టీ తాగేటప్పుడు చేసే ఈ 7 తప్పులు అస్సలు చేయకండి.

20 November 2026

Anand T

టీ చాలా మంది ఇది లేకుండా రోజు గడవదు.. మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కనీసం 4 టైమ్స్‌ అయినా టీ తాగుతారు.

టీ లవర్స్

కానీ టీ తాగే విషయంలో చేసే కొన్ని పొరపాట్లు ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, కాలేయంపై కూడా ప్రభావం చూపవచ్చు.

పొరపాట్లు

టీ ఆకులు లేదా టీ బ్యాగ్‌ను ఎక్కువ సేపు మరిగించడం వల్ల కెఫీన్, టానిన్‌ల పరిమాణం పెరిగి ఎసిడిటీ, కడుపులో అసౌకర్యం కలుగుతాయి.

ఎక్కువ మరిగించడం

మార్నింగ్ లేచిన వెంటనే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కొంతమందిలో వికారం, గుండెల్లో మంట, కడుపు నొప్పి రావచ్చు.

ఖాళీ కడుపుతో టీ

ఎక్కువ సార్లు చక్కెర వేసిన టీ తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగి, దీర్ఘకాలంలో ఊబకాయం, ఫ్యాటీ లివర్ ప్రమాదం పెరగవచ్చు.

ఎక్కవ చక్కెర

ఎక్కువ పాలతో టీ తాగడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా లాక్టోజ్ జీర్ణం కాని వారికి.

ఎక్కువ పాలతో టీ

తిన్న వెంటనే టీ తాగితే అందులోని పాలిఫెనాల్స్ ఆహారంలోని ఇనుము శోషణను తగ్గిస్తాయి.

భోజనం తర్వాత టీ

రోజంతా అనేక కప్పుల టీ తాగితే శరీరంలో కెఫీన్ పెరిగి నిద్రలేమి, ఎసిడిటీ, గుండె దడ, చంచలతకు కారణమవుతుంది. కాబట్టి టీను లిమిట్‌లో మాత్రమే తాగండి.

అతిగా టీ తాగడం