AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చదివింది ఇంటర్.. PMO అధికారిగా చలామణి! 100 మందికి పైగా మోసం చేసిన కేటుగాడు!

చదివింది కనీసం ఇంటర్మీడియట్ కూడా కాదు.. కానీ తనను తాను ఐఏఎస్ అధికారిగా పరిచయం చేసుకుంటూ పోలీసులను, న్యాయవాదులను, బిల్డర్లను సైతం బురిడీ కొట్టించాడు. ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ వందల మందిని లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడ్డాడు. చివరకు పోలీసుల వలకు చిక్కాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో వెలుగుచూసిన ఈ నకిలీ ఐఏఎస్ అధికారి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.

చదివింది ఇంటర్.. PMO అధికారిగా చలామణి! 100 మందికి పైగా మోసం చేసిన కేటుగాడు!
Fake IAS Officer
Balaraju Goud
|

Updated on: Nov 25, 2026 | 6:08 PM

Share

భోపాల్: చదివింది కనీసం ఇంటర్మీడియట్ కూడా కాదు.. కానీ తనను తాను ఐఏఎస్ అధికారిగా పరిచయం చేసుకుంటూ పోలీసులను, న్యాయవాదులను, బిల్డర్లను సైతం బురిడీ కొట్టించాడు. ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ వందల మందిని లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడ్డాడు. చివరకు పోలీసుల వలకు చిక్కాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో వెలుగుచూసిన ఈ నకిలీ ఐఏఎస్ అధికారి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.

14 ఏళ్లుగా నకిలీ ఐఏఎస్ అవతారంలో మోసాలు!

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడిని రామానుజ్ గుర్జర్‌గా గుర్తించారు. 2012లోనే ఐఏఎస్ అధికారిగా నటిస్తూ మోసాలకు తెరలేపాడు. ఆ తర్వాత తనను ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారిగా పరిచయం చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానని పలువురిని నమ్మించాడు. అతని మాటతీరు, వ్యవహారశైలి చూసి చాలామంది నిజమైన అధికారిగా భావించి డబ్బులు ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

ఆరుగురు సర్పంచుల నుంచి రూ.12 లక్షలు వసూలు

ఇటీవల భోపాల్‌లోని హబీబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు సర్పంచులను సుమారు రూ.12 లక్షల మేర మోసం చేసినట్లు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు. అతడిపై భోపాల్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే 10కి పైగా మోసం కేసులు నమోదైనట్లు సమాచారం.

సొంత బంధువులనూ వదల్లేదు!

నిందితుడి మోసాలు బయటపడటంతో అతడి నేర చరిత్రలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో జైపూర్‌లో ఓ న్యాయవాదిని మోసం చేసిన కేసులో జైలుకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత పేరు, గుర్తింపు మార్చుకుని మళ్లీ మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఆయుధ లైసెన్సులు ఇప్పిస్తానని చెప్పి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు కూడా వెల్లడైంది.

100 మందికి పైగా బాధితులు?

తన కజిన్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోవడంతో బాధితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఆధారంగా పోలీసులకు సమాచారం అందడంతో దర్యాప్తు వేగవంతమైంది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. నిందితుడు 14 ఏళ్లుగా వివిధ రూపాల్లో మోసాలకు పాల్పడుతూ 100 మందికి పైగా బాధితులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడి పూర్తి నేర చరిత్రను పోలీసులు పరిశీలిస్తున్నారు.

చదువు లేకపోయినా అధికారిగా నటిస్తూ ఎంతోమందిని మోసం చేసిన ఈ ఘటన ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల మరోసారి అప్రమత్తం చేస్తోంది. ఉద్యోగాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల విషయంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు వారి అధికారిక గుర్తింపును తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
PMO అధికారిగా భారీ మోసాలకు పాల్పడ్డ కేటుగాడు.. !
PMO అధికారిగా భారీ మోసాలకు పాల్పడ్డ కేటుగాడు.. !
 100 వ్యూస్‌కు యూట్యూబ్ ఇచ్చే డబ్బెంతో తెలుసా?
 100 వ్యూస్‌కు యూట్యూబ్ ఇచ్చే డబ్బెంతో తెలుసా?
తండ్రి తోపు హీరో.. ఇప్పుడు టీమిండియా క్రికెటర్ భార్య..
తండ్రి తోపు హీరో.. ఇప్పుడు టీమిండియా క్రికెటర్ భార్య..
కూతురు డ్యాన్స్ కు తల్లి సపోర్టు.. హృదయాలను తాకిన సీన్!
కూతురు డ్యాన్స్ కు తల్లి సపోర్టు.. హృదయాలను తాకిన సీన్!
నాన్న సర్జరీ.. ఆ స్టార్ హీరో ఆస్పత్రి బిల్లు కట్టేశారు
నాన్న సర్జరీ.. ఆ స్టార్ హీరో ఆస్పత్రి బిల్లు కట్టేశారు
అప్పుడు డెల్ కంపెనీలో జాబ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు యాక్టర్..
అప్పుడు డెల్ కంపెనీలో జాబ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు యాక్టర్..
ఈ చలికాలంలో ఇండియాలో ఖచ్చితంగా చూడాల్సిన బెస్ట్ ప్రదేశాలివే..!
ఈ చలికాలంలో ఇండియాలో ఖచ్చితంగా చూడాల్సిన బెస్ట్ ప్రదేశాలివే..!
తిరుమలలో శ్రీవారికి కంటే ముందే తొలి నైవేద్యం ఎవరికి సమర్పిస్తారో
తిరుమలలో శ్రీవారికి కంటే ముందే తొలి నైవేద్యం ఎవరికి సమర్పిస్తారో
భారత్ అభివృద్ధి వారి ఆధిపత్యానికి ముప్పేః మోహన్ భగవత్
భారత్ అభివృద్ధి వారి ఆధిపత్యానికి ముప్పేః మోహన్ భగవత్
ఈ 3 రాశులకు కేతువు అనుగ్రహం.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా..!
ఈ 3 రాశులకు కేతువు అనుగ్రహం.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా..!