Bigg Boss Telugu 10: రోహిత్ వెళ్లిపోయాక బిగ్‌బాస్ చూడడం మానేశారు.. ఈసారి కప్పు కొట్టేది ఆ కంటెస్టెంటే: కౌశల్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ను ప్రారంభం నుంచి ఈ షోపై రివ్యూలు ఇస్తున్నాడు రెండో సీజన్ విన్నర్ కౌశల్. ఆసక్తికరమైన వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు. అయితే సీజన్ 10 కు సంబంధించి లాస్ట్ వీడియో రిలీజ్ చేశాడు కౌశల్. పనిలో పనిగా విన్నర్ ఎవరో కూడా తేల్చేశాడు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 దాదాపు తుది అంకానికి వచ్చేసింది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాలిటీ సక్సెస్ ఫుల్ గా 11 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 12 వారం రన్ అవుతోంది. మహా అంటే ఇక మూడు వారాలు మాత్రమే ఈ షో కొనసాగనుంది. ఇప్పటికే హౌస్ లో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే టాస్కులు మొదలయ్యాయి. టాప్-5లో చోటు దక్కించుకునేందుకు కంటెస్టెంట్స్ చెమటోడ్చుతున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 2 రన్నర్ కౌశల్ ప్రతి సీజన్ కు రివ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఎవరు టాప్ 5 లో ఉంటారు? ఎవరు విజేతగా నిలుస్తారు అంటూ తనదైన శైలిలో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అలా పదో సీజన్ కు సంబంధించి కౌశల్ ఇచ్చిన రివ్యూలు, వీడియోలు నెట్టింట బాగా వైరలయ్యాయి. అయితే ఇప్పుడు ఆడియెన్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. బిగ్ బాస్ సీజన్ 10 పూర్తి కావడానికి ఇంకా నాలుగు వారాలు ఉన్నా.. అప్పుడే ఇది తన చివరి రివ్యూ అంటూ ఒక వీడియో విడుదల చేశాడు. ఇందులో కౌశల్ మాట్లాడుతూ
‘బిగ్ బాస్ సీజన్ 10 పై నేను ఇస్తున్న రివ్యూ ఇదే చివరిది. ఇకపై ఈ సీజన్ కి రివ్యూలు ఇవ్వను. మరో వీడియో వదలను.. ప్రతిసారి నేను చెప్పినట్టుగానే విన్నర్, రన్నర్ ప్లేస్ లు ఫిక్స్ అయ్యేవి. కానీ ఈ సీజన్ మాత్రం చాలా మారిపోయింది. నేను ముందు నుంచి రోహిత్, త్రిగుణ్ టాప్ 2 స్థానాల్లో ఉంటారని చెప్పాను. వాళ్లే కప్పు కొట్టాలి. కానీ కొన్ని కారణాలవల్ల రోహిత్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే రోహిత్ కి మళ్లీ బిగ్బాస్ నుంచి కాల్ వచ్చినా రోహిత్ దానిని రిజెక్ట్ చేశాడు. ఇది అతని సొంత నిర్ణయం . ఇక రోహిత్ ని మనం బిగ్ బాస్ లో చూడలేము కాబట్టి ఇక ఎలాగో మిగిలింది త్రిగుణ్ మాత్రమే. అతడే బిగ్ బాస్ సీజన్ 10 విజేత అవ్వొచ్చు. మనం ఎప్పుడైతే నిజాయితీగా అనుకొని ఒక రివ్యూ ఇస్తామో.. వాళ్లు ఫైనల్ లో ఉండకపోతే నిజంగా మనసు బాధపడుతుంది. ఈ సీజన్ లో రోహిత్ ఎప్పుడైతే బయటకు వచ్చేశారో అప్పటికి చాలా మంది బిగ్ బాస్ షో చూడడం ఆపేశారు. కానీ గేమ్ బాగా ఆడేవారు ఫైనల్స్ వరకు ఉండి సత్తా చాటాల్సి ఉంటుంది. కానీ మధ్యలోనే ఆడియన్స్ మెప్పు పొందిన రోహిత్ బయటకు రావడం నిజంగా నమ్మశక్యంగా లేదు. ఇక ఏదేమైతేనే ఈ సీజన్ విన్నర్ త్రిగుణ్.. ముందుగా నీకు శుభాకాంక్షలు’ అని విషెస్ చెప్పారు కౌశల్.
ఇక ఈ వీడియోకు క్యాప్షన్ గా ఇలా రాసుకొచ్చాడు కౌశల్. ‘సాధారణంగా రెండవ వారంలో నేను ఏది ఊహిస్తానో అదే జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని పరిస్థితుల కారణంగా రోహిత్ నాయుడు తప్పుకోవడంతో ఈ సీజన్లో నా రివ్యూలను కొనసాగించాలని నాకనిపించడం లేదు. నిజం చెప్పాలంటే ఈ సీజన్ చాలా సాదాసీదాగా, అంతంతమాత్రంగానే ఉంది. అందుకే వచ్చే సీజన్లో బలమైన కంటెస్టెంట్లతో మరింత పెద్ద వినోదంతో మీ అందరిని చూడాలని ఆశిస్తున్నాను.. వచ్చే సీజన్ కి కలుద్దాం’ అని చెప్పాడు కౌశల్. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ విన్నర్ రిలీజ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కౌశల్ రిలీజ్ చేసిన వీడియో..
View this post on Instagram




