AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫీసులో నిద్రమత్తు ఇబ్బందిపెడుతోందా..? ఇలా చేస్తే రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు!

రాత్రిపూట తగినంత సమయం నిద్రపోయినా పగటిపూట, ముఖ్యంగా ఆఫీసులో కూర్చున్నప్పుడు పదే పదే నిద్ర వస్తోందా? దీనికి నిద్రలేమి ఒక్కటే కారణం కాకపోవచ్చు. మన ఆహారపు అలవాట్లు, కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా నిద్రమత్తుకు కారణమవుతాయి. అసలు పగటిపూట నిద్ర ఎందుకు వస్తుంది? ఆఫీసులో నిద్ర రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఆఫీసులో నిద్రమత్తు ఇబ్బందిపెడుతోందా..? ఇలా చేస్తే రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు!
Feeling Sleepy
Janardhan Veluru
|

Updated on: Nov 25, 2026 | 6:16 PM

Share

రాత్రి బాగా నిద్రపోయినా చాలా మందికి ఉదయం ఆఫీసుకు వెళ్లిన తర్వాత కూడా పగటిపూట నిద్ర వస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కళ్లు మూతపడటం, పదే పదే ఆవలింతలు రావడం, పని మీద దృష్టి పెట్టలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలా ఆఫీసులో నిద్ర రావడం వల్ల పని సామర్థ్యం తగ్గడంతో పాటు రోజువారీ పనులపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే దీనికి కేవలం నిద్రలేమి మాత్రమే కారణం కాదు. కొన్ని ఆరోగ్య సమస్యలు, ఆహారపు అలవాట్లు కూడా ఇందుకు కారణం కావచ్చంటున్నారు వైద్య నిపుణులు.

పగటిపూట నిద్ర రావడానికి కారణాలేంటి?

రాత్రిపూట సరైన నిద్ర లేకపోవడం: రోజూ కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోకపోయినా.. రాత్రి నిద్ర మధ్యలో పదే పదే మెలకువ వచ్చినా నిద్రకు భంగం కలుగుతుంది. దీంతో పగటిపూట నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. నిద్ర సమయం సరిపోవడంతో పాటు నిద్ర నాణ్యత కూడా చాలా ముఖ్యమే.

ఆరోగ్య సమస్యలు: డిప్రెషన్, ఆందోళన, హైపోథైరాయిడిజం, పార్కిన్సన్స్ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి సమస్యలు కొందరిలో పగటిపూట అధిక నిద్రకు కారణం కావచ్చు. నార్కోలెప్సీ వంటి నిద్ర సంబంధిత నాడీ వ్యవస్థ సమస్యల వల్ల కూడా ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర వచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

ఆహారపు అలవాట్లు: మధ్యాహ్నం ఎక్కువగా భోజనం చేయడం, అధికంగా తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల కొందరిలో భోజనం తర్వాత నీరసం, నిద్రమత్తు పెరుగుతుంది. వైట్ బ్రెడ్, తెల్ల బియ్యం, చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం కూడా శక్తి స్థాయిలపై ప్రభావం చూపించే అవకాశముంది.

ఒకే చోట కూర్చొని పనిచేయడం: గంటల తరబడి కదలకుండా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేస్తే శరీరం బద్ధకంగా మారుతుంది. దీనివల్ల అలసట, ఆవలింతలు, నిద్రమత్తు పెరిగే అవకాశముంది.

ఆఫీసులో నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

1. కొద్దిసేపు నడవండి: గంటల తరబడి ఒకే చోట కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి నడవాలి. వీలైతే ప్రతి గంటకు కొన్ని నిమిషాలు నడవడం లేదా నిలబడటం అలవాటు చేసుకోవాలి. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచేందుకు సహాయపడుతుంది.

2. తేలికపాటి భోజనం చేయండి: మధ్యాహ్నం భారీగా భోజనం చేయకుండా తేలికపాటి, పోషకాహారాన్ని తీసుకోవాలి. భోజనంలో కూరగాయలు, పండ్లు, పప్పులు వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అధిక చక్కెర, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం మంచిది.

3. టీ లేదా కాఫీ పరిమితంగా తీసుకోండి: నిద్రమత్తుగా అనిపించినప్పుడు పరిమితంగా టీ లేదా కాఫీ తీసుకోవచ్చు. వీటిలో ఉండే కెఫీన్ కొంతసేపు యాక్టివ్‌గా ఉండేందుకు సహాయపడుతుంది. అయితే అధికంగా తీసుకోవడం వల్ల రాత్రి నిద్రకు ఆటంకం కలిగే అవకాశముంది.

4. డెస్క్ దగ్గరే చిన్నపాటి వ్యాయామాలు: కుర్చీలో కూర్చొని మెడను నెమ్మదిగా తిప్పడం, చేతులను చాపడం, పాదాలను కదిలించడం వంటి చిన్నపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయవచ్చు. ఇవి శరీరంలోని బిగుతును తగ్గించి చురుకుదనాన్ని పెంచుతాయి.

5. సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలి: ఆఫీసులో ఎక్కువసేపు గదిలోనే ఉండకుండా విరామ సమయంలో బయటకు వెళ్లి కొద్దిసేపు నడవండి. సహజమైన వెలుతురు, స్వచ్ఛమైన గాలి మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి.

ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి?

రాత్రిపూట తగినంత నిద్రపోతున్నప్పటికీ ప్రతిరోజూ పగటిపూట తీవ్రమైన నిద్రమత్తు వస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా గురక, నిద్రలో శ్వాస ఆగినట్లు అనిపించడం, ఉదయం తలనొప్పి, రోజంతా అలసట వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. స్లీప్ అప్నియా లేదా ఇతర నిద్ర సంబంధిత సమస్యలు ఉన్నాయేమో పరీక్షించుకోవాల్సి ఉంటుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన అంశాలు కేవలం అవగాహనకు మాత్రమే. పగటిపూట నిద్రమత్తు తరచుగా వస్తూ రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తే వైద్యుల సలహా తీసుకోవాలి.

Follow Us
ఆఫీసులో పదే పదే నిద్ర వస్తోందా? కారణాలు ఇవే కావొచ్చు
ఆఫీసులో పదే పదే నిద్ర వస్తోందా? కారణాలు ఇవే కావొచ్చు
పెద్దలు చేసిన పాపాలు పిల్లలను వెంటాడుతాయా? హిందూ ధర్మం ఏమంటోంది
పెద్దలు చేసిన పాపాలు పిల్లలను వెంటాడుతాయా? హిందూ ధర్మం ఏమంటోంది
PMO అధికారిగా భారీ మోసాలకు పాల్పడ్డ కేటుగాడు.. !
PMO అధికారిగా భారీ మోసాలకు పాల్పడ్డ కేటుగాడు.. !
 100 వ్యూస్‌కు యూట్యూబ్ ఇచ్చే డబ్బెంతో తెలుసా?
 100 వ్యూస్‌కు యూట్యూబ్ ఇచ్చే డబ్బెంతో తెలుసా?
తండ్రి తోపు హీరో.. ఇప్పుడు టీమిండియా క్రికెటర్ భార్య..
తండ్రి తోపు హీరో.. ఇప్పుడు టీమిండియా క్రికెటర్ భార్య..
కూతురు డ్యాన్స్ కు తల్లి సపోర్టు.. హృదయాలను తాకిన సీన్!
కూతురు డ్యాన్స్ కు తల్లి సపోర్టు.. హృదయాలను తాకిన సీన్!
నాన్న సర్జరీ.. ఆ స్టార్ హీరో ఆస్పత్రి బిల్లు కట్టేశారు
నాన్న సర్జరీ.. ఆ స్టార్ హీరో ఆస్పత్రి బిల్లు కట్టేశారు
అప్పుడు డెల్ కంపెనీలో జాబ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు యాక్టర్..
అప్పుడు డెల్ కంపెనీలో జాబ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు యాక్టర్..
ఈ చలికాలంలో ఇండియాలో ఖచ్చితంగా చూడాల్సిన బెస్ట్ ప్రదేశాలివే..!
ఈ చలికాలంలో ఇండియాలో ఖచ్చితంగా చూడాల్సిన బెస్ట్ ప్రదేశాలివే..!
తిరుమలలో శ్రీవారికి కంటే ముందే తొలి నైవేద్యం ఎవరికి సమర్పిస్తారో
తిరుమలలో శ్రీవారికి కంటే ముందే తొలి నైవేద్యం ఎవరికి సమర్పిస్తారో