతో ఆమెకు హీరోయిన్ అవకాశాలు క్యూ కట్టాయి. కానీ అంతలోనే ఆమె ప్రేమ పెళ్లి ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. మోనాలిసా జీవితంలో పెద్ద మలుపు ‘నాగమ్మ’ అనే మలయాళ చిత్ర పూజా కార్యక్రమంతో మొదలైంది. ఆ ప్రాజెక్టులో ఆమె నటిగా ఎంపిక కాగా, ఫర్మాన్ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అదే సెట్లో వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి, పెళ్లి వరకు దారితీసింది. 2026 మార్చి 11న కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఓ ఆలయంలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోవడంతో ఒంటరిగా బయటకు వచ్చేసి మరీ ప్రియుడితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. అయితే కుటుంబ సభ్యుల నుంచి ఎదురైన ఒత్తిడి నేపథ్యంలో మోనాలిసా పోలీసు రక్షణ కోరడం కూడా అప్పట్లో సంచలనంగా మారింది.
వేర్వేరు మతాలకు చెందిన వీరిద్దరి వివాహంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. కొందరు దీనిని వివాదాస్పద కోణంలో చూడగా, మోనాలిసా తండ్రి సైతం తమ కూతురిని తప్పుదారి పట్టించారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను మోనాలిసా, ఫర్మాన్ ఖండించారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయంలోనే పెళ్లి చేసుకున్నామని, ఇద్దరిలో ఎవరూ మతం మార్చుకోలేదని మోనాలిసా స్పష్టం చేసింది. అన్ని మతాలను గౌరవిస్తానని, మోనాలిసా ఇష్టానికి విలువ ఇచ్చానని ఫర్మాన్ వివరణ ఇచ్చాడు.
ఒకప్పుడు వరుస వార్తల్లో నిలిచిన మోనాలిసా, ఇటీవల ఎక్కువగా కనిపించకపోవడంతో ఆమె ఎక్కడుంది, ఏం చేస్తోంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో తన రెండు దక్షిణాది సినిమాలు పూర్తయ్యాయని, త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని మోనాలిసా తెలిపింది. అలాగే ఓ వీడియోలో తెలుగు నటి కల్పలతతో కలిసి కూడా ఆమె కనిపించింది. వ్యక్తిగత జీవితంలోని ఒడుదొడుకులు, వివాదాల తర్వాత ఆమె మళ్లీ వెండితెరపై ఎలాంటి అప్డేట్స్ ఇస్తుందో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మోనాలిసా మాత్రం సినిమాలకు దూరంగా ఉంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..
ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..
