AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు సినిమాల్లో మార్పు రావాలి.. వాటిని ఆపేయాలి – యంగ్ హీరో నిఖిల్ !!

యంగ్ హీరో నిఖిల్.. తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ‘నశా ముక్త్ భారత్ యాత్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమాల్లో మందు, సిగరెట్, డ్రగ్స్ లాంటి చెడు అలవాట్లను హీరోయిజంలా చూపించడం ఎంతవరకు కరెక్ట్? అంటూ వ్యాఖ్యానించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

తెలుగు సినిమాల్లో మార్పు రావాలి.. వాటిని ఆపేయాలి - యంగ్ హీరో నిఖిల్ !!
Actor Nikhil Siddardh
Korivi Jayakumar
|

Updated on: Nov 25, 2026 | 7:04 PM

Share

యంగ్ హీరో నిఖిల్.. తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ముందుగా చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్’ (2007) సినిమాతో నిఖిల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘యువత’, ‘ఆలస్యం అమృతం’, ‘వీడు తేడా’ వంటి సినిమాలతో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. కెరీర్ ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా, తన పంథాను మార్చుకుని సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిఖిల్ కెరీర్‌లో ‘స్వామి రారా’ (2013) ఒక పెద్ద మైలురాయిగా చెప్పొచ్చు. అలానే సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, అర్జున్ సురవరం సినిమాలు నిఖిల్‌లోని నటుడిని మరో స్థాయిలో నిలబెట్టాయి.

పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు..

ఇక ఆ తర్వాత ’18 పేజెస్’, ‘స్పై’ వంటి చిత్రాలతో అలరించగా అవి ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. ప్రస్తుతం ‘స్వయంభు’, ‘ది ఇండియా హౌస్’ వంటి భారీ బడ్జెట్, పీరియాడిక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ‘నశా ముక్త్ భారత్ యాత్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమాల్లో మందు, సిగరెట్, డ్రగ్స్ లాంటి చెడు అలవాట్లను హీరోయిజంలా చూపించడం ఎంతవరకు కరెక్ట్? అంటూ వ్యాఖ్యానించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

తక్షణమే ఆగిపోవాలంటూ..

ఈ మేరకు నిఖిల్ మాట్లాడుతూ.. వెండితెరపై హీరోలు చేసే ప్రతి పనిని యువత ఫాలో అవుతారని అన్నారు. అందుకే తెలుగు సినిమాల్లో కచ్చితంగా మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. డ్రగ్స్, మద్యం, స్మోకింగ్ వంటి వాటిని ప్రోత్సహించేలా సన్నివేశాలు తీయడం మానుకోవాలని కోరారు. సమాజానికి, యువతకు ఆదర్శంగా నిలిచే చిత్రాలు రావాలని.. తాను కూడా మొదటి నుంచీ ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నానని చెప్పారు. ఇప్పటివరకు 21 సినిమాల్లో నటించానని.. కానీ ఏ ఒక్క సినిమాలోనూ డ్రగ్స్ తీసుకునే పాత్ర చేయలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ అలాంటి పాత్రల జోలికి అస్సలు వెళ్లనన్నారు.

ఇక కాలేజీలో చదువుకునే రోజుల్లో తన స్నేహితుల్లో కొందరు డ్రగ్స్ అలవాటు చేసుకోమని తనను కూడా ప్రోత్సహించారని తెలిపారు. ఆ రోజు కనుక తాను బలహీనపడి వాళ్ల ఉచ్చులో పడి ఉంటే.. అసలు హీరోగా పరిచయమయ్యేవాడినే కాదని అన్నారు. ఇండస్ట్రీలో ఇన్ని ఏళ్లుగా నిలదొక్కుకుని 21 సినిమాలు పూర్తి చేయగలిగానంటే.. అందుకు క్రమశిక్షణే కారణమని నిఖిల్ వివరించారు. ప్రస్తుతం నిఖిల్ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియా లోనూ ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరోవైపు నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రం ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ , నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాల ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండగా.. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన రానుంది.

Follow Us