AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu : మహేష్ బాబు ఇంట పెళ్లి సందడి.. కొరియన్ అమ్మాయితో సూపర్ స్టార్ మేనల్లుడి వివాహం.. ఫోటోస్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రలో పెళ్లిళ్ల సీజన్ జోరుగా నడుస్తుంది. అటు స్టార్ హీరోహీరోయిన్స్ సైతం వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రెండో తనయుడు సిద్దార్థ్ గల్లా ఓ ఇంటి వాడయ్యారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం తను ప్రేమించిన సౌత్ కొరియన్ అమ్మాయి హైన్ కిమ్ ని నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.

Mahesh Babu : మహేష్ బాబు ఇంట పెళ్లి సందడి.. కొరియన్ అమ్మాయితో సూపర్ స్టార్ మేనల్లుడి వివాహం.. ఫోటోస్ వైరల్..
Mahesh Babu Nephew
Rajitha Chanti
|

Updated on: Nov 25, 2026 | 3:32 PM

Share

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకున్నాయి. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోహీరోయిన్స్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు మేనల్లుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రెండో కుమారుడు సిద్ధార్థ్ గల్లా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా తాను ప్రేమిస్తున్న దక్షిణ కొరియాకు చెందిన యువతి హైన్ కిమ్ తో ఆయన వివాహం నేడు (నవంబర్ 25) అత్యంత వేడుకగా జరిగింది. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం, ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ఎక్కువ మంది చదివినవి: Akkineni : అన్నపూర్ణ సంస్థకు ఈ సినిమా చాలా ప్రత్యేకం.. 1967లో బాక్సాఫీస్ షేక్ చేసిన అక్కినేని మూవీ ఇదే..

సిద్ధార్థ్ గల్లా, హైన్ కిమ్‌ల వివాహం విదేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ శుభకార్యానికి ఘట్టమనేని, గల్లా కుటుంబ సభ్యులతో పాటు వధువు తరపు బంధువులు మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన అందమైన క్షణాలను మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకోవడంతో ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్‌గా మారాయి. కొత్త జంట చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు, సినీ అభిమానులు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి: Jaya Prada : ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. చాలా మంచి వ్యక్తి.. హీరోయిన్ జయప్రద..

ఒకవైపు కొత్త జంటకు అభినందనలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. బయటకు వచ్చిన పెళ్లి ఫోటోలలో ఎక్కడా సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపించకపోవడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తన సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల మహేష్ బాబు వెళ్లలేకపోయారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ, సిద్ధార్థ్ గల్లా – హైన్ కిమ్ పెళ్లి వేడుకలకు సంబంధించిన పూర్తి స్థాయి ఫోటోలు, వీడియోల కోసం ఘట్టమనేని, గల్లా కుటుంబ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మహేష్ సినిమాల విషయానికి వస్తే.. వారణాసి సినిమా ఇండియానా జోన్స్ తరహాలో సాగే గ్లోబల్ జంగిల్ అడ్వెంచర్ చిత్రమిది. ఇందులో మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టే ఒక సాహసవీరుడు పాత్రలో కనిపించనున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తుండగా, మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతి నాయకుడిగా (విలన్) కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశారు.

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

ఎక్కువ మంది చదివినవి: Raghu Babu : కష్టాల్లో ఉన్నప్పుడు అన్నం పెట్టిన దేవుడు ఆయనే.. ఒక్క సినిమాతో 25 ఏళ్ల ఆస్తులు అమ్ముకున్నాం..

Follow Us