OTT Movie: మనుషులపై వికృత ప్రయోగాలు.. ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. ఒంటరిగా చూడొద్దు
ఓటీటీలో మంచి ట్విస్టలున్న డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్లు, హారర్ థ్రిల్లర్ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ మూవీ మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మనుషులపై వికృత ప్రయోగాలు అనే మెడికల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది.

ఓటీటీలో అన్ని రకాల కంటెంట్ ఉంటుంది. లవ్, కామెడీ, యాక్షన్, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్.. ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉంటాయి. అయితే ఇప్పుడు ఆడియెన్స్ ఎక్కువగా హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలనే ఎక్కువగా చూస్తున్నారు. ముఖ్యంగా జెన్ జీ ఆడియెన్స్ ఈ జానర్ సినిమాలకు ఎక్కువగా ఓటేస్తున్నారు. ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రతి వారం హారర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. వివిధ భాషల్లో హిట్ అయిన సినిమాలు, సిరీస్ లను అనువాదం చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. అలా రీసెంట్ గా ఒక సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ సినిమా సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇదొక డార్క్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ కథ కథనాలు, స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ట్విస్టులు కూడా ఊహించని విధంగా ఉంటాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అంతరించిపోతున్న తేనెటీగలను కాపాడాలనే గొప్ప ఆశయంతో రస్సెల్ అనే యువకుడు పరిశోధనలు చేస్తుంటాడు. అయితే ఆ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లడానికి అతనికి భారీగా డబ్బులు అవసరమవుతాయి. ఇదే క్రమంలో రస్సెల్ కు ప్యాటీ కోల్బ్ అనే ఒక మహిళ నుంచి ఊహించని ఆఫర్ వస్తుంది. చూడటానికి కుక్కలను పెంచుకునే ఒక సాధారణ మహిళలా కనిపించే ప్యాటీ, రస్సెల్ రీసెర్చ్ కోసం అవసరమైనంత డబ్బును ఇస్తానని తన దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తుంది. దీంతో తన ప్రియురాలిని తీసుకుని రస్సెల్ ప్యాటీ ఉండే ప్రాంతానికి వెళతాడు. అయితే అక్కడకు వెళ్లగానే రస్సెల్ కు వింత అనుభవాలు ఎదురవుతాయి. ప్యాటీ కేవలం కుక్కల పెంపకం మాత్రమే కాకుండా, మనుషులపై కూడా అత్యంత వికృతమైన జన్యు ప్రయోగాలు చేస్తోందని రస్సెల్కు అర్థమవుతుంది. దీంతో తాము ఒక పెద్ద ఉచ్చులో చిక్కుకున్నామని రస్సెల్ తెలుసుకుంటాడు. మరి ఆ మృత్యుకూపం నుంచి తనను, తన ప్రియురాలిని రస్సెల్ ఎలా కాపాడుకున్నాడు? ప్యాటీ ఆకృత్యాలను ప్రపంచానికి ఎలా తెలియజేశాడన్నదే ఈ సినిమా స్టోరీ.
ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్న ఈ సినిమా పేరు బ్రీడర్ (Breeder). ఇదొక హాలీవుడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. అలెక్స్ గోయెట్ తెరకెక్కించిన ఈ సినిమాలో డానియల్ డోహెనీ , డాట్-మేరీ జోన్స్ , మాడీ ఫిలిప్స్ , తనయా బీటీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రొటెన్ టొమాటోస్లో ఏకంగా 87 శాతం, IMDbలో 6.7/10 రేటింగ్ సాధించిన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. మంగళవారం (నవంబర్ 26) నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడీ మూవీ కేవలం ఇంగ్లిష్ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సబ్టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. హారర్ థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి బ్రీడర్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
బ్రీడర్ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




