AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: మిస్కిన్ టచ్‌పై రచ్చ.. నెటిజన్ కు ఇచ్చి పడేసిన కీర్తి సురేష్

తెలుగులో తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ లో కీర్తిసురేష్ ఒకరు. తమిళ్ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. ఇక మహానటి సినిమాతో తెలుగులో ప్రేక్షకులకు మరింత దగ్గరైయింది

Keerthy Suresh: మిస్కిన్ టచ్‌పై రచ్చ.. నెటిజన్ కు ఇచ్చి పడేసిన కీర్తి సురేష్
Keerthy Suresh
Rajeev Rayala
|

Updated on: Nov 20, 2026 | 8:14 AM

Share

సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న చిన్న విషయాలు కూడా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ సమయంలో నటీనటుల ప్రవర్తన, వారి మధ్య ఉన్న అనుబంధంపై నెటిజన్లు ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటారు. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌కు సంబంధించిన ఓ వీడియో కూడా ఇలాంటి చర్చకే కారణమైంది. దర్శకుడు మిస్కిన్‌తో కలిసి పాల్గొన్న ఓ ప్రెస్‌మీట్‌లో చోటుచేసుకున్న సంఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ వ్యవహారంపై కీర్తి సురేష్ స్వయంగా స్పందిస్తూ ఓ నెటిజన్‌కు గట్టి సమాధానం ఇచ్చారు. కీర్తి సురేష్, దర్శకుడు మిస్కిన్ ప్రధాన పాత్రల్లో నటించిన కోర్టు రూమ్ డ్రామా ‘సత్యవాన్ సావిత్రి’ నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రవీణ్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం మీడియా సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా మిస్కిన్ హీరోయిన్ కీర్తి సురేష్ నటనపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ‘డోరతీ’ సినిమాలో ఆమె కనబరిచిన నటన అద్భుతంగా ఉందని కొనియాడారు. అలాంటి విభిన్నమైన పాత్రల్లో నటించాలంటే ఎంతో ధైర్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా కీర్తి సురేష్‌కు గుర్తుగా ఓ బంగారు ఉంగరాన్ని కూడా బహుమతిగా అందించారు.

కీర్తిని అభినందిస్తున్న సమయంలో మిస్కిన్ ఆమె మోకాలి పైభాగంలో చేయి వేసిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కీర్తి సురేష్ ఆ సమయంలో అసౌకర్యానికి గురైనట్లు ప్రచారం చేశారు. దీంతో ఈ వీడియోపై నెట్టింట చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. సినిమాల్లో హీరోలతో నటించేటప్పుడు ఎలాంటి టచ్‌కైనా నవ్వుతూ ఉంటారని, అలాంటప్పుడు మిస్కిన్ తాకినందుకు మాత్రం ఎందుకు అలా ముఖం పెట్టారని ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలు కీర్తి సురేష్ దృష్టికి వెళ్లడంతో ఆమె నేరుగా స్పందించారు. తన ముఖంలో అసౌకర్యం కనిపించిందని ఎలా నిర్ణయించారని కీర్తి ప్రశ్నించారు. అంతేకాకుండా మిస్కిన్‌తో తనకు తండ్రీకూతుళ్లలాంటి అనుబంధం ఉందనే విషయాన్ని కూడా గుర్తుచేశారు. వారిద్దరి మధ్య ఉన్న బంధం గురించి మాట్లాడకుండా వీడియో ఆధారంగా తప్పుడు అర్థాలు తీసుకోవడం సరికాదని స్పష్టం చేశారు.

అంతటితో ఆగకుండా మరో కీలక విషయాన్ని ప్రస్తావించారు. ఒకవేళ తాను నిజంగానే అసౌకర్యంగా ఫీల్ అయ్యానని అనుకున్నా.. సినిమాల్లో నటించేటప్పుడు హీరోలు తాకుతారు కాబట్టి, బయట కూడా ఎవరైనా అలా ప్రవర్తిస్తే సౌకర్యంగానే ఉండాలా.? అని సదరు నెటిజన్‌ను నిలదీశారు. సినిమాల్లో నటించడం, వ్యక్తిగత జీవితంలో ఒకరి హద్దులను గౌరవించడం రెండూ వేర్వేరు విషయాలని తన సమాధానం ద్వారా స్పష్టం చేశారు. కీర్తి సురేష్ ఇచ్చిన ఘాటైన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆమె స్పందనతో సదరు నెటిజన్ తన పోస్టును తొలగించినట్లు తెలుస్తుంది. దీంతో ఈ వివాదానికి తెరపడినట్లయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us