AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీ వెంటే నేను.. మరణంలోనూ వీడని బంధం! భార్య మృతిని తట్టుకోలేక భర్త కన్నుమూత!

భార్యాభర్తల అనుబంధానికి అద్దం పట్టే విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఏడడుగుల బంధంతో జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని ప్రమాణం చేసుకున్న దంపతులు.. చివరకు మరణంలోనూ విడిపోలేదు. భార్య గుండెపోటుతో మరణించగా, ఆమెను కోల్పోయిన మనోవేదనతో రెండో రోజే భర్త కూడా కన్నుమూశాడు. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

నీ వెంటే నేను.. మరణంలోనూ వీడని బంధం! భార్య మృతిని తట్టుకోలేక భర్త కన్నుమూత!
Unbreakable Bond
N Narayana Rao
| Edited By: |

Updated on: Nov 20, 2026 | 1:43 PM

Share

ఖమ్మం జిల్లా: భార్యాభర్తల అనుబంధానికి అద్దం పట్టే విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఏడడుగుల బంధంతో జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని ప్రమాణం చేసుకున్న దంపతులు.. చివరకు మరణంలోనూ విడిపోలేదు. భార్య గుండెపోటుతో మరణించగా, ఆమెను కోల్పోయిన మనోవేదనతో రెండో రోజే భర్త కూడా కన్నుమూశాడు. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

కొండాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నాగండ్ల శ్రీనివాసరావు (70), ఆయన భార్య రమాదేవి (65) ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. అయితే రమాదేవి అనారోగ్యంతో గుండెపోటుకు గురై మృతి చెందారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. భార్య అంత్యక్రియలు పూర్తయినప్పటికీ శ్రీనివాసరావు ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు.

ఏళ్ల తరబడి తనకు తోడుగా ఉన్న భార్య ఇక లేదన్న బాధతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో రెండో రోజే ఆయన కూడా గుండెపోటుతో మృతి చెందారు. రెండు రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన కుమార్తెలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో కొండాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జీవితంలోనే కాదు.. మరణంలోనూ విడదీయరాని బంధాన్ని చాటిన ఈ దంపతుల విషాద గాథ స్థానికులను కలచివేసింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us