AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: పంచాచూలి పర్వతాల నుంచి ఉదయించిన భారీ చంద్రుడు.. ఒళ్లు గగుర్పొడిచే అద్భుత దృశ్యం!

ప్రకృతి అందాలకు హిమాలయాలు పెట్టింది పేరు. అక్కడి మంచు పర్వతాలు, సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే తాజాగా ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్న ఓ అద్భుతమైన చంద్రోదయం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. మంచుతో కప్పబడిన పంచాచూలి పర్వత శిఖరాల వెనుక నుంచి భారీ చంద్రుడు నెమ్మదిగా పైకి వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 20 లక్షల మంది వీక్షించినట్లు సమాచారం.

Watch: పంచాచూలి పర్వతాల నుంచి ఉదయించిన భారీ చంద్రుడు.. ఒళ్లు గగుర్పొడిచే అద్భుత దృశ్యం!
Beaver Supermoon
Balaraju Goud
|

Updated on: Nov 25, 2026 | 4:55 PM

Share

ఉత్తరాఖండ్: ప్రకృతి అందాలకు హిమాలయాలు పెట్టింది పేరు. అక్కడి మంచు పర్వతాలు, సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే తాజాగా ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్న ఓ అద్భుతమైన చంద్రోదయం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. మంచుతో కప్పబడిన పంచాచూలి పర్వత శిఖరాల వెనుక నుంచి భారీ చంద్రుడు నెమ్మదిగా పైకి వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 20 లక్షల మంది వీక్షించినట్లు సమాచారం.

వీడియోలో ఏముంది?

ఉత్తరాఖండ్‌లోని మున్సియారి ప్రాంతంలో ఈ అద్భుత దృశ్యం కనిపించింది. పంచాచూలి పర్వతాల వెనుక నుంచి ప్రకాశవంతమైన చంద్రుడు నెమ్మదిగా ఉదయించడం వీడియోలో చూడవచ్చు. నిర్మలమైన ఆకాశం, తెల్లటి మంచుతో మెరిసే పర్వతాలు, వాటి వెనుక నుంచి పైకి వస్తున్న చంద్రుడు.. ఈ దృశ్యం అచ్చం సినిమా సన్నివేశంలా కనిపిస్తోంది. సాగర్ ఆగ్రి అనే వ్యక్తి ఈ దృశ్యాన్ని చిత్రీకరించి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. సాధారణంగా సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూసే మనకు చంద్రుడు పర్వతాల వెనుక నుంచి ఉదయించే దృశ్యం అరుదైన అనుభూతిని కలిగిస్తుంది. కెమెరాలో కంటే ప్రత్యక్షంగా చూస్తే ఈ అందం మరింత అద్భుతంగా ఉంటుందని వీడియోలో సాగర్ పేర్కొన్నారు.

నెటిజన్లు ఏమంటున్నారు?

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ కెమెరా ఈ దృశ్యంలోని అసలైన అందాన్ని పూర్తిగా చూపించలేదని ఒకరు కామెంట్ చేశారు. తాము కూడా పంచాచూలి పర్వతాల వెనుక నుంచి ఇలాంటి చంద్రోదయాన్ని చూశామని మరికొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ దృశ్యం చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోందని ఇంకొందరు వ్యాఖ్యానించారు.

బీవర్ సూపర్‌మూన్ అంటే ఏమిటి?

నవంబర్ నెలలో వచ్చే పౌర్ణమి చంద్రుడిని బీవర్ మూన్ అని పిలుస్తారు. చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చే సమయంలో పౌర్ణమి ఏర్పడితే దాన్ని సూపర్‌మూన్ అంటారు. ఈ సమయంలో చంద్రుడు సాధారణ పౌర్ణమి కంటే కొంచెం పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అయితే చంద్రుడు హోరిజన్ దగ్గర ఉన్నప్పుడు పరిమాణంలో మరింత పెద్దగా కనిపించడం భ్రమాత్మక ప్రభావం వల్ల కూడా జరుగుతుంది.

ఎక్కడుంది మున్సియారి?

మున్సియారి ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్ జిల్లాలో ఉన్న అందమైన పర్వత ప్రాంతం. పంచాచూలి శిఖరాల అద్భుత దృశ్యాలకు ఇది ప్రసిద్ధి. ట్రెక్కింగ్, ప్రకృతి అందాలు, మంచు పర్వతాలను వీక్షించేందుకు పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. మొత్తానికి.. హిమాలయాల అందాలకు చంద్రుడి వెన్నెల తోడవడంతో ఆ ప్రాంతం స్వర్గంలా మారిపోయింది. ఈ అద్భుత చంద్రోదయ వీడియో ఇప్పుడు నెటిజన్లను కట్టిపడేస్తోంది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Sagar Aagri (@mr_pahadi_15)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us