తిరిగి ఫామ్ లోకి వచ్చిన బుట్టబొమ్మ.. వరుస సినిమాలతో బిజీ 

19 November 2026

Rajeev Rayala 

కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న పూజా హెగ్డే.. ఇప్పుడు వరుసగా దక్షిణాది ప్రాజెక్టులతో బిజీ అవుతోంది.

 పూజా హెగ్డే ప్రస్తుతం నటిస్తున్న ఆసక్తికరమైన తెలుగు చిత్రం శ్రీ శ్రీ. ఇందులో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నారు.

 రవి నెల్లుట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

  రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కనున్న హారర్ కామెడీ చిత్రం కాంచన 4లోనూ పూజా హెగ్డే నటిస్తోందని టాక్ వినిపిస్తుంది.

 ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్, రొమాంటిక్, కమర్షియల్ సినిమాల్లో కనిపించిన పూజా.. కాంచన 4తో హారర్ కామెడీ జానర్‌లో అలరించనుంది.

ఇప్పటికే బీస్ట్, రెట్రో వంటి సినిమాలతో తమిళ ప్రేక్షకులను పలకరించిన పూజా.. కాంచన 4తో మరోసారి తమిళంలో సందడి చేయనుంది.

ఒకవైపు రొమాంటిక్ డ్రామా.. మరోవైపు హారర్ కామెడీ.. ఇలా రెండు విభిన్నమైన జానర్లను ఎంచుకుంటూ పూజా తన కెరీర్‌లో కొత్త ప్రయోగాలు చేస్తోంది.