వరుసగా 16 ఫ్లాపులు.. కట్ చేస్తే సినిమాలకు గుడ్ బై చెప్పేసి స్టార్ హీరోకు భార్యగా..
దక్షిణాది చిత్రపరిశ్రమలో 1990లలో అందం, అభినయంతో కట్టిపడేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి ఒకరు. ఆమె అప్పట్లో కుర్రాళ్ల కలల రాజకుమారి. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ స్టార్డమ్ దక్కాలని ఉండదు. కొందరు నటీనటులు వెండితెరపై కొన్నేళ్లపాటు సందడి చేసి ఆ తర్వాత వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. మరికొందరు సినిమాలకు దూరమైనా ఇండస్ట్రీతో తమ అనుబంధాన్ని కొనసాగిస్తుంటారు. ఈ కోవలోకి వస్తారు మాజీ హీరోయిన్, మిస్ ఇండియా విజేత నమ్రత శిరోద్కర్. ఒకప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా, కుటుంబ వ్యవహారాలను చూసుకుంటూ బిజీగా ఉన్నారు. అయితే ఆమె ప్రయాణం అంత సులభంగా సాగలేదు. మోడలింగ్ నుంచి సినిమాల వరకు, అక్కడి నుంచి స్టార్ హీరో జీవిత భాగస్వామిగా మారే వరకు నమ్రత జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి. నమ్రత శిరోద్కర్ 1993లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించి టాప్ 6లో నిలిచారు. అందం, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వంతో మోడలింగ్ రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ విజయాలే ఆమెకు సినిమా అవకాశాల బాటలు వేశాయి. నమ్రతకు సినిమాలతో అనుబంధం చిన్నప్పటి నుంచే ఉంది.
1977లో వచ్చిన ‘శిర్డీ కే సాయి బాబా’ చిత్రంలో బాలనటిగా కనిపించారు. అయితే హీరోయిన్గా మాత్రం 1998లో ‘జబ్ ప్యార్ కిసీసే హోతా హై’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత ‘మేరే దో అన్మోల్ రత్న’, ‘హీరో హిందుస్థానీ’ వంటి చిత్రాల్లో నటించారు. అనంతరం బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకున్నారు. నమ్రత కెరీర్లో అన్ని సినిమాలు పరాజయం కాలేదు. 1999లో వచ్చిన ‘వాస్తవ్: ది రియాలిటీ’ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. సంజయ్ దత్ నటించిన ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘కచ్చే ధాగే’, ‘పుకార్’, ‘అస్తిత్వ’, ‘ఆఘాజ్’, ‘అల్బేలా’, ‘తేరా మేరా సాత్ రహే’ వంటి చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా ‘పుకార్’ సినిమాలో నటనకు గాను ఆమె ఐఫా అవార్డుకు ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేషన్ కూడా అందుకున్నారు. ఇలా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. హిందీ చిత్రాలతో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నమ్రత నటించారు. కన్నడ, మలయాళం, తెలుగు చిత్రాల్లో అవకాశాలు అందుకున్నారు. తెలుగులో ‘వంశీ’, ‘అంజి’ వంటి సినిమాల్లో కనిపించారు. అయితే ఆమె సినీ కెరీర్ చాలా కాలం కొనసాగలేదు. వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
నమ్రత జీవితంలో అత్యంత కీలకమైన మలుపు ‘వంశీ’ సినిమా. 2000లో విడుదలైన ఈ చిత్రంలో మహేష్ బాబుతో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. కొంతకాలం తమ ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచిన ఈ జంట.. చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. సుమారు ఐదేళ్ల పరిచయం, ప్రేమ ప్రయాణం తర్వాత 2005 ఫిబ్రవరి 10న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మహేష్ బాబుతో వివాహం తర్వాత నమ్రత నటనకు స్వస్తి చెప్పారు. అప్పటికే ఆమెకు బాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. అయినప్పటికీ సినిమాల కంటే కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి వెండితెరపై నటిగా కనిపించకపోయినా, మహేష్ బాబు కెరీర్‌కు సంబంధించిన వ్యవహారాలు, కుటుంబ బాధ్యతల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మహేష్ బాబు, నమ్రత దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు గౌతమ్ ఘట్టమనేని, కుమార్తె సితార ఘట్టమనేని. ‘1 నేనొక్కడినే’ సినిమాలో గౌతమ్ చిన్నప్పటి మహేష్ బాబు పాత్రలో నటించి ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. మరోవైపు సితార సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, పలు బ్రాండ్లకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
