AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. ఫ్రెష్ చేపలను గుర్తించడం ఇంత ఈజీనా.. ఈ సింపుల్ టిప్స్ తెలిస్తే చాలు..

చేపలంటే చాలామందికి ఎంతో ఇష్టం. అయితే చేపలు కొనేటప్పుడు చాలామంది వాటి ధర, పెద్దవా, చిన్నవా అని మాత్రమే చూస్తుంటారు. నిజంగా అవి తాజాగా ఉన్నాయా? లేవా? అన్నది మాత్రం పెద్దగా పట్టించుకోరు. నాణ్యత లేని చేపలను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరి మార్కెట్‌లో మంచి చేపలను ఎలా గుర్తించాలి? చేపలు కొనేటప్పుడు ఎలాంటి విషయాలను పరిశీలించాలి? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. ఫ్రెష్ చేపలను గుర్తించడం ఇంత ఈజీనా.. ఈ సింపుల్ టిప్స్ తెలిస్తే చాలు..
How To Identify Fresh Fish
Krishna S
|

Updated on: Nov 20, 2026 | 8:21 PM

Share

చేపల కూర అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మందే ఉంటారు. వారంలో కనీసం ఒకరోజైనా చేపలు తినాలని కోరుకునే వారు చాలామంది ఉంటారు. అయితే చేపలు కొనేటప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే.. వాటి పరిమాణం, ధర, రంగు మాత్రమే చూసి కొనడం. కానీ చేప తాజాగా ఉందా? ఎంతసేపటి క్రితం పట్టారు? సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేశారా? అనే విషయాలను పెద్దగా పట్టించుకోరు. వాస్తవానికి చేపల తాజాదనాన్ని గుర్తించడానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వాటిని గమనిస్తే పాడైపోయిన చేపలను కొనే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

ముందుగా చేప కళ్లను చూడండి..

చేపను కొనేటప్పుడు ముందుగా దాని కళ్లను పరిశీలించాలి. తాజాగా ఉన్న చేప కళ్లలో స్పష్టత, మెరుపు కనిపిస్తాయి. కళ్లు ఉబ్బెత్తుగా లేదా సహజ ఆకృతిలో ఉంటాయి. చేప పాతబడుతున్న కొద్దీ కళ్లు మసకబారడం, లోపలికి కుంగిపోవడం జరుగుతుంది. కాబట్టి కళ్లు పాలిపోయినట్లు కనిపించే చేపలను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మొప్పల రంగును తప్పకుండా గమనించండి..

చేప తాజాదనాన్ని గుర్తించడానికి మొప్పలు కూడా ముఖ్యమైన సూచిక. చేప తల పక్కన ఉండే మొప్పలను కొద్దిగా పైకి ఎత్తి చూడాలి. తాజాగా ఉన్న చేపల్లో ఇవి ఎరుపు లేదా గులాబీ కలిసిన ఎరుపు రంగులో కనిపిస్తాయి. చేప ఎక్కువ రోజులది అయితే వాటి రంగు గోధుమ లేదా బూడిద రంగులోకి మారవచ్చు. మొప్పల దగ్గర అసహజమైన జిగురు పదార్థం, దుర్వాసన ఉన్నా అలాంటి చేపలను కొనకపోవడం మంచిది.

వేలితో నొక్కి చూస్తే అసలు విషయం తెలుస్తుంది..

చేప తాజాదనాన్ని తెలుసుకోవడానికి మరో సులభమైన పద్ధతి దాని మాంసం గట్టిదనాన్ని పరిశీలించడం. చేప శరీరంపై వేలితో నెమ్మదిగా నొక్కాలి. తాజాగా ఉన్న చేప మాంసం తిరిగి తన పాత ఆకృతికి వస్తుంది. నొక్కిన చోట గుంట అలాగే ఉండిపోతే, మాంసం మరీ మెత్తగా లేదా వదులుగా అనిపిస్తే ఆ చేప నాణ్యత తగ్గినట్లు అనుమానించాలి.

చేప చర్మం, పొలుసులను పరిశీలించండి..

మంచి చేప చర్మం సాధారణంగా సహజమైన మెరుపుతో, తేమగా కనిపిస్తుంది. పొలుసులు గట్టిగా అతుక్కుని ఉంటాయి. చేప ఎక్కువ రోజులది అయితే చర్మం మెరుపు తగ్గడం, పొలుసులు ఊడిపోవడం వంటి మార్పులు కనిపించవచ్చు. అలాగే శరీరంపై గాయాలు, అసహజమైన రంగు మార్పులు, చిక్కటి జిగురు పొరలు ఉన్నాయా అని గమనించాలి.

ముక్కలుగా కోసిన చేపలు కొంటున్నారా? ఇవి చూడండి..

చాలామంది మార్కెట్‌లో మొత్తం చేపలను కాకుండా ముందే ముక్కలుగా కోసిన చేపలను కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో మరింత జాగ్రత్త అవసరం. ఎందుకంటే ముక్కలుగా కోసిన చేపల్లో కళ్లు, మొప్పలు వంటి లక్షణాలను పరిశీలించే అవకాశం ఉండదు. అందుకే చేప మాంసం గట్టిగా ఉందా? సహజమైన తేమతో కనిపిస్తోందా? అంచులు ఎండిపోయాయా? రంగు మారిందా? అనే విషయాలను గమనించాలి. మాంసం అంచుల్లో నల్లటి లేదా గోధుమ రంగు మార్పులు, ఎండిపోయిన భాగాలు, అసహజమైన జిగురు కనిపిస్తే కొనుగోలు చేయకూడదు. ముక్కల నుంచి ఎక్కువగా నీరు కారుతున్నా, దుర్వాసన వస్తున్నా జాగ్రత్తపడాలి.

Follow Us
ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. ఫ్రెష్ చేపలను గుర్తించడం ఇంత ఈజీనా..
ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. ఫ్రెష్ చేపలను గుర్తించడం ఇంత ఈజీనా..
ఆ సినిమా మొత్తం నైటీలోనే చేశా..
ఆ సినిమా మొత్తం నైటీలోనే చేశా..
రెండు కాళ్లపై నిలబడి ఫేమస్.. 23 ఏళ్లకి గిన్నిస్ రికార్డు!
రెండు కాళ్లపై నిలబడి ఫేమస్.. 23 ఏళ్లకి గిన్నిస్ రికార్డు!
మహిళలు ముక్కుకు ఎడమ వైపునే ముక్కుపుడక ఎందుకు ధరిస్తారు?
మహిళలు ముక్కుకు ఎడమ వైపునే ముక్కుపుడక ఎందుకు ధరిస్తారు?
సమంతకు మగబిడ్డ.. 12 ఏళ్ల క్రితం ఆయన చెప్పిందే నిజమైంది.. వీడియో
సమంతకు మగబిడ్డ.. 12 ఏళ్ల క్రితం ఆయన చెప్పిందే నిజమైంది.. వీడియో
అంత గుడ్డిగా ఎలా నమ్మావ్‌ బ్రో.. ఎస్‌ఐ నంటూ ఫోన్‌ కట్‌చేస్తే..
అంత గుడ్డిగా ఎలా నమ్మావ్‌ బ్రో.. ఎస్‌ఐ నంటూ ఫోన్‌ కట్‌చేస్తే..
పూజల్లో ఎక్కువగా వాడే ఈ రంగుల వెనుక అసలు అర్థం తెలుసా?
పూజల్లో ఎక్కువగా వాడే ఈ రంగుల వెనుక అసలు అర్థం తెలుసా?
అప్పట్లోనే చిరంజీవి నటించిన ఇంగ్లీష్ సినిమా.. ఎందుకు ఆగిపోయిందంటే
అప్పట్లోనే చిరంజీవి నటించిన ఇంగ్లీష్ సినిమా.. ఎందుకు ఆగిపోయిందంటే
ఆ హీరోయిన్‌ వల్లనే నేను స్టార్ డైరెక్టర్ అయ్యా:ధురంధర్ డైరెక్టర్
ఆ హీరోయిన్‌ వల్లనే నేను స్టార్ డైరెక్టర్ అయ్యా:ధురంధర్ డైరెక్టర్
చలికాలంలో ఈ లడ్డూలు పిల్లలకు తినిపిస్తే ఉక్కులా తయారవుతారు..
చలికాలంలో ఈ లడ్డూలు పిల్లలకు తినిపిస్తే ఉక్కులా తయారవుతారు..