AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో దడ పుట్టిస్తున్న విద్యుత్‌ డిమాండ్‌

తెలుగు రాష్ట్రాల్లో దడ పుట్టిస్తున్న విద్యుత్‌ డిమాండ్‌

Phani CH
|

Updated on: Oct 20, 2026 | 4:07 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరడంతో ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది. తెలంగాణలో అక్టోబర్ 15న గరిష్ఠ విద్యుత్ డిమాండ్ తొలిసారిగా 20,003 మెగావాట్లకు చేరింది. ఏపీలోనూ ఎండల తీవ్రతతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. డిమాండ్‌ను అందుకోవడానికి యూనిట్‌కు రూ.10 వరకు చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. రానున్న నెలల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ పొదుపుపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్‌ డిమాండ్‌ దడ పుట్టిస్తోంది. తెలంగాణలో తొలిసారిగా గరిష్ఠ డిమాండ్‌ 20 వేల మెగావాట్ల మార్కును దాటింది. అటు ఏపీలోనూ విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. డిమాండ్‌కు తగ్గ సరఫరా కోసం ప్రైవేట్‌ మార్కెట్‌లో భారీ మొత్తాన్ని చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. రానున్న నెలల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చన్న హెచ్చరికలతో విద్యుత్‌ సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ పరిస్థితికి కారణాలేంటి..? ప్రభుత్వాల ముందున్న సవాళ్లేంటి..? తెలంగాణలో విద్యుత్ వినియోగం సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 20 వేల మెగావాట్ల మార్కును దాటి 20 వేల 3 మెగావాట్లకు చేరింది. అక్టోబర్ 15న ఈ స్థాయి డిమాండ్ నమోదైంది. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా 334.54 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు విద్యుత్ శాఖ వెల్లడించింది. గత ఏడాది మార్చి 27న నమోదైన 18 వేల 548 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ ఇప్పటివరకు రికార్డుగా ఉంది. తాజాగా నమోదైన 20 వేల 3 మెగావాట్ల డిమాండ్‌తో ఆ రికార్డు అధిగమించింది. సాధారణంగా వేసవిలో ఈ స్థాయి విద్యుత్ వినియోగం ఉంటుంది. అయితే ఈసారి అక్టోబర్‌లోనే డిమాండ్ కొత్త శిఖరాలను తాకింది.పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలు, వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. అయినప్పటికీ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. అక్టోబర్ 15న నగరంలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 4 వేల 220 మెగావాట్లకు చేరగా, అదే రోజు 85.65 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగమైంది. అక్టోబర్ 9న నగరంలో అత్యధికంగా 88.22 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైంది. నగరంలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు గరిష్ఠ డిమాండ్‌ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లో ఏసీ ఉష్ణోగ్రతను 25 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్రామాణికంగా నిర్వహించాలని ఆదేశించింది. అటు ఏపీలోనూ ఎల్‌నినో ఎఫెక్ట్‌ విద్యుత్ రంగాన్ని కుదిపేస్తోంది. అక్టోబర్‌లోనూ ఎండల తీవ్రత తగ్గకపోవడంతో ఏసీలు, కూలర్లు, మోటార్ల వినియోగం భారీగా పెరిగిపోయింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. అక్టోబర్ 1 నుంచి 16 మధ్య రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది 225 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడితే.. ఈసారి అది ఏకంగా 282 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. కేవలం పదిహేను రోజుల్లోనే అదనంగా 65 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది. రోజువారీ డిమాండ్ తీర్చలేక ప్రభుత్వం ప్రైవేట్ మార్కెట్‌లో యూనిట్ రూ.10 వరకు వెచ్చించి విద్యుత్ కొనాల్సి వస్తోంది. దీనివల్ల రోజూ ప్రభుత్వానికి 6 నుంచి 7 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతోంది. రానున్న మూడు, నాలుగు నెలలు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో ప్రజలు విద్యుత్‌ వినియోగంలో పొదుపు పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఏసీలు, ఫ్యాన్లు పరిమితంగా వాడాలని, చెబుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ఆహార నిల్వల్లో దూసుకెళ్తున్న చైనా.. మరి భారత్‌ పరిస్థితేంటి?

అమ్మ కోసం 12 జ్యోతిర్లింగాలకు పరుగు.. రోజుకు 50 కి.మీ. రన్..

సముద్ర తీరానికి కొట్టుకొస్తున్న ఐఫోన్లు.. ఎగబడిన జనాలు

గుడిముందు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

టైప్-1 షుగర్‌ బాధలకు చెక్‌! 14 ఏళ్ల వరంగల్ కుర్రాడి జీవితమే దీనికి ఉదాహరణ!

Follow Us