AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌లో మారుతున్న యువత ఆలోచనలు.. ఉద్యోగం కంటే సొంత బిజినెస్‌పైనే ఆసక్తి.. కారణం ఇదే!

Indian Youth Business Trends: భారతీయ యువత ఆలోచనల్లో మార్పు వస్తోంది. మంచి ఉద్యోగం సంపాదించడం కంటే సొంతంగా వ్యాపారం ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నారు. లింక్డ్‌ఇన్ తాజా సర్వే ప్రకారం 85 శాతం మంది భారతీయులు పారిశ్రామికవేత్తలుగా మారాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా జెన్ జెడ్, మిలీనియల్స్‌లో ఈ ఆసక్తి ఎక్కువగా ఉంది. AI, సోషల్ మీడియా కూడా కొత్త వ్యాపారాలకు అండగా నిలుస్తున్నాయి.

భారత్‌లో మారుతున్న యువత ఆలోచనలు.. ఉద్యోగం కంటే సొంత బిజినెస్‌పైనే ఆసక్తి.. కారణం ఇదే!
Indian Youth Business Trends
Rajashekher G
|

Updated on: Nov 25, 2026 | 7:33 PM

Share

Indian Youth Business Trends: ఒకప్పుడు మంచి జీతంతో కూడిన ఉద్యోగం సంపాదించడమే చాలామంది భారతీయుల ప్రధాన లక్ష్యంగా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఉద్యోగం చేయడం కంటే సొంతంగా వ్యాపారం ప్రారంభించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని చాలామంది యువత కలలు కంటున్నారు. సొంతంగా ఏదైనా సాధించాలనే ఆలోచన భారతీయుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా లింక్డ్‌ఇన్ (LinkedIn Survey 2026) నిర్వహించిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో ఏకంగా 85 శాతం మంది సొంత వ్యాపారం ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇది ప్రపంచ సగటుతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం విశేషం.

యువతలో పెరుగుతున్న వ్యాపార ఆలోచనలు

ముఖ్యంగా జెన్ జెడ్ (Gen Z), మిలీనియల్స్ (Millennials) తరానికి చెందిన యువతలో వ్యాపారంపై ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధన వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న జెన్ జెడ్ యువతలో 94 శాతం మంది, మిలీనియల్స్‌లో 90 శాతం మంది సొంతంగా వ్యాపారం చేయాలని ఆశిస్తున్నారు. అంతేకాదు.. జెన్ జెడ్‌కు చెందిన ప్రతి పది మందిలో ఏడుగురు రాబోయే మూడేళ్లలో సొంత వ్యాపారం లేదా సైడ్ హస్టిల్ ప్రారంభించాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు.

లింక్డ్‌ఇన్ ప్లాట్‌ఫామ్ డేటా ప్రకారం.. 2022 నుంచి తమ ప్రొఫైళ్లలో ‘ఫౌండర్’ అనే హోదాను చేర్చుకుంటున్న సభ్యుల సంఖ్య 190 శాతం పెరిగింది. జెన్ జెడ్ సభ్యుల్లో ఈ పెరుగుదల ఏకంగా 383 శాతంగా ఉంది. ప్రస్తుతం లింక్డ్‌ఇన్‌లో ఉన్న వ్యవస్థాపకుల్లో మిలీనియల్స్ వాటా అత్యధికంగా 48 శాతంగా ఉంది.

వ్యాపారాలకు సోషల్ మీడియా, ఏఐ అండ

ప్రస్తుతం సొంత వ్యాపారం ప్రారంభించేందుకు గతంతో పోలిస్తే అనేక అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 86 శాతం మంది ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు వ్యాపారాలు ప్రారంభించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ద్వారా కస్టమర్లను చేరుకోవడం సులభమైందని 74 శాతం మంది తెలిపారు. వ్యాపారానికి అవసరమైన సమాచారం, పరిజ్ఞానం సులభంగా లభిస్తోందని 63 శాతం మంది పేర్కొన్నారు.

ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిన్న వ్యాపారాల రూపురేఖలను మారుస్తోంది. సర్వేలో పాల్గొన్న భారతీయ చిన్న వ్యాపార వ్యవస్థాపకుల్లో 90 శాతానికి పైగా ఏఐని ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. ఏఐ, డిజిటల్ టూల్స్ కారణంగా గతంలో అందించలేని ఉత్పత్తులు, సేవలను ఇప్పుడు అందించగలుగుతున్నామని 36 శాతం మంది తెలిపారు. ఏఐ అందుబాటులో లేకపోతే తమకు మరింత పెట్టుబడి అవసరమయ్యేదని 23 శాతం మంది అభిప్రాయపడ్డారు.

సొంత వ్యాపారం ఎందుకు చేయాలనుకుంటున్నారు?

భారతీయ చిన్న వ్యాపార యజమానుల్లో 75 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలను కలిగి ఉన్నట్లు పరిశోధన వెల్లడించింది. ఉద్యోగం చేస్తూనే సొంత వ్యాపారం లేదా ఇతర ఆదాయ మార్గాలను కొనసాగించాలనే ఆసక్తి పెరుగుతోంది.

వ్యాపారం ప్రారంభించడానికి ప్రధాన కారణాల్లో 56 శాతం మంది తమకు నచ్చిన విధంగా పనిచేసే స్వేచ్ఛను కోరుకుంటున్నారు. 52 శాతం మంది అధిక ఆదాయం సంపాదించాలనే లక్ష్యంతో ఉన్నారు. 49 శాతం మంది స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం, పని విషయంలో సౌలభ్యం కోసం వ్యాపారంపై ఆసక్తి చూపుతున్నారు. మరో 41 శాతం మంది ఇతరులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వ్యవస్థాపకులుగా మారాలని భావిస్తున్నారు. భారత్‌లో పారిశ్రామిక ఆలోచనలు వేగంగా పెరుగుతున్నాయని లింక్డ్‌ఇన్ ఇండియా కంట్రీ మేనేజర్ కుమరేష్ పట్టాభిరామన్ తెలిపారు.

2026 అక్టోబర్‌లో సెన్సస్‌వైడ్ (Censuswide) ఈ పరిశోధన నిర్వహించింది. భారత్‌తో పాటు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియాలో మొత్తం 12 వేల మందిని సర్వే చేశారు. అలాగే వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు, చిన్న వ్యాపార యజమానులతో మరో ప్రత్యేక సర్వే నిర్వహించారు. మొత్తంగా చూస్తే భారతీయ యువతలో ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో పాటు సొంతంగా వ్యాపారం నిర్మించుకోవాలనే ఆకాంక్ష కూడా బలంగా పెరుగుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Follow Us
భారత్‌లో మారుతున్న యువత ఆలోచనలు.. ఉద్యోగం కంటే సొంత బిజినెస్‌పైనే
భారత్‌లో మారుతున్న యువత ఆలోచనలు.. ఉద్యోగం కంటే సొంత బిజినెస్‌పైనే
పిండి కలిపేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు.. చపాతీలు సాయంత్రం వరకు
పిండి కలిపేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు.. చపాతీలు సాయంత్రం వరకు
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జంబ్లింగ్ విధానంపై ఇంటర్ బోర్డు
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జంబ్లింగ్ విధానంపై ఇంటర్ బోర్డు
తెలుగు సినిమాల్లో మార్పు రావాలి.. వాటిని ఆపేయాలి - హీరో నిఖిల్
తెలుగు సినిమాల్లో మార్పు రావాలి.. వాటిని ఆపేయాలి - హీరో నిఖిల్
చలికాలంలో ఉసిరి క్యాండీ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?  
చలికాలంలో ఉసిరి క్యాండీ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?  
పదేపదే వాట్సాప్ డీపీ మార్చేవారి మనస్తత్వం ఇలాగే ఉంటుందా?
పదేపదే వాట్సాప్ డీపీ మార్చేవారి మనస్తత్వం ఇలాగే ఉంటుందా?
ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. పిడుగుల హెచ్చరిక!
ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. పిడుగుల హెచ్చరిక!
కొంపముంచిన 75 సెకన్ల రూల్.. ఒక్క బాల్ ఆడకుండానే అవుట్
కొంపముంచిన 75 సెకన్ల రూల్.. ఒక్క బాల్ ఆడకుండానే అవుట్
పులిపిర్లు పూర్తిగా రాలిపోయే సింపుల్ టిప్.. పక్కా రిజల్ట్
పులిపిర్లు పూర్తిగా రాలిపోయే సింపుల్ టిప్.. పక్కా రిజల్ట్
చర్మం పొడిబారకుండా ఉండాలంటే నూనె ఎప్పుడు రాయాలా తెలుసా?
చర్మం పొడిబారకుండా ఉండాలంటే నూనె ఎప్పుడు రాయాలా తెలుసా?