AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: గవర్నమెంట్ జాబ్‌కు రిజైన్ చేసి జబర్దస్త్ లోకి.. ఇప్పుడు స్టార్ కమెడియన్‌గా బిజీ బిజీగా.. ఎవరంటే?

ప్రభుత్వం ఉద్యోగం చేయాలంటే రాసిపెట్టుండాలి. అందిరకీ ఇలాంటి అవకాశాలు రావు. అయితే ఇతను మాత్రం తన దాకా వచ్చిన సర్కారు ఉద్యోగాన్నేత్రుణప్రాయంగా వదిలిపెట్టేశాడు. తన కలల ప్రపంచం వైపు అడుగులు వేశాడు. మొదట కష్టాలెదురైనా ఎదుర్కొని నిలబడ్డాడు. ఇప్పుడు టాప్ కమెడియన్ గా అందరి మన్ననలు అందుకుంటున్నాడు.

Jabardasth: గవర్నమెంట్ జాబ్‌కు రిజైన్ చేసి జబర్దస్త్ లోకి.. ఇప్పుడు స్టార్ కమెడియన్‌గా బిజీ బిజీగా.. ఎవరంటే?
Jabardasth Actor
Basha Shek
|

Updated on: Oct 16, 2026 | 1:13 PM

Share

2013లో ప్రారంభమైన జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు వీరిలో చాలా మంది సినీ పరిశ్రమలో హీరోలుగా, డైరెక్టర్లుగా, కమెడియన్లుగా, సహాయక నటులుగా, నిర్మాతలుగా రాణిస్తున్నారు. జబర్దస్త్ లో చేసిన సుడిగాలి సుధీర్, బలగం వేణు, రామ్ ప్రసాద్, గెటప్ శీను, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ తదితరులు ఇప్పుడు వెండితెరపై సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే సాధారణ మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి, జబర్దస్త్ లోకి అడుగు పెట్టి, ఇప్పుడు స్టార్ కమెడియన్ గా రాణిస్తున్నాడు వెంకీ మంకీ అలియాస్ బొజ్జపల్లి వెంకట్. ప్రస్తుతం జబర్దస్త్ లో పెద్దగా కనిపించకపోయినా మాస్ జాతర వంటి కామెడీ షోల్లో బాగా హైలెట్ అవుతున్నాడీ కమెడియన్. అయితే చాలా మంది లాగే వెంకీ కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఈ స్థాయికి చేరుకున్నాడు. మొదట మిమిక్రీ, వెంటలోగిజం ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించాడు వెంకీ. ఎన్నో ఈవెంట్లలో తన మిమిక్రీ, కామెడీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఒక సాధారణ కంటెస్టెంటుగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన దైన కామెడీ టైమింగ్ తో.. పంచులతో చాలా తక్కువ టైమ్ లోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కంటెస్టెంట్ గా స్టార్ట్ అయ్యి.. టీమ్ లీడర్ వరకూ ఎదిగాడు వెంకీ. ఇతని టీమ్ చేసే స్కిట్లకు ఆడియెన్స్ కడుపుబ్బా నవ్వుతున్నారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన వెంకీ కేవలం నటుడే కాదు, చదువులోనూ టాపర్ . కాకతీయ యూనివర్సిటీ నుంచి మిమిక్రీలో డిప్లొమా పూర్తి చేసి గోల్డ్ మెడల్ అందుకున్నాడు. తన అద్భుతమైన టాలెంట్‌తో వీడియో జాకీగా, మిమిక్రీ , వెంట్రిలాక్విజం ఆర్టిస్టుగా పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన ప్రతిభను గుర్తించిన పలు ప్రభుత్వ రంగ సంస్థలు జాబ్ ఆఫర్ చేశాయి. ముఖ్యంగా సింగరేణి సంస్థతో పాటు ఇతర విభాగాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అయితే లైఫ్ లో సెటిల్ అవ్వడం కంటే సమాజంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాడు వెంకీ.అందుకే ప్రభుత్వ ఉద్యోగం కూడా వదిలేసి తన కలల ప్రపంచం వైపు అడుగులు వేశాడు. ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వెంకీ.. ‘ నాకు సింగరేణి తో పాటు కొన్ని ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అంటే అంత సులభమైన విషయమేమీ కాదు. కానీ నేను వాటన్నింటిని వదులుకున్నాను. నాకు ప్రత్యేక గుర్తింపు ఉండాలనే నాకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం కూడా వదులుకున్నాను. ఎందుకంటే మన గురించి తెలియవలసింది మన ఊర్లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా నా గురించి తెలియజేయాలని అనుకున్నాను’ అని చెప్పుకొచ్చాడు జబర్దస్త్ వెంకీ.

ఇవి కూడా చదవండి

మాస్ జాతర కామెడీ షోలో వెంకీ మంకీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us