ఏడు వారాల నగలు అంటే ఏంటి? వీటిని ఎందుకు ధరించేవారో తెలుసా?

November 25, 2026

Rajashekher

ఏడు వారాల నగలు అనేవి వారంలోని ఏడు రోజుల పేర్లతో రూపొందించిన ప్రత్యేకమైన బంగారు ఆభరణాలు. ఒక్కో రోజుకు ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.

ఏడు వారాల నగలు అంటే ఏమిటి?

పూర్వం రాజుల కాలంలో ఏడు వారాల నగలకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. వీటిని ధరించడం అప్పట్లో సంపదకు, హోదాకు, వైభవానికి ప్రతీకగా భావించేవారు.

రాజుల కాలం నుంచే ప్రత్యేక గుర్తింపు:

గతంలో అమ్మాయి పెళ్లి సమయంలో వధువుకు ఏడు వారాల నగలను బహుమతిగా ఇచ్చేవారు. అత్తింటి వారైనా, పుట్టింటి వారైనా ఈ ఆభరణాలను పెట్టించడం ఒక ప్రత్యేక సంప్రదాయంగా ఉండేది.

వివాహాల్లో ప్రత్యేక ఆకర్షణ:

వారంలోని ఏడు రోజులకు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శనిగ్రహాలు అధిపతులుగా ఉంటాయని జ్యోతిష్య నమ్మకం.

ఏడు రోజులు.. ఏడు గ్రహాలు:

ఆదివారం సూర్యుడికి సంబంధించిన రోజు. ఈ రోజుకు మాణిక్యం (Ruby) రత్నాన్ని సూచిస్తారు. దీనిని ధరించడం వల్ల సూర్యుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.

ఆదివారం – సూర్యుడికి ప్రత్యేకం:

సోమవారానికి చంద్రుడికి సంబంధించిన ముత్యం (Pearl), మంగళవారానికి కుజుడికి సంబంధించిన పగడం (Coral), బుధవారానికి బుధుడికి సంబంధించిన పచ్చ (Emerald) రత్నాలను సూచిస్తారు.

సోమవారం నుంచి బుధవారం వరకు:

గురువారానికి పుష్యరాగం (Yellow Sapphire), శుక్రవారానికి వజ్రం (Diamond), శనివారానికి నీలమణి (Blue Sapphire) రత్నాలను సూచిస్తారు.

గురువారం నుంచి శనివారం వరకు:

ఏడు వారాల నగలు ధరించడం వల్ల ఒంటినిండా అందమైన ఆభరణాలు ధరించినట్లుగా ఉంటుంది. అంతేకాకుండా ఆయా గ్రహాల అనుకూలత లభించి, గ్రహ దోషాలు తగ్గుతాయని  నమ్మేవారు. అందుకే ఈ నగలకు నేటికీ ప్రత్యేక ఆదరణ ఉంది.

అందంతో పాటు గ్రహ అనుకూలత..