AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1.16 లక్షలకు పైగా చెట్లు నాటిన గ్రామం.. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఊరు ఇదే !!

మన దేశంలోని ఒక గ్రామం మొత్తం ఒక్కటై ప్రకృతిని కాపాడేందుకు ముందుకొస్తే ఎలాంటి అద్భుతాలు సాధ్యమవుతాయో నిరూపిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 1.16 లక్షలకు పైగా స్థానిక చెట్లను నాటి ప్రకృతికే కొత్త ఊపిరినిస్తున్నారు. ఇంతటి గొప్ప పనికి పూనుకున్న ఆ గ్రామం ఏంటి ? ఎక్కడుందో తెలుసుకుందాం..

1.16 లక్షలకు పైగా చెట్లు నాటిన గ్రామం.. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఊరు ఇదే !!
Dawwa Village In Maharashtra
Korivi Jayakumar
|

Updated on: Nov 25, 2026 | 3:18 PM

Share

భూమి మనకు ఇచ్చే అరుదైన కానుక అంటే ఈ ప్రకృతే అని చెప్పాలి. ఓ పక్క మనుషుల సంఖ్య నానాటికీ పెరుగుతూ పోతుంటే.. మరో పక్క చెట్ల సంఖ్య తగ్గుతూ వస్తుంది. అడవులు సైతం క్రమంగా తగ్గిపోవడంతో వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోంది. అందుకే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటాయి. కానీ మన దేశంలోని ఒక గ్రామం మొత్తం ఒక్కటై ప్రకృతిని కాపాడేందుకు ముందుకొస్తే ఎలాంటి అద్భుతాలు సాధ్యమవుతాయో నిరూపిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 1.16 లక్షలకు పైగా స్థానిక చెట్లను నాటి ప్రకృతికే కొత్త ఊపిరినిస్తున్నారు. ఇంతటి గొప్ప పనికి పూనుకున్న ఆ గ్రామం ఏంటి ? ఎక్కడుందో తెలుసుకుందాం..

ఇదే ఆ ఊరు..

దావ్వా గ్రామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 1.16 లక్షలకు పైగా స్థానిక చెట్లను నాటడంతో పాటు సోలార్ విద్యుత్ వినియోగం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ నియంత్రణ వంటి కార్యక్రమాలతో ఈ గ్రామం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పర్యావరణ హిత గ్రామంగా మారిన దావ్వా ఇప్పుడు ఇతర గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇది మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో సడక్ అర్జుని తాలూకాలో ఉంది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 3,418 మంది జనాభా, 796 కుటుంబాలు ఉన్నాయి. ఒకప్పుడు వ్యవసాయ సమస్యలు, నేల నాణ్యత తగ్గడం, అడవుల విస్తీర్ణం తగ్గడం, వర్షాలపై ఆధారపడిన సాగు వంటి సమస్యలను ఎదుర్కొన్న ఈ ప్రాంతం.. ఇప్పుడు పర్యావరణ పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా మారింది.

1.16 లక్షలకు పైగా చెట్లతో పచ్చదనం..

దావ్వా గ్రామం సాధించిన విజయాల్లో ప్రధానమైనది భారీ స్థాయిలో చేపట్టిన మొక్కల పెంపకం కార్యక్రమం. గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామస్తుల సహకారంతో 1,16,643కు పైగా స్థానిక జాతుల చెట్లను నాటారు. వీటితో పాటు 5 వేల వెదురు మొక్కలు, 500 మునగ మొక్కలను కూడా నాటారు. వెటివర్ గడ్డిని పెంచే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. కాగా బృహత్తర కార్యానికి గ్రామంలోని ప్రతి కుటుంబం భాగస్వామ్యమైందని చెబుతారు. ఒక్కో కుటుంబం కనీసం 15 నుంచి 20 మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంది. మొక్కలు నాటడమే కాకుండా వాటి పెరుగుదలపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఇందుకోసం రెండు నర్సరీలను ఏర్పాటు చేయడంతో పాటు 6,520 సీడ్ బాల్స్‌ను పంపిణీ చేసినట్టు వెల్లడిస్తున్నారు.

సోలార్ విద్యుత్‌తో మరో మార్పు..

ఇక పచ్చదనంతో పాటు స్వచ్ఛమైన ఇంధన వినియోగంపైనా దావ్వా గ్రామ పంచాయతీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రజా అవసరాల భవనాల్లో సోలార్ ఫొటోవోల్టాయిక్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు విద్యుత్ అవసరాల కోసం 80 సోలార్ కిట్లను పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో 100 శాతం ఎల్‌ఈడీ లైటింగ్‌ను అమలు చేశారు. దీంతో సంప్రదాయ విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణానికి మేలు చేసే విధానాలను ప్రోత్సహించారు.

మరోవైపు గ్రామంలో భూగర్భ జలాల పెరుగుదలకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా రీచార్జ్ వ్యవస్థలను అభివృద్ధి చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. దీంతో భూగర్భ జలాల రీఛార్జ్‌కు తోడ్పాటు లభించింది. అలానే చెత్త నిర్వహణలోనూ గ్రామం ప్రత్యేక విధానాలను అనుసరిస్తోంది. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, సేంద్రియ వ్యర్థాలతో కంపోస్టు తయారు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఒకసారి వినియోగించి పారేసే ప్లాస్టిక్‌పై నియంత్రణ విధానాలను అమలు చేశారు.

ఆ మహిళా సర్పంచ్ వల్లే..

దావ్వా గ్రామం సాధించిన ఈ మార్పు వెనుక మహిళా సర్పంచ్ యోగేశ్వరి ఛత్రుగన్ చౌదరి నాయకత్వం కీలకంగా నిలిచింది. 2017లో భర్తను కోల్పోయిన ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలను అధిగమించి గ్రామ అభివృద్ధి కోసం ప్రజా జీవితంలోకి వచ్చారు. డిసెంబర్ 2023లో గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టి పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయ అభివృద్ధి, మహిళల భాగస్వామ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గ్రామస్తులు, మహిళా స్వయం సహాయక సంఘాలు, గ్రామ పంచాయతీ సభ్యులు, అధికారుల సహకారంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లారని అంటున్నారు.

దేశంలోనే తొలి గుర్తింపు.. రూ.కోటి బహుమతి

ఈ మేరకు దావ్వా గ్రామం చేపట్టిన ఈ కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2025లో నిర్వహించిన క్లైమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయతీ అవార్డ్స్ (CASPA)లో దావ్వా గ్రామ పంచాయతీ మొదటి స్థానాన్ని సాధించింది. ఈ అవార్డు కింద గ్రామ పంచాయతీకి రూ.కోటి నగదు ప్రోత్సాహకం లభించింది. అంతేకాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘మాఝీ వసుంధర 4.0’ కార్యక్రమంలోనూ పర్యావరణ పరిరక్షణ విభాగంలో మూడో ర్యాంకును సాధించింది. సంత్ గాడ్గే బాబా అవార్డుతో పాటు ఇతర రాష్ట్ర స్థాయి గుర్తింపులు కూడా గ్రామానికి దక్కాయి.

Follow Us
మీరు మహానుభావులు.. 1.16 లక్షలకు పైగా చెట్లు నాటిన గ్రామం ఇదే !
మీరు మహానుభావులు.. 1.16 లక్షలకు పైగా చెట్లు నాటిన గ్రామం ఇదే !
ఏపీలోని లిక్కర్ షాపుల్లో సూపర్ మార్కెట్ తరహా బిల్లింగ్..
ఏపీలోని లిక్కర్ షాపుల్లో సూపర్ మార్కెట్ తరహా బిల్లింగ్..
రైతును రెండు నెలల్లో లక్షాధికారిని చేసే పంట
రైతును రెండు నెలల్లో లక్షాధికారిని చేసే పంట
అల్లు అర్హ బర్త్‌ డే.. శ్రీలంకలో అల్లు ఫ్యామిలీ.. ఫొటోస్ ఇదిగో
అల్లు అర్హ బర్త్‌ డే.. శ్రీలంకలో అల్లు ఫ్యామిలీ.. ఫొటోస్ ఇదిగో
బ్రష్,చేతులు తగలకుండానే టాయిలెట్ శుభ్రంగా ఉండాలా?ఈ సింపుల్ ట్రిక్
బ్రష్,చేతులు తగలకుండానే టాయిలెట్ శుభ్రంగా ఉండాలా?ఈ సింపుల్ ట్రిక్
ఇండస్ట్రీలో నాగార్జున అన్నయ్య అని పిలిచే ఏకైక నటుడు.
ఇండస్ట్రీలో నాగార్జున అన్నయ్య అని పిలిచే ఏకైక నటుడు.
పబ్లిక్‌లో ముద్దు.. ఇండియాలో నిజంగా నేరమా ? రూల్స్ ఏంటంటే ??
పబ్లిక్‌లో ముద్దు.. ఇండియాలో నిజంగా నేరమా ? రూల్స్ ఏంటంటే ??
బ్యాంకు ఖాతాదారులకు RBI అలర్ట్.. రీ-కేవైసీపై అప్డేట్..
బ్యాంకు ఖాతాదారులకు RBI అలర్ట్.. రీ-కేవైసీపై అప్డేట్..
హైదరాబాద్‌లో పవర్ బ్యాంక్ పేలుడు.. ఛార్జింగ్‌లో ఉండగా భారీ బ్లాస్
హైదరాబాద్‌లో పవర్ బ్యాంక్ పేలుడు.. ఛార్జింగ్‌లో ఉండగా భారీ బ్లాస్
జుట్టు పెరగడానికి ఖరీదైన సీరమ్స్ కాదు..రోజూ ఈ 3 వ్యాయామాలు చేయండి
జుట్టు పెరగడానికి ఖరీదైన సీరమ్స్ కాదు..రోజూ ఈ 3 వ్యాయామాలు చేయండి