AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జుట్టు పెరగడానికి ఖరీదైన సీరమ్స్ కాదు.. రోజూ ఈ 3 వ్యాయామాలు చేయండి!

నేటి కాలంలో జుట్టు రాలడం, జుట్టు ఎదుగుదల మందగించడం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలు. ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఎంతోమంది మార్కెట్లో దొరికే ఖరీదైన హెయిర్ సీరమ్స్, నూనెలు, ఇతర ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అయితే, వీటితో పాటు జుట్టు సంరక్షణ కోసం కొన్ని సులభమైన వ్యాయామాలు కూడా చేయవచ్చని మీకు తెలుసా? ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో prachiheals_ అనే పేజీలో షేర్ చేసిన వీడియోలో జుట్టు కుదుళ్ల సంరక్షణ కోసం మూడు పద్ధతులను సూచించారు. ఆ పద్ధతులు ఏమిటో, వాటి వల్ల కలిగే జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

జుట్టు పెరగడానికి ఖరీదైన సీరమ్స్ కాదు.. రోజూ ఈ 3 వ్యాయామాలు చేయండి!
Hair Fall Control
Jyothi Gadda
|

Updated on: Nov 25, 2026 | 2:35 PM

Share

జుట్టు రాలడం, నెమ్మదిగా పెరగడం వంటి సమస్యలకు ఖరీదైన ఉత్పత్తుల బదులు కొన్ని సులభమైన వ్యాయామాలు చేయవచ్చని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇందులో బ్యాక్ కోంబింగ్, జుట్టును సున్నితంగా లాగడం, సర్వాంగాసనం వంటి మూడు పద్ధతులు ఉన్నాయి. ఇవి తల భాగంలో రక్త ప్రసరణను, మసాజ్‌ను అందిస్తాయని చెబుతున్నారు.వివరంగా తెలియాలంటే పూర్తి కథనంలోకి వెళ్లాల్సిందే..

బ్యాక్ కోంబింగ్:

ఈ పద్ధతిలో ముందుగా కాస్త ముందుకు వంగాలి. ఆ తర్వాత మెడ వెనుక భాగంలోని జుట్టు కుదుళ్ల నుంచి దువ్వెనను ముందుకు తీసుకురావాలి. ఇలా సుమారు 2 నుంచి 3 నిమిషాల పాటు చేయాలని వీడియోలో సూచించారు. దీనివల్ల తల చర్మానికి తేలికపాటి ఉత్తేజం కలుగుతుందని చెబుతారు. అయితే, దువ్వెనతో గట్టిగా రుద్దకూడదు. అలా చేస్తే జుట్టు తెగిపోయే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

వేళ్లతో సున్నితమైన మసాజ్, హెయిర్ పుల్లింగ్:

రెండో పద్ధతిలో చేతి వేళ్లను జుట్టు మధ్యలో కుదుళ్ల దగ్గరకు తీసుకెళ్లాలి. జుట్టును సున్నితంగా పట్టుకుని నెమ్మదిగా కదిలించాలి. దీనివల్ల తల చర్మానికి తేలికపాటి మసాజ్ అందుతుంది. జుట్టును గట్టిగా లాగడం వల్ల ఊడిపోయే అవకాశం ఉన్నందున చాలా జాగ్రత్తగా చేయాలి.

సర్వాంగాసనం:

మూడో పద్ధతి సర్వాంగాసనం. ఇది ఒక విలోమ యోగాసనం. ఇందులో శరీర బరువు భుజాలపై ఉండి, కాళ్లు పైకి ఉంటాయి. దీనివల్ల తల వైపునకు రక్త ప్రసరణ పెరుగుతుందని చెబుతారు. మెడ నొప్పి, అధిక రక్తపోటు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నిపుణుల సలహా లేకుండా ఈ ఆసనం వేయకూడదు.

నిజంగానే వీటితో జుట్టు పెరుగుతుందా?

ఈ వ్యాయామాలు జుట్టు పెరుగుదలకు కచ్చితమైన పరిష్కారమని చెప్పలేము. బ్యాక్ కోంబింగ్, హెయిర్ పుల్లింగ్ లేదా సర్వాంగాసనం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుందనడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు లేవు. జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే సమతుల్య ఆహారం, తగినంత ప్రోటీన్, మంచి నిద్ర, సరైన స్కాల్ప్ సంరక్షణ అవసరం. జుట్టు అకస్మాత్తుగా లేదా అధికంగా రాలుతుంటే తప్పకుండా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us