Raghu Babu: ఆయన చేయాల్సిన పాత్రతో నేను హీరోగా ఎంట్రీ ఇచ్చా.. ఆ నటుడి వల్లే ఇండస్ట్రీలోకి వచ్చా.. రఘుబాబు..
నటనపై ఆసక్తి లేకపోయినా, తన తండ్రి గిరిబాబు సినీ నేపథ్యం, స్నేహితుల ప్రోత్సాహంతో తాను సినీరంగంలోకి అడుగుపెట్టినట్లు వెల్లడించారు నటుడు రఘుబాబు. ఆ తర్వాత సత్యారెడ్డి గారి పట్టుదల కారణంగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన మొదట్లో వరుసగా సినిమాలు ప్లాప్ కావడంతో నిరాశ చెందారు. కనీ ఒక నాటకంలో సీనియర్ టాలీవుడ్ నటుడి స్థానంలో ఊహించని విధంగా హీరోగా నటించాల్సి రావడంతో ఆయన నట జీవితానికి బలమైన పునాది పడిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ప్రముఖ నటుడు రఘుబాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రఘుబాబు మాట్లాడుతూ తన సినీ ప్రవేశానికి సంబంధించిన ఆసక్తికరమైన కథను వివరించారు. తన తండ్రి, ప్రముఖ నటుడు గిరిబాబు సినీ రంగంలో నిర్మాతగా ఎదుర్కొన్న కష్టాలు, ఆర్థిక సమస్యలను దగ్గరగా చూసిన తనకు నటనపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదని తెలిపారు. ఆయన ఎక్కువగా ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకునేవారు. అయితే, ఆయన సినీ ప్రవేశానికి పలువురి ప్రోత్సాహం, అనూహ్య సంఘటనలు కారణమయ్యాయి. రఘుబాబు తన ఖాళీ సమయంలో దర్శకుడు వంశీతో కలిసి గడిపేవారు. వంశీకి ఉన్న కళాత్మక దృక్పథం, ఆయన ఆలోచనలు రఘుబాబును ఆకర్షించేవి. వంశీ ద్వారా బాపు, రమణ వంటి మహానుభావులను కలిసే అవకాశం కూడా రఘుబాబుకు లభించింది. ఈ దశలో, దివంగత దర్శకుడు సత్యారెడ్డి గారు రఘుబాబును నటనలోకి రమ్మని పదేపదే ప్రోత్సహించేవారు. 1990లో సత్యారెడ్డి గారు “సామ్రాజ్యం” అనే సినిమా తీశారు. ఈ సినిమాలో ఆరుగురు కొత్త హీరోలలో రఘుబాబు ఒకరు. నటనపై ఆసక్తి లేకపోయినా, సత్యారెడ్డి గారి బలవంతం మేరకు రఘుబాబు ఆ సినిమాలో నటించారు. షూటింగ్ సమయంలోనూ ఆయనకు నటన పట్ల పెద్దగా ఆసక్తి ఉండేది కాదు, ప్రొడక్షన్ పనులు చూస్తూనే అప్పుడప్పుడు వెళ్లి డైలాగులు చెప్పి వచ్చేవారు.
ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..
“సామ్రాజ్యం” సినిమా ఆశించిన విజయం సాధించనప్పటికీ, ప్రివ్యూ చూసిన తర్వాత గిరిబాబు స్నేహితులు – గుమ్మడి, మురళీమోహన్, ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ వంటి పెద్దలు – రఘుబాబు నటనను మెచ్చుకొని ప్రోత్సహించారు. “నవ్వుతున్నారు జనాలు, నువ్వు ట్రై చేయొచ్చు” అని సలహా ఇచ్చారు. ఆ తర్వాత “నేరం”, “సత్యభామ సరదా కృష్ణులు” వంటి కొన్ని సినిమాలలో నటించినా అవి కూడా అంతగా ఆడలేదు. దీంతో రఘుబాబుకు సినీ రంగం తనకు అచ్చిరాదనే అభిప్రాయం కలిగింది. ఈ దశలో, వంశీ గారు నిర్మించిన “లేడీ డిటెక్టివ్” అనే సీరియల్‌లో ఒక ఎపిసోడ్ చేయమని రఘుబాబును అడిగారు. అప్పటికే వంశీతో ఉన్న సాన్నిహిత్యం, ఖాళీ సమయం కారణంగా రఘుబాబు ఆ ఎపిసోడ్‌లో నటించారు. అదే సమయంలో, ప్రముఖ రంగస్థల నటులు రాళ్ళపల్లి గారు, సూరి శర్మ గారు కలిసి ఒక నాటకానికి రిహార్సల్స్ చేస్తుండేవారు. ఈ నాటకానికి హీరోగా చంద్రమోహన్ గారు ఎంపికయ్యారు. రిహార్సల్స్ జరుగుతుండగా, చంద్రమోహన్ గారికి రామానాయుడు గారి సినిమా షూటింగ్ కోసం కారంచేడు వెళ్లాల్సి వచ్చింది. నాటకానికి ఒక్క వారం రోజుల సమయం మాత్రమే ఉండగా, చంద్రమోహన్ గారు వెళ్లడంతో నాటకం ఆగిపోతుందేమోనని అంతా ఆందోళన పడ్డారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..
అప్పుడు రఘుబాబు ధైర్యం చేసి, రాళ్ళపల్లి గారిని “ఆ పాత్రను నేను చేస్తా” అని అడిగారు. చంద్రమోహన్ వంటి నటుడు చేయాల్సిన పాత్రను తను చేస్తానని అనడంతో రాళ్ళపల్లి, సూరి శర్మ వంటి పెద్దలు షాకయ్యారు. రెండు నెలలుగా జరుగుతున్న రిహార్సల్స్‌ను తాను చూశానని, ప్రయత్నిస్తానని రఘుబాబు చెప్పారు. రిహార్సల్స్ సమయంలో అక్కడే టీఫిన్, భోజనం చేస్తూ, అందరి నటనను గమనిస్తూ ఉండేవారట. ఎంతగా ఆ పాత్ర రఘుబాబుకు అలవడిపోయిందంటే, అడిగిన వెంటనే పూర్తి విశ్వాసంతో నాటకం చేయగలనని చెప్పారు. మొదట నమ్మకపోయినా, ఆయన నటన చూసిన తర్వాత “ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు?” అని ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనతో, చంద్రమోహన్ గారి స్థానంలో రఘుబాబు ఆ నాటకానికి హీరోగా నటించారు. ఇది రఘుబాబు పూర్తిస్థాయి రంగస్థల ప్రవేశానికి, తద్వారా ఆయన నట జీవితానికి బలమైన పునాది వేసింది. చిన్నతనంలో తొమ్మిదేళ్ల వయసులో రావి నూతల గ్రామంలో “శ్రీకృష్ణ తులాభారం” నాటకంలో వసంతుకుడి పాత్రను పోషించిన అనుభవం ఆయనకు ఉండగా, ఈ నాటకం ఆయనను పూర్తి స్థాయి హీరోగా నిలబెట్టింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..
ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..
