మూడేళ్ల తర్వాత భారత్‌లో అడుగు పెట్టిన పాక్ మంత్రి.. ఢిల్లీ పర్యటన వెనుక అసలు మతలబు ఇదే!
భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తంగా కొనసాగుతున్న వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన ఫెడరల్ మంత్రి ఒకరు భారత రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. పాకిస్థాన్ వాతావరణ మార్పులు, పర్యావరణ సమన్వయ శాఖ మంత్రి డాక్టర్ ముసాదిక్ మసూద్ మాలిక్ నవంబర్ 20 నుంచి 22 వరకు జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) నాగరిక సంభాషణల వేదికలో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చారు. ఆయన పర్యటనను పాకిస్థాన్ హైకమిషన్ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించింది.

భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తంగా కొనసాగుతున్న వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన ఫెడరల్ మంత్రి ఒకరు భారత రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. పాకిస్థాన్ వాతావరణ మార్పులు, పర్యావరణ సమన్వయ శాఖ మంత్రి డాక్టర్ ముసాదిక్ మసూద్ మాలిక్ నవంబర్ 20 నుంచి 22 వరకు జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) నాగరిక సంభాషణల వేదికలో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చారు. ఆయన పర్యటనను పాకిస్థాన్ హైకమిషన్ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించింది. ఢిల్లీ విమానాశ్రయంలో పాకిస్థాన్ ఛార్జ్ డి అఫైర్స్ సాద్ వరిచ్ ఆయనకు స్వాగతం పలికారు.
2023 మేలో అప్పటి పాక్ విదేశాంగ మంత్రి బిలవల్ భుట్టో జర్దారీ గోవా పర్యటన తర్వాత, పాకిస్థాన్ ఫెడరల్ మంత్రి భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. పహల్గామ్ ఉగ్రదాడి, భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
సాంస్కృతిక మంత్రి స్థానంలో ముసాదిక్ మాలిక్
నవంబర్ 14న పాకిస్థాన్ విదేశాంగ శాఖ ముసాదిక్ మాలిక్‌ను తమ ప్రతినిధి బృందానికి నాయకుడిగా నామినేట్ చేసింది. ఈ కార్యక్రమానికి తొలుత పాకిస్థాన్ జాతీయ వారసత్వ, సాంస్కృతిక శాఖ మంత్రి ఔరంగజేబ్ ఖాన్ ఖిచీని భారత్ ఆహ్వానించింది. అయితే ఆయన స్థానంలో వాతావరణ మార్పుల శాఖ మంత్రిని పంపాలని పాక్ నిర్ణయించింది. నాగరికతల మధ్య సంభాషణ, సాంస్కృతిక అవగాహన, పరస్పర సహకారాన్ని పెంపొందించడమే తమ భాగస్వామ్య లక్ష్యమని పాకిస్థాన్ ప్రకటించింది.
పురానా ఖిలాలో మూడు రోజుల కార్యక్రమం
SCO మొట్టమొదటి నాగరిక సంభాషణల వేదిక నవంబర్ 20 నుంచి 22 వరకు ఢిల్లీలోని చారిత్రాత్మక పురానా ఖిలాలో జరుగుతోంది. నవంబర్ 20న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారు. 2025 సెప్టెంబర్‌లో చైనాలో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశంలో మోదీ ఈ వేదికను ప్రతిపాదించారు. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయి. కళలు, వాస్తుశిల్పం, భాష, సాహిత్యం, మాన్యుస్క్రిప్టులు, ఉమ్మడి చారిత్రక వారసత్వం వంటి అంశాలపై సభ్య దేశాల ప్రతినిధులు చర్చించనున్నారు.
సింధు జలాల ఒప్పందంపై కొనసాగుతున్న విభేదాలు
మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం పాకిస్థాన్‌కు అసంతృప్తిని కలిగించింది. దీనిపై ముసాదిక్ మాలిక్ కూడా గతంలో భారత వైఖరిని విమర్శించారు. ఉగ్రవాదం, కాశ్మీర్, జలాల పంపిణీ వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. SCOలో భారత్, పాకిస్థాన్‌తో పాటు చైనా, రష్యా, ఇరాన్, బెలారస్, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ సభ్యులుగా ఉన్నాయి. 2027 ఆగస్టులో ఇస్లామాబాద్‌లో SCO దేశాధినేతల శిఖరాగ్ర సమావేశానికి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే పాక్ మంత్రి ఢిల్లీ పర్యటనను ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో మార్పునకు సంకేతంగా భావించలేమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇది బహుళపక్ష SCO వేదికకు మాత్రమే పరిమితమైన దౌత్యపరమైన పర్యటనగా చూడాల్సి ఉంటుంది.
Federal Minister for Climate Change and Environmental Coordination @DrMusadikMalik arrived in New Delhi today. He was received at the Airport by the Chargé d’Affaires @Saadawarraich.
@ForeignOfficePk @epwing_official @MoIB_Official https://t.co/hpCOS8Ho0K
— Pakistan High Commission India (@PakinIndia) November 20, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
