Aata Auditions: మీరు మంచి డ్యాన్సరా? హైదరాబాద్‌లో ‘ఆట’ ఆడిషన్స్.. పూర్తి వివరాలు ఇదిగో
మీరు మంచి డ్యాన్సరా? మీకున్న ట్యాలెంట్ తో ప్రొఫెషనల్ గా డ్యాన్సర్ గా మారాలనుకుంటున్నారా? అయితే జీ తెలుగు మీకు అందిస్తోన్న ఈ సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.బ్లాక్‌బస్టర్ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఆట’ గ్రౌండ్ ఆడిషన్స్ ఇప్పుడు మన హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు మీకోసం..

తెలుగు ఇండస్ట్రీకి అనేక మంది ప్రతిభావంతులైన డాన్సర్లను అందించిన జీ తెలుగు ప్రముఖ డాన్స్ రియాలిటీ షో ‘ఆట’ కొత్త సీజన్‌తో తిరిగి రాబోతోంది. బెంగళూరు, చెన్నైలో విజయవంతంగా ఆడిషన్స్ పూర్తి చేసుకున్న జీ తెలుగు, ఇప్పుడు హైదరాబాద్‌లో విస్తృత ఆడిషన్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రతిభను గౌరవించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, జీ తెలుగు ఆట కొత్త సీజన్‌ను త్వరలోనే ప్రారంభించనుంది. అందరికీ ఇష్టమైన డాన్స్ షోల్లో ఒకటైన ‘ఆట’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడం, డాన్స్ పట్ల మక్కువ ఉన్న వారందరికీ తమ ప్రతిభను ప్రదర్శించే అద్భుత అవకాశం. 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల ఔత్సాహికులను జీ తెలుగు ఆట ఆడిషన్స్‌లో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని ఆహ్వానిస్తోంది. ఆట ఆడిషన్స్ హైదరాబాద్‌లో ఈ ఆదివారం, నవంబర్ 29న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నాయి. డాన్స్ పై మక్కువ గలవారు ఈ ఆదివారం హైదరాబాద్ లోని సారథి స్టూడియో, అమీర్‌పేట లో జరిగే ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ మంచి డాన్సర్ అయితే ఈ ఆడిషన్స్ లో పాల్గొని జీ తెలుగులో ప్రతిష్ఠాత్మక ‘ఆట’ టైటిల్ గెలుచుకునే అవకాశాన్ని మిస్ చేసుకోకండి.
కాగా ఇదే ఆట డ్యాన్స్ రియాలిటీ షోలో సత్తా చాటిన చాలా మంది ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారు. మన శంకర వరప్రసాద్ గారు, ది ప్యారడైజ్ సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ కు నృత్య రీతులు సమకూర్చిన సందీప్ మాస్టర్ అలియాస్ ఆట సందీప్ ఈ రియాలిటీ షో నుంచి వచ్చిన వారే. అలాగే టీనా సాధు, మౌనిక, బెన్నీ మాస్టర్లు కూడా ఆట రియాలిటీ షోలో సత్తా చాటి ఇండస్ట్రీలోకి వచ్చిన వారే.
వీరు అర్హులు..
Aata Stage పై మెరవలి అంటే Auditions లో మీ సత్తా చూపించడానికి సిద్ధంగా ఉండండి
📅 Date: November 29th ⏰ Time: 10 AM – 4 PM 👥 Age Limit: 18–30 Years 📱 9154145100
📍 Venue: Sarathi Studios, Ameerpet, Hyderabad – 500038
#Aata #AataAuditions #ZeeTelugu #ZeeTeluguSpotlight https://t.co/FX2nm12VvH
— ZEE TELUGU (@ZeeTVTelugu) November 24, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




