AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun Sarja – Aishwarya: ‘ నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?’.. అర్జున్ తీవ్ర ఆగ్రహం.. పోలీసులకు ఫిర్యాదు

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇటీవలే తన చిన్న కుమార్తెకు ఒక విదేశీయుడితో వివాహం జరిపించారు. అయితే ఇదే టైమ్ లో తన పెద్ద కుమార్తె, ఆమె భర్త గురించి తప్పుడు వార్తలు రాస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు అర్జున్. ఈ సందర్భంగా తన పెద్ద కుమార్తె, నటి ఐశ్వర్య అర్జున్ వ్యక్తిగత జీవితంపై వస్తోన్న నిరాధారమైన, అవమానకరమైన ఆరోపణలను ఆయన ఖండించారు.

Arjun Sarja - Aishwarya: ' నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం.. పోలీసులకు ఫిర్యాదు
Arjun Sarja, Aishwarya
Basha Shek
|

Updated on: Nov 19, 2026 | 10:12 PM

Share

స్టార్ నటుడు అర్జున్ తన చిన్న కూతురు అంజనా పెళ్లిని గ్రాండ్ గా జరిపారు. అక్టోబర్ లో జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు అర్జున్ సర్జా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే, పెద్ద కూతురు నటి ఐశ్వర్య, ఆమె భర్త నటుడు ఉమాపతి రామయ్య ఈ పెళ్లికి హాజరు కాలేదు. దీంతో ఐశ్వర్య వివాహంపై ఒక్కసారిగా లేని పోని రూమర్లు వ్యాపించాయి. కొందరు ఆమె వ్యక్తిగత అలవాట్లపై కూడా అవమానకరమైన రీతిలో కథనాలు అల్లారు. దీంతో ఐశ్వర్య తండ్రి , నటుడు అర్జున్ ఈ ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆయన చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే తన కూతురు వైవాహిక జీవితంపై వస్తోన్న రూమర్లను ఖండిస్తూ ఒక నోట్ కూడా రిలీజ్ చేశాడు. ‘ముందుగా నా చిన్న కూతురు అంజనా పెళ్లికి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అయితే ఈ వివాహం జరిగిన సమయంలోన నా పెద్ద కుమార్తె ఐశ్వర్య వ్యక్తిగత జీవితంపై చాలా రూమర్స్ వచ్చాయి. కానీ నేను ఆమె వ్యక్తిగత విషయాలపై స్పందించకుండా, గోప్యతని గౌరవిస్తూ మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ప్రతి మహిళ తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలను సొంతంగా తీసుకునే హక్కు కలిగి ఉంది. ఐశ్వర్య కూడా తనకు అనిపించినప్పుడు తానే అన్నీ విషయాలని వెల్లడిస్తుంది. కానీ తండ్రిగా నా కూతురు వ్యక్తిత్వం, వ్యక్తిగత జీవితం గురించి తప్పుడు, అవమానకరమైన ఆరోపణలు చేస్తుంటే మౌనంగా ఉండలేను’

‘ప్రజాజీవితంలో ఉన్నోళ్లపై విమర్శలు, పుకార్లు సహజమే. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక మహిళపై ఆరోపణలు చేయడం, ఆమెని మద్యపానానికి బానిసగా చిత్రీకరించడం బాధ్యతారాహిత్యం. మౌనం గౌరవప్రదమైన స్పందన మాత్రమే. అలా అనీ దానిని అంగీకారంగా భావించకూడదు. తప్పుడు ప్రచారం పదేపదే చేయడాన్ని సహించలేం. జర్నలిజం, వార్తా రిపోర్టింగ్ వృత్తులపై నాకు చాలా గౌరవం ఉంది. కానీ కొన్ని మీడియా సంస్థలు నిజానిజాలను పట్టించుకోకుండా కేవలం సంచలనాల కోసం వ్యక్తిగత దాడులు, నిరాధార ఆరోపణలను ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయం కేవలం నా కూతురికి సంబంధించినది మాత్రమే కాదు. సమాజంలో ప్రతి మహిళ గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం. ఫ్యామిలీ సపోర్ట్ లేని మహిళలకు ఇలాంటి ఆరోపణలు మరింత ఇబ్బందికరంగా మారుతాయి.ఇకపై ఇలాంటి నిరాధార, పరువునష్టం కలిగించే ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. గౌరవం, ఆత్మాభిమానం విషయంలో రాజీ ఉండదు’ అని రాసుకొచ్చారు అర్జున్. ప్రస్తుతం ఈ నోట్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి

కొన్ని రోజుల క్రితం, ఉమాపతి తండ్రి, నటుడు తంబి రామయ్య, విడాకుల వార్త కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేశారు. వారిద్దరూ చెన్నైలోని తమ నివాసంలో సంతోషంగా కలిసి ఉన్నారని ఆయన చెప్పారు. ఐశ్వర్య, ఉమాపతిలకు 2024 జూన్‌లో చెన్నైలో వివాహం జరిగింది. కానీ ఇప్పుడు, వారిద్దరూ పెళ్లిలో కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఈ రూమర్లు పుట్టుకొచ్చాయి.

అర్జున్ రిలీజ్ చేసిన నోట్..

View this post on Instagram

A post shared by Arjun Sarja (@arjunsarjaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..
పసిడి పతనం.. సామాన్యుడికి సంబరం.. ఇన్వెస్టర్లకు షాక్..
పసిడి పతనం.. సామాన్యుడికి సంబరం.. ఇన్వెస్టర్లకు షాక్..
డీమార్ట్‌లో గడియారాలు, కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా..? ఈ సీక్రెట్
డీమార్ట్‌లో గడియారాలు, కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా..? ఈ సీక్రెట్
దేవ ఉత్థాన ఏకాదశి: నవంబర్ 20న మేల్కొంటున్న శ్రీమహావిష్ణువు..
దేవ ఉత్థాన ఏకాదశి: నవంబర్ 20న మేల్కొంటున్న శ్రీమహావిష్ణువు..
స్పెషల్ సాంగ్ చేసిన స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే..
స్పెషల్ సాంగ్ చేసిన స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే..
OTTలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ హవా.. IMDBలోనూ టాప్ రేటింగ్
OTTలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ హవా.. IMDBలోనూ టాప్ రేటింగ్
క్రెడిట్ కార్డు బిల్లు లేట్‌గా చెల్లిస్తున్నారా..? ఇకపై వడ్డీలు..
క్రెడిట్ కార్డు బిల్లు లేట్‌గా చెల్లిస్తున్నారా..? ఇకపై వడ్డీలు..
సూర్యుడి అనురాధ నక్షత్ర ప్రవేశంతో ఈ 4 రాశులకు అదృష్టం.. ఆ లక్కీ..
సూర్యుడి అనురాధ నక్షత్ర ప్రవేశంతో ఈ 4 రాశులకు అదృష్టం.. ఆ లక్కీ..