Watch: తొలి సంపాదనతో కూతురు ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న నాన్న!
తండ్రి ప్రేమకు వెలకట్టలేం.. ఆయన చేసిన త్యాగాలకు ఎంత ఇచ్చినా తక్కువే. అలాంటి తండ్రికి తన మొదటి సంపాదనతో ఓ ఖరీదైన బహుమతి ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది ఓ కూతురు. కూతురు ఇచ్చిన గిఫ్ట్ చూసి ఆ తండ్రి ఆనందంతో భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.

తండ్రి ప్రేమకు వెలకట్టలేం.. ఆయన చేసిన త్యాగాలకు ఎంత ఇచ్చినా తక్కువే. అలాంటి తండ్రికి తన మొదటి సంపాదనతో ఓ ఖరీదైన బహుమతి ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది ఓ కూతురు. కూతురు ఇచ్చిన గిఫ్ట్ చూసి ఆ తండ్రి ఆనందంతో భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.
వీడియోలో ఏం జరిగింది?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్న గదిలో తండ్రి, కూతురు కనిపిస్తారు. తండ్రి చేతిలో వార్తాపత్రికలో చుట్టిన ఓ చిన్న బహుమతి ఉంది. కూతురు చిరునవ్వుతో తన తండ్రి ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి నెమ్మదిగా ఆ ప్యాకెట్‌ను విప్పి చూడగా అందులో బైక్ తాళం చెవి కనిపించింది. అది చూసిన వెంటనే ఆయన ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా, కూతురు కూడా తండ్రి సంతోషాన్ని చూసి మురిసిపోతుంది.
తండ్రికి రాయల్ ఎన్‌ఫీల్డ్ గిఫ్ట్!
ఈ కూతురు తన మొదటి సంపాదనతో తండ్రికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌ను బహుమతిగా ఇచ్చింది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా @mndavi_shrmaలో షేర్ చేసింది. “ఆయన తన జీవితమంతా నాకు అన్నీ ఇచ్చారు. ఈరోజు నా సంపాదనతో ఆయనకు తిరిగి ఏదైనా ఇచ్చే అవకాశం వచ్చింది” అంటూ భావోద్వేగమైన క్యాప్షన్ జత చేసింది. అనంతరం పార్ట్ 2 వీడియోలో తన తండ్రి కొత్త బుల్లెట్ బైక్‌తో ఫొటోలకు పోజులిస్తూ కనిపించాడు.
నెటిజన్ల మనసు గెలుచుకున్న వీడియో
ఈ వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. తండ్రి కళ్లలో ఆనందభాష్పాలు చూసి తమకు కూడా కన్నీళ్లు వచ్చాయని కామెంట్లు చేస్తున్నారు. కూతురి ప్రేమకు, తండ్రి ఆనందానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. జీవితంలో తల్లిదండ్రులకు తిరిగి ఇచ్చే చిన్న బహుమతి కూడా ఎంతో విలువైనదని ప్రశంసిస్తున్నారు. డబ్బుతో కొనలేనిది ప్రేమ.. ఆ ప్రేమను తన మొదటి సంపాదనతో తండ్రికి అందించిన ఈ కూతురి వీడియో ఇప్పుడు నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
