AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch : గాయత్రి మంత్రం జపిస్తున్న ప్రియాంక చోప్రా కుమార్తె.. ఎంత క్యూట్‌గా పాడిందో !!

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "వారణాసి" చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే ప్రియాంక.. తాజాగా తన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేయగా అవి నెట్టింట వైరల్‌గా మారాయి.

Watch : గాయత్రి మంత్రం జపిస్తున్న ప్రియాంక చోప్రా కుమార్తె..  ఎంత క్యూట్‌గా పాడిందో !!
Actress Priyanka Chopra
Korivi Jayakumar
|

Updated on: Nov 20, 2026 | 1:06 PM

Share

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఇప్పుడు హాలీవుడ్‌లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతుంది. 2000లో మిస్ వరల్డ్ కిరీటం ప్రియాంక చోప్రా ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళ చిత్రం ‘తమిళన్’ ద్వారా సినీ కెరీర్ ప్రారంభించినప్పటికీ.. బాలీవుడ్‌ లోనే ఆమెకు ఎక్కువ గుర్తింపు దక్కింది. హిందీలో “అందాజ్”, “డాన్”, “క్రిష్”, “బర్ఫీ”, “ఫ్యాషన్”, “బాజీరావ్ మస్తానీ” వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా “ఫ్యాషన్” చిత్రంతో ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకోగా.. దేశవ్యాప్తంగా ఆమెకు విశేష గుర్తింపు తీసుకొచ్చింది.

కాగా హాలీవుడ్ లోకి అమెరికన్ టీవీ సిరీస్ “క్వాంటికో”లో ప్రధాన పాత్రతో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత “బేవాచ్”, “ఇజ్ నిట్ ఇట్ రొమాంటిక్”, “టెక్స్ట్ ఫర్ యూ”, “సిటాడెల్” వంటి ప్రాజెక్టులతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఇక ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత ఇండియన్‌ సినిమాలో రీ ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం “వారణాసి”. ఈ మోస్ట్ అడ్వెంచరస్ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక.. తాజాగా తన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేయగా అవి నెట్టింట వైరల్‌గా మారాయి.

గాయత్రి మంత్రం జపిస్తున్న ప్రియాంక కుమార్తె..

ప్రియాంక చోప్రా తనకన్నా వయస్సులో చిన్నవాడైనా హాలీవుడ్ స్టార్ సింగర్, నటుడు నిక్ జోనాస్‌తో ప్రేమలో పడటం, అతన్ని పెళ్లి చేసుకోవడం అందరికీ తెలిసిందే. ఈ జంటకు మలతీ మారియా చోప్రా జోనాస్ అనే పాప కూడా ఉంది. ఇటీవలే దీపావళి పండుగను తన భర్త, కూతురితో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది ఈ స్టార్ బ్యూటీ. వాటితో పాటు మరో ఫ్యామిలీ ట్రిప్‌ ఫోటోలు, వీడియోలను కూడా కలిపి ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. అందులో ఆమె ముద్దుల కూతురు గాయత్రి మంత్రం జపిస్తూ కనిపించింది. దాంతో చిన్నారి ఎంత క్యూట్‌గా పాడిందో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఎంత క్యూట్‌గా పాడిందో..

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

ఇక వారణాసి సినిమా విషయానికి వస్తే.. ఇప్పటికే విడుదలైన ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ (పసుపు రంగు చీరలో తుపాకీ పట్టుకున్న స్టిల్) వైరల్ అయ్యింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా.. వీఎఫ్‌ఎక్స్‌ పనులతో బిజీగా ఉన్నారు. మొత్తానికి కొన్నేళ్ల తర్వాత ప్రియాంక చోప్రా నేరుగా ఓ తెలుగు చిత్రంలో.. అది కూడా మహేష్ బాబు సరసన నటిస్తుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ నటి తెలుగులో ఇప్పటివరకు నటించకపోయినా.. రామ్ చరణ్‌తో కలిసి బాలీవుడ్ చిత్రం “జంజీర్”లో నటించారు. ఆ మూవీ తెలుగులో తుఫాన్ పేరుతో రిలీజ్ అయ్యింది.

Follow Us