ధనుష్ సార్ సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నా.. ఆ రోజు అలా జరిగింది..

Rajitha Chanti

Pic credit - Instagram

19 November 2026

టాలీవుడ్‌లో తన అందం, డ్యాన్సింగ్ స్కిల్స్‌తో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల ప్రస్తుతం తమిళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఆసక్తికరమైన విషయాలను ఆమె పంచుకున్నారు. హీరో ధనుష్ సినిమా మిస్ అయినట్లు తెలిపారు.

కేవలం 16 ఏళ్ల వయసులోనే స్టార్ హీరో ధనుష్ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం వచ్చినా, అప్పుడు తాను సిద్ధంగా లేకపోవడం వల్ల ఆ అవకాశాన్ని రిజెక్ట్ చేసిందట.

కెరీర్ బిగినింగ్‌లో ఓ ప్రొడక్షన్ హౌస్ నుంచి తనకు ఫోన్ రావడం అదే మొదటిసారని శ్రీలీల గుర్తుచేసుకున్నారు. ఎవరో ప్రాంక్ కాల్ చేస్తున్నారేమోనని అనుకున్నారట.

మరోసారి కాల్ రావడంతో ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. ఆ తర్వాత ధనుష్‌ను కలిసినప్పుడు, తాను అడిగే ప్రశ్నలకు తన తల్లి సమాధానాలు చెప్పారట.

ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలోని రెండు పాత్రల్లో ఒక దానికి తనను ఎంపిక చేసి, లుక్ టెస్ట్ కోసం రమ్మని పిలిచారని శ్రీలీల వివరించారు.

అయితే ఆ సమయంలో తన వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమేనని, అప్పటికి తాను ఆ అవకాశం కోసం పూర్తిగా సిద్ధంగా లేనని ఆమె స్పష్టం చేశారు.

ప్రస్తుతం తమిళంలో 'ఓమ్', 'ధర్మాన్', 'డేర్ డెవిల్' వంటి చిత్రాలతో పాటు హిందీలోనూ పలు ప్రాజెక్టులతో ముందుకు సాగుతుంది ఈ హీరోయిన్ శ్రీలీల.