AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Offer: రూ.99కే కేజీ చికెన్ అంటూ ఆఫర్.. ఎగబడ్డ జనం.. కట్‌చేస్తే..

ప్రస్తుతం కార్తీక మాసం స్టార్ట్ అయింది. ఈ నెలలో చాలామంది నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటారు. దీంతో చికెన్‌కు డిమాండ్ భారీగా తగ్గిపోయింది. ఈ క్రమంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఓ చికెన్ సెంటర్ యజమాని వినూత్న ఆఫర్ పెట్టాడు. తమ షాపులో కేజీ చికెన్ రూ.99కే అంటూ లిమిటెడ్ ఆఫర్ ప్రకటించాడు. దీంతో అతని షాపుకు భారీగా కస్టమర్లు వచ్చారు. నిర్మల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Chicken Offer: రూ.99కే కేజీ చికెన్ అంటూ ఆఫర్.. ఎగబడ్డ జనం.. కట్‌చేస్తే..
Karthika Masam Chicken Offer
Anand T
|

Updated on: Nov 20, 2026 | 6:52 PM

Share

కార్తీక మాసం స్టార్ట్ అయింది. ఈ నెల రోజులు ప్రతి ఇంట్లో ఏదో ఒక పూజలు ఉంటాయి. దీంతో చాలామంది నెల రోజులు మాంసాహార వంటకాలకు దూరంగా ఉంటారు. ఇంట్లో పూర్తి శాకాహారాన్నే వండుకుంటారు. దీంతో ఎప్పుడూ జనాలతో కిటకిటలాడే చికెన్ షాపులు ఈ నెల రోజులు మొత్తం బోసిపోయి కనిపిస్తాయి. దీంతో చికెన్‌కు డిమాండ్ తగ్గి చాలామంది వ్యాపారులు గిరాకీని ఎలా పెంచాలని ఆలోచిస్తారు. ఇలా ఆలోచించిన ఓ వ్యాపారి తన గిరాకీ పెంచుకోవడానికి ఓ వినూత్న ఆఫర్ ప్రకటించాడు. కేజీ చికెన్ రూ.99కే అని ప్రకటించడంతో అతని షాపుకు భారీగా వినియోగదారులు తరలివచ్చారు.

వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండల కేంద్రంలోని ఓ చికెన్ సెంటర్ యజమాని ఈ వినూత్న ఆలోచన చేశాడు. కార్తీక మాసంలో గిరాకీ తగ్గడంతో ఈ ఆఫర్ ప్రకటించాడు. ఎప్పుడూ రూ.250కిపైగా దొరికే చికెన్ ఇక్కడ రూ.99కే లభిస్తుందని తెలియడంతో స్థానిక గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల జనాలు కూడా ఒక్కసారిగా అతని షాపు వద్దకు చేరుకున్నారు. ఉదయం నుంచే షాపు ముందు జనం క్యూ కట్టారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో జనాలు రావడంతో షాపు వద్ద స్వల్ప తోపులాట జరిగింది. కాసేపటికి అంతా నార్మల్ అయిపోయింది.

కార్తీక మాసం కారణంగా గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్న చికెన్ షాప్ వ్యాపారి పెట్టిన ఈ ఆఫర్ అతనికి భారీగా కస్టమర్లు వచ్చేలా చేసింది. దీంతో అతనికి కాస్త ఊరట లభించినా.. ఈ నెల మొత్తం దాదాపు తక్కువ గిరాకీతోనే గడపాల్సిన పరిస్థితి. ఇక తక్కువ ధరకే చికెన్ అనడంతో భారీగా జనాలు తరలిరావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us