AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందు బాబులు ఇలా ఎందుకు చేస్తారు ? అసలు సీక్రెట్ ఇదేనా ??

మందుబాబుల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఓ పక్క మొత్తుకుంటున్నా కూడా మద్యానికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. అయితే చాలా మంది మద్యం తాగే ముందు గ్లాసులోని కొన్ని చుక్కలను నేలపై చల్లుతుంటారు. దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే మాత్రం పలు విషయాలను బయటపెడుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..

మందు బాబులు ఇలా ఎందుకు చేస్తారు ? అసలు సీక్రెట్ ఇదేనా ??
Strange Habits Of Alcohol Drinkers
Korivi Jayakumar
|

Updated on: Nov 25, 2026 | 4:17 PM

Share

మందుబాబుల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఓ పక్క మొత్తుకుంటున్నా కూడా మద్యానికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాలలోని మందు బాబుల గురించి చెప్పాలంటే.. మద్యం తాగడం అనేది ఇప్పుడు ఒక సాధారణ అలవాటుగా మారిపోయింది. ఒకప్పుడు ఏదైనా ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కనిపించే ఈ అలవాటు, నేడు ఎంతో మందికి రోజువారీ జీవితంలో ఒక భాగమైంది. దేశంలోనే ఎక్కువగా మద్యం తాగే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఏపీ ఎప్పుడూ ముందుంటాయి అంటే అతిశయోక్తి కాదు.

గతంలో పల్లెటూళ్లలో కల్లు, సారా తాగేవారు ఎక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు గ్రామాల్లో కూడా బ్రాండెడ్ మందు, బీర్లు తాగేవారి సంఖ్య బాగా పెరిగింది. ఇక హైదరాబాద్, వైజాగ్ లాంటి పెద్ద నగరాల్లో అయితే వారాంతం (వీకెండ్) వచ్చిందంటే చాలు పబ్బులు, బార్లు కిక్కిరిసిపోతున్నాయి. యువత, ఉద్యోగుల్లో స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. పెళ్లిళ్లు, పుట్టినరోజులు, పండుగలు.. ఇలా కారణం ఏదైనా సరే మందు లేనిదే వేడుక పూర్తి కాదన్నట్లు పరిస్థితి మారింది. మరీ ముఖ్యంగా దసరా, సంక్రాంతి, న్యూ ఇయర్ లాంటి సమయాల్లో అయితే రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడవుతోంది.

ఈ అలవాటును గమనించారా..?

మీ ఫ్రెండ్స్ లేదా మీకు తెలిసిన వారిలో మద్యం తాగే వారు ఉంటే ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించే ఉంటారు. అదే మద్యం తాగే ముందు గ్లాసులోని కొన్ని చుక్కలను నేలపై చల్లుతుంటారు. కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా కానీ ఇది నిజం. మద్యం సేవించే వారిలో ఎక్కువ మంది ఇదే తరహా అలవాటును కొనసాగిస్తున్నట్టు పలు అధ్యయనాల్లో బయటపడింది. అయితే దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే మాత్రం పలు విషయాలను బయటపెడుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..

కారణం ఇదేనా..

ఈ ఆచారానికి మూలం హిందూ మతపు విశ్వాసాలలో కనిపిస్తుంది. పితృకర్మలలో, లేదా తర్పణాలలో, మన పెద్దలకు నీరు లేదా పాలు/అన్నం సమర్పించడం మనం చూస్తూనే ఉంటాం. అలాగే కొన్ని విశ్వాసాల ప్రకారం మద్యం తాగే ముందు నేలపై రెండు చుక్కలు వేయడం అనేది మన పితృదేవతలకు నివాళిగా భావిస్తారు. ఇంకొంతమంది భూమిని దేవతగా చూస్తారు. మనం ఏదైనా తినేముందు లేదా తాగేముందు భూమికి సమర్పించడం ఆనవాయితీగా భావిస్తారు. అందుకే ముందుగా భూమికి చుక్కల రూపంలో సమర్పిస్తే కృతజ్ఞతగా ఉంటుందని చెబుతున్నారు.

ఈ ఆచారం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదని.. యూరప్, ఆఫ్రికా, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి సంప్రదాయాలు ఉన్నాయని అంటున్నారు. వీటిని ఆంగ్లంలో ‘లైబేషన్’ (Libation) అని పిలుస్తారు. అంటే దేవుళ్లు లేదా మరణించిన పూర్వీకుల జ్ఞాపకార్థం కొంత పానీయాన్ని అర్పించడం. ప్రాచీన కాలంలో ప్రజలు దేవుళ్ల ఆశీస్సులు పొందాలని, తమ ప్రయాణాలు, యుద్ధాలు విజయవంతం కావాలని ఇలా పానీయాలను అర్పించేవారు. కాలక్రమేణా ఈ ఆచారం వివిధ సమాజాల్లో సంప్రదాయంగా కొనసాగింది. ముఖ్యంగా గ్రీకు, రోమన్ నాగరికతల్లో ప్రజలు దేవుళ్లకు మద్యం అర్పించడం ఒక ఆచారంగా ఉండేది. తమకు మంచి జరగాలని, దేవతల ఆశీస్సులు లభించాలని ప్రార్థించేవారు.

ప్రతికూల శక్తులు తొలగిపోతాయనే నమ్మకం..

ఈ రకంగా చేయడానికి మరో కారణం కూడా చెబుతుంటారు. మద్యం మొదటి చుక్కలను నేలపై చల్లడం వల్ల దిష్టి, ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని వెల్లడిస్తున్నారు. అయితే ఇవన్నీ ప్రజల్లో ఉన్న సంప్రదాయ విశ్వాసాలు మాత్రమేనని వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేస్తున్నారు.

Follow Us