నిమ్మకాయలను ఇలా స్టోర్ చేస్తే వారమైనా ఫ్రెష్‌గా ఉండాల్సిందే

20 November 2026

Anand T

నిమ్మకాయ.. దీనిని వంటల్లో మాత్రమే కాకుండా నేరుగా జ్యూస్‌లలో తీసుకున్నా మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

నిమ్మకాయ

అయితే ఈ నిమ్మకాయలు మార్కెట్ నుంచి తెచ్చిన కొన్ని రోజులకే వాడిపోతూ ఉంటాయి. ప్రతి ఇంట్లో ఉండే ప్రధాన సమస్య ఇది.

పాడై పోవడం

అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే నిమ్మకాయలను వారం రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు.

చిట్కాలు

నిమ్మకాయలు ఎక్కువ రోజులు ఫ్రష్‌గా ఉండాలంటే గాజు సీసాలో లేదా గాలిచొరబడని ప్లాస్టిక్ డబ్బాలో నిమ్మకాయలు మునిగే విధంగా వాటర్ పోసి స్టోర్ చేయాలి.

నీటిలో నిల్వ

లేదా నిమ్మకాయలను ముందు శుభ్రంగా కడిగి వాటికి నీటి తడి లేకుండా జిప్‌లాక్ బ్యాగ్‌లో పెట్టి స్టోర్ చేయండి. తర్వాత దాన్ని ఫ్రిజ్‌లో ఉంచండి.

జిప్‌లాక్ బ్యాగ్‌

అయితే మీరు నిమ్మకాయలను ఎప్పుడూ సూర్యరశ్మి తగలకుండా, చల్లని ప్రదేశంలో నిల్వ చేయడం మంచిది.

చల్లని ప్రదేశం

కోసిన నిమ్మకాయలు త్వరగా ఎండిపోతాయి. కాబట్టి వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి, కోసిన భాగాన్ని క్లింగ్ ఫిల్మ్‌తో బాగా కప్పి ఫ్రిజ్‌లో నిల్వ చేయండి.

కోసిన కాయ

నిమ్మకాయలను ఎప్పుడూ ఆపిల్, అరటి, టమోటాలతో ఉండే ట్రేలో నిల్వ చేయవద్దు. ఇలా చేస్తే అవి రిలీజ్ చేసే ఇథిలీన్ వల్ల నిమ్మకాయలు త్వరగా పండిపోవచ్చు.

పండ్లుతో