చాణక్య నీతి : మనసును అదుపులో ఉంచే ఐదు రహస్యాలు ఇవే

samatha

24 November 2026

Pic credit - Pinterest

ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనకాలంలో అత్యంత జ్ఞానవంతుడిగా ఈయన మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు.

ఆచార్య చాణక్యుడు

చాణక్యుడు ప్రతి విషయంపై లోతైన అవగాహన ఉంటుంది. అందుకే ఆయనను అపరమేధావి అంటారు. చాణక్యుడు చాలా విషయాల గురించి తన నీతి శాస్త్రంలో ప్రస్తావించడం జరిగింది.

లోతైన అవగాహన

అదే విధంగా ఆయన మనసును ఎలా అదుపులో ఉంచుకోవాలి? దానికి సంబంధించిన ఐదు రహస్యాల గురించి వెల్లడించడం జరిగింది. అవి ఏవో తెలుసుకుందాం.

మనసు

మనిషి జీవితంలో అతి పెద్ద సవాలు తన మనసును నియంత్రించడం. వర్తమానంలో జీవించలేక, గతం గురించి పదేపదే బాధపడుతూ, భవిష్యత్తు గురించి అనవసరంగా భయపడుతూ, చిన్న విషయాలకే అతిగా ఆలోచిస్తూ చాలామంది మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు.

మనసును నియంత్రించడం

 మనం తరచుగా గతంలో జరిగిన తప్పుల గురించి, అవమానాల గురించి ఆలోచిస్తూ బాధపడతాం. చాణక్యుడు గతాన్ని కాలిపోయిన బూడిదతో పోల్చారు. దాని నుండి మనం నేర్చుకోవాల్సింది పాఠం మాత్రమే, బాధని కాదు అని ఆయన స్పష్టం చేశారు.

గతం

మనిషికి శత్రువులు బయటెక్కడో ఉండరు. వాడిలో ఉన్న కోరికలే వాడికి అతి పెద్ద శత్రువులు. మనకు దొరకని వాటి కోసం ఆశపడటం, ఇతరులతో పోల్చుకుని అసూయపడటం వల్ల మనసు ప్రశాంతతను కోల్పోతుంది.

కోరికలు

మనసును నియంత్రించడంలో కీలకమైనది భావోద్వేగాలపై అదుపు. ముఖ్యంగా కోపం. కోపం అనేది మన ఆలోచనలను స్తంభింపజేసే ఒక పెద్ద తాళం లాంటిది. కోపం వచ్చినప్పుడు మనసు మన కంట్రోల్‌లో ఉండదు, అప్పుడే మనం ప్రశాంతంగా ఉండాలి.

భావోద్వేగాలు