ముఖంపై ముడతలు తగ్గాలా? ఐతే పైనాపిల్ తినండి
20 October 2026
TV9 Telugu
TV9 Telugu
పైనాపిల్ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి వల్ల మన శరీరం కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది
TV9 Telugu
ఇది చర్మం సాగే గుణాన్ని ప్రేరేపిస్తుంది. చర్మం దృఢంగా ఉండేలా చేస్తుంది. పైనాపిల్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి
TV9 Telugu
ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ముఖంపై ముడతలు, మచ్చలు, గీతలు ఉండవు. ముఖం కాంతివంతంగా మారుతుంది
TV9 Telugu
పైనాపిల్ పండ్లలో బ్రొమెలెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మనం తినే ప్రోటీన్లను త్వరగా జీర్ణం చేస్తుంది
TV9 Telugu
మాంసాహారం తిన్నప్పుడు సరిగ్గా జీర్ణం అవ్వాలంటే పైనాపిల్ పండ్లకు చెందిన ముక్కలను నమిలి తింటుంటే ఫలితం ఉంటుంది
TV9 Telugu
ప్రోటీన్లను త్వరగా జీర్ణం చేసే శక్తి పైనాపిల్ కు ఉంటుంది. ఈ పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది
TV9 Telugu
తరచూ తింటుంటే గ్యాస్, కడుపు ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది
TV9 Telugu
పైనాపిల్ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఆర్థరైటిస్, సైనస్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. వాపు తగ్గిస్తాయి
మరిన్ని వెబ్ స్టోరీస్
చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్
కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది?
పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి